Intinti Ramayanam Today Episode May 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆరాధ్య కోసం స్కూల్ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆరోగ్యం ఏంటి ఇంకా స్కూల్ కి రాలేదు నేను జాబ్ మానేసిన తర్వాత ఆ స్కూల్ కి పంపిస్తానని అన్నారు కదా ఇప్పుడు స్కూల్ మానింగ్ చేసారా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆరాధ్య చూడకుండా అస్సలు ఉండలేకపోతున్నాను. ఇంకా ఆరాధ్యను స్కూల్ కి తీసుకురాలేదేంటి అని అవని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే ఆరాధ్య కారు నుంచి బయటకు దిగడం చూసి అవన్నీ సంతోషపడుతుంది. నా కూతుర్ని నేను దూరం నుంచి చూసుకొని సంతోష పడాలి అని బాధపడుతుంది. ఆరాధ్యను తీసుకోని వెళ్ళిపోతాడు. అవని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని ఆరాధ్య కోసం మా ఇంటికి వెళ్తుంది ఒక్కసారైనా తనని చూడాలని తన బిడ్డ కోసం తల్లడిల్లిపోతుంది. ఆరాధ్య తన తల్లిని చూడడానికి ఎవరు చూడకుండా పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేను అమ్మ నీకోసం నేను వచ్చేస్తాను అని ఆరాధ్య అంటుంది. అసలు నాన్న ఎందుకు అమ్మ నువ్వు మంచి దానివి కాదని అంటున్నాడు. ఏం జరిగిందమ్మా చెప్పు అంటే నీది అర్థం చేసుకునే వయసు కాదు ఆరాధ్య అందుకే నీకేం చెప్పలేకపోతున్నాను. మరి నాన్న మంచివాడు కాదా అని అడుగుతుంది. నాన్న చాలా మంచి వాడి అమ్మ కానీ నేనంటేనే కాస్త కోపం అందుకే మనిద్దరిని కలవనివ్వకుండా చేస్తున్నాడు అంతే తప్ప నాన్న అంత చెడ్డవాడు కాదు అని చెప్తుంది..
ఇక ఆరాధ్య రూంలో కూర్చుని ఒంటరిగా ఉండడంతో అక్షయ అక్కడికి వెళ్తాడు. నీకు ఎక్కడి కావాలో అక్కడ తీసుకెళ్తాను మీ ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామా లేకపోతే నీకేం తినాలనిపిస్తుంది చెప్పు మనిద్దరం వెళ్లేసి తీసుకొని వద్దామని ఆప్షన్ అంటాడు. నాకు ఏమీ వద్దు నాన్న అమ్మని ఎందుకు నువ్వు దూరం పెడుతున్నావ్? నీకు అమ్మ అంటే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతుంది. అమ్మ చేసే పనుల గురించి నీకు చెప్పలేనమ్మ అందుకే అమ్మ పై నేను కోప్పడుతున్నాను అంతే తప్ప నాకు ఇంకేమి వేరే కోపం లేదు అని అంటాడు అక్షయ్.. అమ్మ లేకుంటే నేను ఉండను నాన్న అని ఆరాధ్య వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా అవనిలే చేస్తున్నా అని ఆలోచిస్తూ అక్షయ అవని దగ్గరికి వెళ్తాడు..
అక్షయ్ అవని ఆరాధ్యను పూర్తిగా మార్చేస్తుందా? ఈ విషయం ఎలాగైనా అవని దగ్గర తేల్చుకోవాలని అక్షయ అవని దగ్గరికి వెళ్తాడు. నా గురించి నేను మంచివాడినని నా కూతురికి చెప్పావంట.. నా కూతురికి చెప్తే ఆ విషయం నా దగ్గర ఖచ్చితంగా చెప్తుందని నువ్వు ప్లాన్ వేసావు కదా అని అక్షయ్ అంటాడు. కానీ అవని మాత్రం నా గురించి మీరు తప్పుగానే ఆలోచిస్తారా? తల్లి నుంచి బిడ్డను వేరు చేస్తారా? ఎందుకు నా కూతుర్ని నీకు దూరం చేయాలని చూసినా నువ్వు దగ్గర అవ్వాలని చూస్తున్నావ్ అని అక్షయ్ అడుగుతాడు. మీరెందుకు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. నా కూతురు జోలికి ఇంకొకసారి వస్తే మాటలతో చెప్పనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
ఇక రాజేంద్రప్రసాద్ తో పార్వతి మాట్లాడుతుంది. ఆరాధ్య విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని పార్వతి అంటుంది. అక్షయ్ కూడా ఏమి మాట్లాడుకుంటా ఉంటాడు. రాజేంద్రప్రసాద్ మాత్రం మొగుడు పెళ్ళాల మధ్యలో బిడ్డని ఇది చేయడం మంచిది కాదు కదా అనేసి దిమ్మతిరిగేలా చెప్తాడు. ఇక భానుమతి కూడా రాజేంద్రప్రసాద్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. అరె అక్షయ్ ఆ ప్రస్తుతాని కోసమైనా మీరు అవని కలిసిపోతే బాగుంటుంది అని అంటుంది. ఆ మాట విన్న కమల్ ముసలిదానికి డోస్ బాగా పనిచేసింది అని కమల్ అంటాడు.
ఇక అందరూ భోజనం చేద్దామని అక్కడికి వెళ్తారు.. ఇంకా రాలేదు ఏంటి అని పల్లవిని తీసుకురమ్మని పార్వతి అంటుంది. అయితే శ్రీకర్ ఆరాధ్యను తీసుకొని వస్తాడు. ఆరాధ్యకు అన్నం పెట్టాలని అక్షయ అడిగితే నాకు ఏ అన్నం వద్దు నాకు మా అమ్మ గుర్తొస్తుంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఇక అందరూ ఒక్కొక్కరు భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజేంద్రప్రసాద్ మాత్రం ఆరాధ్యకు భోజనం తీసుకుని వెళ్లి తినిపించాలని మాట్లాడుతాడు. పార్వతి దగ్గరికి వచ్చి నువ్వు నీ కొడుకు దగ్గర ఉన్నావు నేను నా అమ్మ దగ్గర ఉంటే తప్పేంటి నానమ్మ అని అడుగుతుంది. పార్వతి ఏమి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతుంది.
ఉదయం లేవగానే ఆరాధ్య స్వరాజ్యం వాళ్ళింట్లో అవని దగ్గర ఉంటుంది. సరదాగా నవ్వుతూ భోజనం చేస్తూ ఉంటుంది. దయాకరు మీ నాన్న వచ్చి ఇంటికి రమ్మని అంటే నువ్వు వెళ్తావా అని అడుగుతాడు. నేను ఎక్కడికి వెళ్ళను మమ్మ దగ్గరే ఉంటానని చెప్తానని అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఆమనిపై అక్షయ్ కిడ్నాప్ కేసు పెడతాడు పోలీసులను అరెస్ట్ చేస్తారా? లేదా అన్నది చూడాలి..