winter alcohol drinking: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ప్రజలను గజగజ వణికిస్తూ ఉదయం, సాయంత్రం ఇళ్లకే పరిమితం చేస్తుంది. ఉదయం 9 వరకు భానుడి జాడ కానరావడం లేదు. సాయంత్రం 5 గంటల తర్వాత మళ్లీ అదే పరిస్థితి. ఈ చలికి తోడు విపరీతమైన చలి గాలులు వీస్తున్నాయి. దీంతో దగ్గు, జలుబు, ఆయాసం వంటి జబ్బులు ప్రజలను వెంటాడుతున్నాయి. ఈ చిన్నపాటి దగ్గు, జలుబులకే ఆస్పత్రికి ఏం వెళాతామని.. ఉపశమనం కోసం ఆల్కాహాల్ సేవిస్తూ ఇంట్లోనే గడుపుతున్నారు. ఇది జబ్బులు తగ్గించి, శరీరంలోని టెంపరేచర్ పెంచుతుందని భావిస్తున్నారు. మరీ ఈ భావన నిజమేనా? మన వైద్యులు ఏం మంటున్నారో చూద్దాం!
చలికాలం వచ్చిందంటే చాలు పొద్దున్నే లేవాలంటే చికాకుగా ఉంటుంది. రాత్రిళ్లు అయితే చెప్పక్కర్లేదు. దుప్పటి ముసుకేసినా నిద్ర రాదు. దీని నుంచి బయటపడేందుకు కొందరు బ్రాందీ, రమ్ వంటి ఆల్కాహాల్ పుచ్చుకుంటూ.. దగ్గు, జలుబు, ఆయాసం వంటి సమస్యలకు మందే పరిహారం అని భ్రమిస్తుంటారు. అయితే ఆల్కాహాల్ తీసుకుంటే ఫ్లూ వ్యాధులు తగ్గుతాయని చెప్పెందుకు సైన్స్ పరంగా శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. అటువంటి వ్యాధుల వచ్చినప్పుడు వైద్యులు కూడా ఆల్కాహాల్‌ను రెకమండ్ చేయరు.
దానికి పలు పలు రకాల కారణాలు లేకపోలేవు. రమ్‌ను చెరకుతో తయారు చేస్తారు. ఇక బ్రాందీ తయారీలో అయితే రకరకాల ఫ్రూట్స్, డీజిల్ట్ వైన్ వినియోగిస్తారు. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత.. శరీర ఉష్ణోగ్రతను వెచ్చగా మారుస్తుంది తప్ప.. ఎటువంటి ఫ్లూ వ్యాధులు నయం చేయలేదు. మరే ఉపయోగం ఉండదు.ఇదే మాట సైన్స్ కూడా అంటోంది. అలానే మద్యం అతిగా సేవిస్తే.. శరీర ఉష్ణోగ్రత పెరుతుందన్న మాట అటు ఉంచితే..రోగాలు తగ్గడం కాదు ఎక్కువ అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యం ఎక్కువగా సేవిస్తే రోగ నిరొధక శక్తి బలహీనపడి శరీరం క్రమంగా దెబ్బతింటుందని వైద్యులు చెబుతున్నారు.
మీరు చలి నుంచి స్వాంతన కోసం ఆల్కాహాల్ తీసుకుంటున్నారా? అయితే మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.