BigTV English
Advertisement

AP Politics: అంబటికి జగన్ షాక్? ఆ పోస్ట్ ఊస్ట్!

AP Politics: అంబటికి జగన్ షాక్? ఆ పోస్ట్ ఊస్ట్!


AP Politics: గుంటూరు జిల్లా వైసీపీలో కీలక మార్పులు చేయాలని అధిష్టానం భావిస్తోందంట.. రాజధాని ప్రాంతంలోని కీలకమైన జిల్లాలో మూడు రాజధానుల ప్రతిపాదనతో వైసీపీకి చావుదెబ్బ తగిలింది. తిరిగి జిల్లాలో తమ ఉనికి కాపాడుకోవాలంటే పార్టీలో సమూల మార్పులు చేయాలని జగన్ ఫిక్స్ అయ్యారంట. సామాజివర్గాలవారీగా తమకు కీలకమైన సామాజివర్గానికి చెందిన రెడ్డి నేతకు మళ్లీ కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గుంటూరు జిల్లా బాధ్యతలకు సంబంధించి జగన్ దృష్టిలో ఉంది ఎవరు?

గత ఎన్నికల్లో వైసీపీకి దూరం జరిగిన రెడ్డి సామాజికవర్గం


గుంటూరు జిల్లా జిల్లాలో రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగానే సాగుతుంటాయి. ఇటు అధికారపక్షమైనా అటు ప్రతిపక్షమైనా అక్కడ చక్రం తిప్పడానికి ఏదో ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాయి.. ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీలో కూడా కీలకమైనటు వంటి మార్పు జరగబోతుందని ప్రచారం జరుగుతోంది. వైసీపీకి అత్యంత కీలకమైనటువంటి ఓటు బ్యాంకుగా ఉన్న రెడ్డి సామాజ వర్గం మొన్నటి ఎన్నికల్లో ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చిందన్న అభిప్రాయం ఉంది. ఆ క్రమంలో సొంత సామాజికవర్గాన్ని తిరిగి దగ్గర చేసుకోవడానికి జగన్ రెడ్డి తన వర్గం నేతను మళ్లీ అత్యంత కీలకమైనటువంటి పదవిలోకి తీసుకొని రావాలని భావిస్తున్నారంట

పల్నాడు ప్రాంతంలో యాక్టివ్‌గా లేని వైసీపీ రెడ్డి వర్గం నేతలు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో రెడ్డి సామాజికవర్గం ప్రాబల్యం ఉంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జిల్లాలోని రెడ్డి వర్గం నేతలెవరూ యాక్టివ్‌గా లేరు. వారు అప్పుడప్పుడు జనంలోకి వస్తున్నా ఆశించిన ఆదరణ దక్కడం లేదంటున్నారు. పల్నాడు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా జగన్ ఏరికోరి నియమించుకున్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కేసుల ఎఫెక్ట్‌లో మాచర్లలోనే పెద్దగా కనిపించడం లేదు. దాంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీకి దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అది దృష్టికి రావడంతో ప్రస్తుతం రెడ్డి సామాజివర్గాన్ని మళ్లీ గుంటూరు జిల్లాలో యాక్టివ్ చేయాలని జగన్ ఆలోచిస్తున్నారంట.

గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న అంబటి రాంబాబు

గుంటూరు జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాంబాబు కొనసాగుతున్నారు. ఆయనకి జగన్ ఇటీవలే గుంటూరు వెస్ట్ నియోజవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పరాజయం పాలై గుంటూరు జిల్లాకు వచ్చిన అంబటి కూడా గుంటూరు వెస్ట్ బాధ్యతలు ఆశించారు. దాంతో ప్రస్తుతానికి గుంటూరు జిల్లాలో రెడ్డి సామాజి వర్గాన్ని యాక్టివ్ చేయాలంటే జిల్లా అధ్యక్షుడ్ని మార్పు చేయడం ఒక్కటే మార్గమని జగన్ భావిస్తున్నారంట.

మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు?

రెడ్డి సామాజిక వర్గానికి గుంటూరు జిల్లా ఇన్చార్జి పదవి కట్టబెట్టే ఆలోచనలో భాగంగా గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి గత కొంతకాలంగా ఎలాంటి పదవులు లేకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయంటున్నారు. ఆయన నరసరావుపేట పార్లమెంటు ఇంచార్జిగా వెళ్తారు అనే ప్రచారం జరిగింది .ఆ తర్వాత సత్తెనపల్లి బాధ్యతలు మోదుగులకు అప్పచెప్తారన్న టాక్ నడిచింది.

అసంత‌ృప్తితో ఉన్న మోదుగుల వర్గం

అయితే వైసీపీ అధిష్టానం ఇంతవరకు మోదుగులు వేణుగోపాల్‌రెడ్డికి ఏ బాధ్యతలు కట్టబెట్టలేదు. గుంటూరు జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న మోదుగుల వేణుగోపాల్ రెడ్డికి జిల్లాలో ఎలాంటి పదవి లేకపోవటంపై ఆయన వర్గం కూడా కొంత అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. ఆ అసంతృప్తిని పోగొట్టడంతో పాటు గుంటూరు జిల్లాలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లడానికి మోదుగులకు జిల్లా ఇన్చార్జ్ బాధ్యతలు కట్టబెట్టే ఆలోచన చేస్తున్నారంట. వైసీపీకి అత్యంత కీలకమైన రెడ్డి సామాజిక వర్గానికి గుంటూరు జిల్లా ఇన్చార్జి పదవి ఇస్తే తిరిగి ఆ వర్గం పార్టీలో యాక్టివ్ అవుతుందని పార్టీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారంట. మరి చూడాలి ఏం జరుగుతుందో?

Story By Rami Reddy, Bigtv

Related News

Kalvakuntla Kavitha: కవిత టార్గెట్.. కారు పార్టీ.. టచ్‌లో ఆ నేతలు?

Vijayanagaram TDP: టీడీపీ జిల్లా.. రథసారథి ఎవరో?

Jubilee Hills Bypoll: కాంగ్రెస్ మైలేజ్ తగ్గిందా? ప్రచారంపై అధిష్టానం నిఘా

Rajamohan Reddy: మేకపాటి మాటలు.. జగన్ చెవిలో పడేనా?

JC Brothers: జేసీ బ్రదర్స్.. టార్గెట్ పోలీస్!

DCC Presidentship: మేడిపల్లికి.. డీసీసీ పగ్గాలు

Malepati Subbanayudu: కావలి టీడీపీలో రగిలిన వర్గపోరు..

Jubilee Hills Bypoll:జూబ్లీహిల్స్ బైపోల్.. ప్రచారాల్లో కనిపించని ఆ ఇద్దరు కీలక నేతలు..?

Big Stories

×