BigTV English

Akshata Murty: రిషి సునాక్ సతీమణి డ్రెస్‌పై ట్రోలింగ్స్..ఎందుకో తెలుసా?

Akshata Murty: రిషి సునాక్ సతీమణి డ్రెస్‌పై ట్రోలింగ్స్..ఎందుకో తెలుసా?

Akshata Murty trolled at Rishi Sunak’s resignation speech: బ్రిటిష్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానిగా కీర్ స్టార్మర్ బాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఘోర పరాజయంతో అధికారం కోల్పోయింది. మొత్తం 650 స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ 121 సీట్లు మాత్రమే సాధించింది. గత ఎన్నికల కంటే ఈ సారి 250సీట్లు తక్కువగా వచ్చాయి.


ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే భారత సంతతికి చెందిన రిషి సునాక్..ఓటమిని అంగీకరించారు. క్షమించండి.. ఓటమికి బాధ్యత వహిస్తున్నానంటూ ప్రకటించారు. ఓటమి తర్వాత తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం 10 డౌనింగ్ స్ట్రీట్ ‌లో ప్రధాన మంత్రిగా చివరి ప్రసంగాన్ని ఇచ్చారు. ఓటమికి బాధ్యత వహిస్తూ ఓటర్లకు, కన్జరేటివ్ పార్టీ నేతలకు క్షమాపణలు కోరారు.

రిషి సునాక్ చివరి ప్రసంగం ఇస్తుండగా.. వెనకాల తన భర్త కోసం నిరీక్షిస్తున్న రిషి సతీమణి అక్షతా మూర్తి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఆ సమయంలో ఆమె ధరించిన డ్రెస్ పై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ డ్రెస్ పై సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.


అక్షతా మూర్తి ధరించిన డ్రెస్‌పై బ్రిటీష్ జాతీయ జెండాకు సంబంధించిన అన్ని రంగులు కనిపిస్తున్నాయి. ఇందులో నీలం, ఎరుపు, తెలుపు ఉన్నాయి. ప్రస్తుతం ఈ డ్రెస్‌పై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది హేళన చేస్తుండగా.. మరికొంతమంది ఇంత ఫన్నీ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

డ్రెస్ డిజైన్ విషయానికొస్తే.. అక్షతా మూర్తి ధరించిన డ్రెస్ పై బాణాలు కిందికి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ఆ డ్రెస్ కింది భాగం రెడ్ కలర్‌లో ఉంది. ఈ డ్రెస్ డిజైన్‌ను కన్జర్వేటివ్ పార్టీకి 2024 ఎన్నికల ఫలితాల చిహ్నంగా వర్ణించారు. రిషి సునాయ్ రాజీనామా చేయడంలో సహాయం చేయడానికి అక్షతా మూర్తి అమెరికన్ ప్లాగ్ స్టైల్ డ్రెస్ ధరించడం ఫన్నీగా ఉందని కామెంట్ చేశారు. ఎలాగూ ఓడిపోతామని తెలిసి.. అమెరికాలో కొత్త జీవితం గడిపేందుకు ప్రైవేట్ జెట్ ఎక్కేందుకు సిద్ధమైనట్లు రాసుకొచ్చారు.

Also Read: బ్రిటన్ ప్రధాని కీర్‌తో కేసీఆర్ మనవడు హిమాన్షు, ఆపై అభినందనలు

అక్షతా మూర్తి ధరించిన డ్రెస్.. భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ కా షా అని తెలిసింది. దీని ధర రూ.42వేలుగా బ్రిటిష్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ కాటన్ దుస్తులు ఆన్ లైన్ బోటిక్ ద్వారా మాత్రమే విక్రయిస్తారు. ఈ బ్రాండ్ బాగా ప్రసిద్ధి చెందింది. కాాగా, అక్షితా మూర్తి డిజైన్ దుస్తులు ఎక్కువగా ధరిస్తుంది. ఇటీవల బ్రిటన్ టాట్లర్ మ్యాగజైన్ లో ఉత్తమ దుస్తులు ధరించిన జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×