BigTV English
Advertisement

Kanguva Movie OTT: త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్.. డేట్ కూడా లాక్..!

Kanguva Movie OTT: త్వరలో ఓటీటీ స్ట్రీమింగ్.. డేట్ కూడా లాక్..!

Kanguva OTT: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya ) తన చిత్రాలను తమిళ్, తెలుగులో విడుదల చేస్తూ.. భారీ పాపులారిటీ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈయన నటించిన చిత్రం కంగువ (Kanguva). దాదాపు 11 వేల స్క్రీన్ లలో ప్రపంచవ్యాప్తంగా నేడు (నవంబర్ 14 ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య, ఊహించని ప్రమోషన్స్ తో హైప్ తెస్తూ.. ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కానీ మొదటి షో తోనే నెగిటివ్ టాకు తెచ్చుకుంది ఈ సినిమా. సాధారణంగా సూర్య నుంచి సినిమా అంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా నిలిచిందని, సెకండ్ హాఫ్ పూర్తిగా లాగ్ చేశారని సమాచారం. దీనికి తోడు కొన్ని యాక్షన్ సన్నివేశాలు బాగున్నా.. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు ఇరిటేషన్ తెప్పిస్తాయట. మొత్తానికైతే అంత హైప్ ఇచ్చారు కానీ నెగటివ్ టాక్ తెచ్చుకోవడం గమనార్హం.


కంగువ నెగిటివ్ టాక్..

ఇకపోతే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అప్పుడే ఓటీటీ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో సినిమా చూడాలని ఎంతో ఆశ పెట్టుకున్నారు. కానీ నెగిటివ్ టాక్ రావడంతో ఓటీటీ కోసం ఎదురుచూస్తున్నారు.ఇకపోతే థియేటర్లలో సినిమా చూడలేని వారు ఓటీటీ లో సినిమా చూస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోని అటు ఓటీటీ ప్రియులను కూడా అలరించడానికి సిద్ధం అయిపోయింది కంగువ. సినిమా ఎలాగో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి థియేటర్లలో ఎక్కువ రోజులు వుంచే అవకాశాలు కనిపించడం లేదు.


ఓటీటీ డేట్ లాక్..

ఈ క్రమంలోనే డిసెంబర్ 25వ తేదీన ‘క్రిస్మస్’ పండుగ సందర్భంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతోంది అని సమాచారం. ఇకపోతే ఈ తేదీపై అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. మొత్తానికి అయితే సినిమా విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలోకి రాబోతుండడంతో ఓటీటీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

కంగువ బడ్జెట్..

మరోవైపు రూ .350 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.100 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో బాబి డియోల్, దిశాపటాని లాంటి స్టార్ హీరోయిన్లు కూడా నటించారు.2D, 3D ఫార్మాట్ లలో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, స్పానిష్ వెర్షన్లలో విడుదల కాబోతోంది.

నటీనటుల రెమ్యూనరేషన్..

నటీనటుల రెమ్యూనరేషన్ విషయానికి వస్తే..ఈ సినిమాలో లీడ్ రోల్ పోషించిన సూర్యకు ఏకంగా రూ.39 కోట్లు అందించగా.. విలన్ పాత్ర పోషించిన బాబి డియోల్ (Bobby Deol) కి రూ .5కోట్లు, హీరోయిన్ దిశాపటాని (Disha patani) కి రూ .3కోట్లు ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాలో సూర్య మొత్తం ఐదు గెటప్ లలో కనిపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×