BigTV English

Satyavedu Tour Updates: లోకేష్ సత్యవేడు టూర్.. ఆదిమూలం పరిస్థితి ఏంటి?

Satyavedu Tour Updates: లోకేష్ సత్యవేడు టూర్.. ఆదిమూలం పరిస్థితి ఏంటి?

Satyavedu Tour Updates: సత్యవేడులో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పర్యటనపై సర్వత్రా అసక్తి నెలకొంది… రెండు రోజుల పాటు జరిగే నారా లోకేష్ పర్యటనలో కార్యకర్తల సమవేశం ఏర్పాటు చేసారు. కార్యకర్తల సమావేశానికి స్థానిక ఎమ్మెల్యేకు అహ్వనం ఉంటుందా అన్నది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. రాసలీలల వీడియోలు బయటపడ్డంతో ఎమ్మెల్యేఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్సెండ్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు సమావేశానికి అహ్వనం ఉంటుందా లేదా? …నూతన ఇన్ చార్జ్ నియామకం ఉంటుందా అన్నదా సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది..


రెండు రోజులు సత్యవేడులో పర్యటించనున్న నారా లోకేష్

తెలుగుదేశం జాతీయ ప్రధానకార్యదర్శి..యువనేత మంత్రి నారాలోకేష్ రెండు రోజుల పాటు తిరుపతి జిల్లా సత్యవేడు లో పర్యటించనున్నారు. ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్ళినా సీఎం చంద్రబాబుతో పాటు యువనేత కూడా అయా నియోజకవర్గాలలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అదేవిధంగా మంత్రి నారాలోకేష్ ఈ నెల7వ తేదీ సాయంత్రం ఓ ప్రయివేట్ కళ్యాణమండపంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. 8వ తేదీ శ్రీసిటిలో జరిగే ఎల్ ప్లాంట్ భూమి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు..ఇందుకు గాను నియోజకవర్గంలో విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.కార్యకర్తల సమావేశానికి గాను ఏర్పాట్లను శాప్ చైర్మన్ రవి నాయుడుతో పాటు నియోజక వర్గ పరిశీలకుడు చంద్రశేఖర్ పర్వవేక్షిస్తున్నారు. అయితే ఈ విషయాలన్నీ స్థానిక ఎమ్మెల్యే ఆది మూలం వర్గానికి రుచించడం లేదంట.


పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే ఆదిమూలం

రాసలీలల వీడియోలు బయటపడటంతో పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆదిమూలాన్ని బహిష్కరించినప్పటికీ అధికారక కార్యక్రమాలలో అయన చురుగ్గా పాల్గొంటున్నారు. దాంతో పాటు అయన అనుచర వర్గం కూడా హాడావుడి చేస్తుంది. మరో వైపు అయన పై కేసు పెట్టిన మహిళ నాయకురాలు సైతం కొంతకాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయ్యారు. అయితే తమ నాయకుడిని కావాలని తొక్కి పెట్టారంటూ ఎమ్మెల్యే వర్గం అరోపిస్తుంది. మరో వైపు ఎమ్మెల్యే ఆదిమూలం కూమారుడు, నారాయణవనం జడ్పీటీసీ సుమన్ తనకు నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి కావాలని టీడీపీ సీనియర్ నేత గంగా ప్రసాద్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం..

సత్యవేడు టీడీపీ ఇన్చార్జ్ పదవి ఆశిస్తున్న డాక్టర్ శ్రీపతిబాబు

అయితే సత్యవేడు టీడీపీ ఇన్చార్జ్ పదవి కోసం తెలుగు యువతలో సీనియర్ నాయకుడు అయిన డాక్టర్ శ్రీపతి బాబు సీన్సియర్ గా ప్రయత్నిస్తున్నారంట . అయనకు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అశ్శీసులతో పాటు పార్లమెంటు అధ్యక్షుడు నరసింహయాదవ్ మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికితోడు యూత్ లీడర్ కావడంతో లోకేష్ టీమ్‌తో సత్సంబంధాలు ఉన్నాయంట. అయితే మాజీ ఎమ్మెల్యే హేమలత కూడా తన కూమార్తె కు మరో సారి అవకాశం ఇవ్వమని కోరుతున్నారంట.గత ఎన్నికల ముందు హేమలత కుమార్తె అక్కడపార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. చివర్లో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డిని వ్యతిరేకించి వైసీపీ నుంచి బయటకు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలానికి టీడీపీ టికెట్ దక్కి ఎమ్మెల్యే అయ్యారు.

కొత్త ఇన్చార్జ్‌ని నియమించాలని కోరుతున్న ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం

చాలమంది క్యాడర్ వ్యతిరేకించినప్పటి ఆదిమూలం ఎన్నికల్లో కూటమి గాలిలో విజయం సాధించగలిగారు. ఇలాంటి స్థితిలో అయన వ్యవహార శైలిని వ్యతిరేకించిన నాయకులు కొంతమంది కావాలని ట్రాప్ చేసి రాసలీలల ఇష్యూలో ఇరికించారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయన అధికారిక కార్యక్రమాలలో మాత్రమే యాక్టివ్ ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో అసలు కనిపించడం లేదు. ఇలాంటి స్థితిలో నియోజక వర్గంలో పార్టీ క్యాడర్ అయోమయం ఉంది. ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం నూతన ఇన్చార్జ్‌ని నియమించాలని కోరుతుంది. ఎమ్మెల్యే అనుకూల వర్గం సుమన్ కు అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

Also Read: షాద్ నగర్ BRS లో కొట్లాట.. ఎందుకంటే..?

లోకేష్ నిర్వహించే సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొంటారా?

ఈ తతంగానికి తోడు కొంతమంది క్యాస్ట్ కార్డుతో పార్టీని ఇబ్బంది పెట్టడానికి సిద్దమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ నిర్వహించే సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొంటారా?లేక అయన లేకుండా నిర్వహిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది. దాంతో పాటు పార్టీ సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తారా అన్న దానిపై చర్చ నడుస్తుంది. మొత్తం మీద ఎమ్మెల్యే ఉన్నప్పటికి పార్టీ సమావేశాలకు హాజరు కాలేని పరిస్థితి రాష్ట్రలో ఏ నియోజక వర్గంలోను లేదు. ఆ క్రమంలో లోకేష్ నియోజకవర్గ క్యాడర్ కు ఏలాంటి హామీ ఇవ్వ బోతున్నారన్నది ఇప్పుడు అసక్తికరంగా మారింది.

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×