BigTV English

International :తియ్యని చాక్లెట్ కూ ఓ రోజుంది

International :తియ్యని చాక్లెట్ కూ ఓ రోజుంది
  • జులై 7 ప్రపంచ చాక్లెట్ దినోత్సవం
  • చిన్నారులనుంచి వృద్ధుల దాకా ఇష్టపడేది
  • మెసూ అమెరికాలో పుట్టిన చాక్లెట్
  • మొదట్లో ద్రవరూపంలో లభ్యమైన చాక్లెట్
  • 1800 లో ఘన పదార్థంగా రూపాంతరం
  • 1950 జులై 7న తొలి సారి యూరప్ లో జరిగిన చాక్లెట్ దినోత్సవం
  • 75 ఏళ్ల ప్రస్థానం కలిగిన చాక్లెట్ దినోత్సవం

world chocolate day July 7 celebrate every year..dark chocolate prefers doctors


పళ్లు రాగానే చిన్నారులు మొదటిసారిగా తినడానికి ఇష్టపడేది చాక్లెట్ నే. వయసు పెరుగుతున్న కొద్దీ చాక్లెట్లపై మమకారం పెరుగుతుంటుందే గానీ తగ్గదు. పళ్లు ఊడిపోయిన వృద్ధులకు కూడా చాక్లెట్లే ముద్దు. పుట్టినరోజు సందర్బం అనుసరించి ఏదైనా మంచి అకేషన్ వచ్చిందంటే నోటిని ముందుగా చాక్లెట్లతోనే తీపి చేసుకోవడం ఆనవాయితీ. అయితే చాక్లెట్ కు కూడా ఓ రోజు ఉందని తెలుసా? జూన్ 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవంగా జరుపుకుంటారు.

మెసూ అమెరికాలో..


అందరికీ నోరూరించే చాక్లెట్ ఎక్కడ పుట్టిందో తెలుసా? నార్త్ అమెరికాలోని మెసూ అమెరికాలో ఇది పుట్టింది. థియోబ్రోమా కోకోవా చెట్టు నుంచి సేకరించిన కోకోవా సీడ్స్ తో చాక్లెట్లను తయారు చేస్తారు. మొదట్లో మెసూ అమెరికన్స్ దీనిని డ్రింక్ రూపంలో సేవించేవారు. కొన్ని రకాల మసాలాలు, కార్న్ ప్యూరీ కలిపి తయారుచేసిన ఈ డ్రింక్ కు చిలేట్ అని పేరు కూడా పెట్టారు. అయితే చిరు చేదుగా ఉండే ఈ ద్రావకం బాడీకి అమితమైన శక్తిని అందించడంతో పాటు లైంగిక కోరికలు పెంచే సాధనంగా కూడా దీనిని వాడటం విశేషం.

యూరప్ లో తొలిసారి

1950 సంవత్సరం జులై 7న యూరప్ లో తొలిసారి ప్రపంచ చాక్లెట్ దినోత్సవం జరుపుకున్నారు. అప్పట్లో మెక్సికో, అమెరికా వంటి దేశాలలో మాత్రమే చాక్లెట్లు అందుబాటులో ఉండేవి. క్రమంగా అన్ని దేశాలకూ ఇది విస్తరించింది. మొదట్లో ద్రావకం రూపంలో లభ్యమయిన చాక్లెట్లు 1800లో గట్టిగా ఉండేవిధంగా తయారు చేయడం ఆరంభమయింది. అలా మొదలైన చాక్లెట్ల ప్రస్థానం ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలలో అందుబాటులోకి వచ్చేశాయి.

చాక్లెట్లలో ‘డార్క్’ వేరయా

ప్రస్తుతం మార్కెట్లో చాలారకాల చాక్లెట్లు లభ్యమవుతున్నాయి. అయితే అవన్నీ ఆరోగ్యకరమేనా అంటే ప్రశ్నార్థకమే అయితే చాలా మంది వైద్యులు డార్క్ చాక్లెట్లు తినమని సలహాలు ఇస్తుంటారు. అయితే ఈ డార్క్ చాక్లెట్లతో ఒనగూరే ప్రయోజనాలు ఏమిటంటే ముఖ్యంగా గుండె జబ్బులను నివారిస్తుంది. డార్క్ చాక్లెట్ అధిక రక్తపోటుకు మేలు చేస్తుంది. రోగ నిరోధక శక్తికి తోడ్పడుతుంది. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. తీవ్ర ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది. అయితే ఏదైనా అతిగా తినడం మంచిదికాదని గ్రహించాలి. పైన చెప్పిన ప్రయోజనాలు కలగాలంటే డార్క్ చాక్లెట్లనైనా లిమిట్ గా తినడం మంచిది.

Tags

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×