E-Paper
Advertisement

YSRCP: మూకుమ్మడిగా కేసులు.. కమ్ముకొస్తున్న కారు మబ్బులు.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ

YSRCP: మూకుమ్మడిగా కేసులు.. కమ్ముకొస్తున్న కారు మబ్బులు.. దిక్కుతోచని స్థితిలో వైసీపీ
Advertisement

YSRCP: చేతిలో ఫోన్.. అందులో ఇంటర్నెట్, సోషల్ మీడియా అకౌంట్ ఉంది కదా అని ఇన్నాళ్లూ రెచ్చిపోయిన వారికి ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వం అండ చూసుకుని విచ్చలవిడిగా పోస్టులు పెట్టిన వారికి ఇప్పుడు అసలు సినిమా కనిపిస్తోంది. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేసిన వారి చిట్టా అంతా బయటికొస్తోంది. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ సోషల్ కార్యకర్తల అరెస్టులే కనిపిస్తున్నాయి. వాటి నుంచి రక్షణ కావాలంటూ వేసిన పిల్ పై ఏపీ హైకోర్టు ఎంటర్ టైన్ చేయలేదు. పైగా అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కేసులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది.

అప్పుడు రెచ్చిపోయిన వారు ఇప్పుడు పరార్

Advertisement

ఎస్.. ఏపీలో ఇప్పుడు సోషల్ మీడియా వారియర్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వ అండ చూసుకుని చేతిలో సెల్, అందులో ఇంటర్ నెట్ ఉంది కదా అని రెచ్చిపోయిన వారు ఇప్పుడు పరుగులు పెడుతున్నారు. రాష్ట్ర సరిహద్దులు దాటి తల దాచుకుంటున్నారు. అయినా సరే పోలీసులు వెంటాడుతూనే ఉన్నారు. తప్పు చేయనేల. ఇప్పుడు క్షమాపణలు చెప్పనేల అన్నట్లుగా సీన్ మారింది. తెలిసో తెలియకో చేశాం.. మమ్మల్ని వదిలేయండి మహా ప్రభో అని చాలా మంది వేడుకుంటున్న పరిస్థితి. మరి ఇదే బుద్ధి సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టినప్పుడు ఏమైందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సోషల్ వారియర్లపై BNS సెక్షన్ 111 ప్రయోగం

Advertisement

నిజానికి సోషల్ మీడియాను ఉపయోగించుకోవాల్సిన రీతిలో వాడకపోవడంతోనే సమస్య వచ్చింది. ప్రత్యర్థులపై హేట్ పోస్టులతో రెచ్చిపోయారు. అదే అన్నిటికీ మందు అనుకున్నారు. కానీ అసలు వాస్తవం ఏంటో ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. నోటీసులు, కేసులు, అరెస్టులతో అందరిలోనూ పరేషాన్ కనిపిస్తోంది. ఫేక్ అకౌంట్ల ద్వారా పెట్టినా సరే అందరినీ గుర్తు పట్టేస్తున్నారు. లైకులు కొట్టినా, ఫార్వర్డ్ చేసినా, కమ్యూనిటీ గైడ్ లైన్స్ కట్టు దాటి కామెంట్లు పెట్టినా అందరూ బుక్ అవుతున్నారు. BNSS సెక్షన్ 111 ప్రయోగిస్తుండడంతో చాలా మంది కాళ్లబేరానికి వస్తున్నారు.

నేతల భార్యలే టార్గెట్ గా వ్యక్తిత్వ హననాలు

మంచి పనులు చేస్తూ ప్రజల్లో మెప్పు పొంది గెలవాలి. కానీ ప్రత్యర్థులను టార్గెట్ చేసి, వారి భార్యలపై వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా పబ్బం గడుపుకొందామంటే కుదురుతుందా.. కానే కాదు అని ఇప్పటి కేసులు, అరెస్టులు రుజువు చేస్తున్నాయి. గతంలో సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారు పుట్టలో ఉన్నా సరే వెతికి వెతికి బయటకు తీస్తున్నారు. మరోసారి ఇలాంటి పనులు చేయకుండా గట్టిగానే బుద్ధి చెప్పేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియాలో గతంలో యాక్టివ్ గా పని చేసిన వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. అంతా జైలు బాట పడుతున్నారు.

Also Read: లాజిక్‌తో కొట్టిన టీడీపీ.. జగన్ అసెంబ్లీకి రావాల్సిందేనా..?

సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు ఆపాలని పిల్

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని, వాటిని అడ్డుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని తాజాగా ఏపీ హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఈ పిల్ పై విచారణ సందర్భంగా హైకోర్టు చెప్పిన మాటలు సోషల్ వారియర్లు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిందే. అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించడం అందరూ ఆలోచించాల్సిన విషయం. గతంలో న్యాయమూర్తులను కూడా వదలకుండా దూషిస్తూ పోస్టులు పెట్టారని గుర్తు చేసింది ధర్మాసనం. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులను ఇవ్వలేమన్నది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్‌ వేయడానికి వీలు లేదన్నది. కేసులపై అభ్యంతరముంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలన్నది. సో హైకోర్టు చెప్పాల్సింది చెప్పేసింది. ఇది నిజంగా వైసీపీకి గట్టి ఎదురు దెబ్బే.

చేసిన తప్పులకు ఫలితం అనుభవించాల్సిందే..

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను కావాలనే ఇబ్బంది పెడుతున్నారని తమ వారిని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నం వర్కవుట్ కాలేదు. పైగా రివర్స్ అవుతోంది. ఎన్ని చేసినా, ఎంత చేసినా, ఎంత తప్పించుకుందామని చూసినా.. చేసిన తప్పులకు ఫలితం అనుభవించక తప్పదు. ఇదే కర్మ సిద్ధాంతం. ఇది ఇప్పుడే వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా పని చేసిన వారికి, ఆ పార్టీ సానుభూతి పరులకు అర్థమవుతోంది. నిజానికి ఈ విషయంలో మొదటే జ్ఞానోదయం కావాలి. కానీ ఇన్నాళ్లకు అవుతోంది. సో ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందుకే గెట్ రెడీ అంటోంది ఏపీ పోలీస్ వింగ్. వీళ్లు రాజకీయ విమర్శలతో పోస్టులు పెట్టి ఉంటే అంతా బాగుండేది. కానీ హద్దులు దాటి పెట్టారు. అందుకే వరుసగా నోటీసులు, కేసులు, అరెస్టులు.

 

Related News

సభా సమరంలో ఓడినా.. ఇలా సబ్జెక్టుతో కొడతాం! కరెంటు కష్టాలపై సర్కార్‌ను నిలదీసిన బీఆరెస్‌!

సైలెంట్‌గా ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ సీరియస్.. కాంగ్రెస్‌కు జై కొడతారా?

తెలంగాణ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. మళ్లీ దళిత్ వర్సెస్ దొరలు.. కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా!

అసెంబ్లీలో BRS వ్యూహం రివర్స్.. ప్రభుత్వం చేతికి చిక్కిన ప్రతిపక్షం!

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా? ఈ 4 ప్రశ్నలకు సమాధానం చెబుతారా? DSC స్కామ్‌పై జగన్ అస్త్రాలు!

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

ఇక కురుక్షేత్రమే వచ్చే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా: జగన్

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!

Big Stories

Advertisement
×