Satyabhama Today Episode November 14 th : నిన్నటి ఎపిసోడ్.. మైత్రి కిడ్నాప్ అయిన విషయం ఇంట్లో చెబుతాడు హర్ష.. ఇంట్లో అందరు టెన్షన్ పడతారు.. ఇక క్రిష్ గురించి అతని జన్మ రహస్యం గురించి నిజం తెలుసుకుంటానని సత్య మహాదేవయ్యతో ఛాలెంజ్ చేస్తుంది. మహాదేవయ్య నీ చేత నైంది చేసుకో అని చెబుతాడు. ఇక మైత్రిని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఫోన్ చేస్తారు. పది లక్షలు కావాలని డిమాండ్ చేస్తారు. అంత డబ్బులు ఎక్కడ నుంచి తీసుకొస్తాము అని టెన్షన్ పడతారు. క్రిష్ ను అడ్డుపెట్టుకొని బయటకు వెళ్లాలని సత్య అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. సత్య క్రిష్ ను అడ్డుపెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు తీసుకొని వస్తుంది. అటు హర్ష వాళ్ళ ఇంట్లో మైత్రి కావాలంటే పది లక్షలు కట్టమని అంటున్నారు అని అంటారు.. దాని గురించి ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడుతారు. కిడ్నాపర్ల నుంచి మరోసారి హర్షకి కాల్ వస్తుంది. ఓ రౌడీ మైత్రి దగ్గరకు వచ్చి హర్ష సార్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్తాడు.. అయితే ఆ రౌడీ హర్ష గాడు అంటే మైత్రి లాగిపెట్టి కొడుతుంది. అంత డబ్బు అడిగితే ఎందుకు లిఫ్ట్ చేస్తాడు అని అంటుంది. దాంతో రౌడీ మళ్లీ కాల్ చేస్తే హర్ష లిఫ్ట్ చేస్తాడు. దాంతో ఆ రౌడీ గంటలో పది లక్షలు తీసుకొని రైల్వే స్టేషన్కి రమ్మంటాడు. గుర్తు పెట్టుకో గంటలో పది లక్షలు ఎలా అని అందరూ తల పట్టుకుంటారు. దాంతో విశాలాక్షి తన నగలు ఇచ్చి మైత్రిని విడిపించుకొని రమ్మంటుంది. విశ్వనాథ్ కూడా ఆడ పిల్ల ఉసురు వద్దు నగలు కుదువ పెట్టి మైత్రిని విడిపించుకొని తీసుకురమ్మని అంటాడు. హర్ష నగలు తీసుకొని వెళ్తాడు. మరోవైపు క్రిష్ తో కారులో బయలు దేరిన సత్య కారును ఆపమని చెబుతుంది. దిగి వెళ్ళిపోతుంది.
దానికి క్రిష్ ఏంటి నీ కిరికిరి సత్య. నైట్ ఒక్క దానివే వెళ్తానని చెప్పావ్ నీతో ఆ టైంలో లొల్లి పెట్టుకుంటే ఒక రాత్రి వేస్ట్ అయిపోతుందని సరే అని అన్నాను. పొద్దున్న నా పాటికి నేను వెళ్తుంటే నన్ను ఆపి నా వెనకాల తగులుకున్నావ్. పోనీలే మనసు మార్చుకున్నావేమో అనుకుంటే కారు ఎక్కావ్ నీ పాటికి నువ్వు దిగిపోతే నేను ఏం అనుకోవాలి. మరి నా సంగతి ఏంటి అని అడుగుతాడు. ఏదో పని ఉందని ఊరుని ఉద్దరించడానికి బయల్దేరావు కదా వెళ్లు నా దారిన నేను వెళ్తా. ఇంట్లో అందరూ అడ్డు పడుతుంటే నీతో వచ్చా అంతే. వెళ్లనీ అవతల నాకు చాలా పని ఉంది నీతో వాధించే ఓపిక లేదని చెబుతుంది. ఇక క్రిష్ నీతో వెళ్లాలని ఆశ పడుతున్న నన్ను ఎలా వదిలేస్తావని అడుగుతాడు. ఇద్దరి మధ్య వాదన పెరుగుతుంది.
వాదిస్తే దొరికిపోతాను వెళ్లడం బెస్ట్ అనుకోని క్రిష్ ను కారు తియ్యమని అడుగుతుంది. ఇద్దరు కలిసి కారులో వెళ్తారు. ఎందుకు ఎక్కడికి లాంటి ప్రశ్నలు వెయ్యొద్దని చెబుతుంది. మెటర్నరీ హాస్పిటల్ కు తీసుకొని వస్తుంది. అక్కడ పని ఉందని అంటే ఏంటి నా సంపంగి తల్లి కాబోతుందా అని సంబరిపోతాడు. అంతలేదు నేను ప్రెగ్నెంట్ కాదు. నేను ఇక్కడకి వచ్చింది ఓ మంచి మనిషి చరిత్ర తవ్వడానికి నువ్వేం అడగకు అడిగినా నేను చెప్పను. సత్య వాళ్లు హాస్పిటల్ లోపలికి వస్తారు. అక్కడ కాంపౌండర్ పడుకొని ఉంటే సత్య లేపడానికి ప్రయత్నిస్తుంది. ఆయన ఓవర్కి క్రిష్కి కోపం వస్తుంది కొట్టానికి వెళ్తే సత్య ఆపుతుంది. ఆ సీన్ అంతా చాలా కామెడీగా ఉంటుంది. క్రిష్ నిద్ర పోతున్న అతన్ని ఒక్కటిచ్చి చేతులు కట్టుకొని నిల్చోడం ఆయన ఎవరో నన్ను కొట్టారని అనడం సత్య తల పట్టుకోవడం కామెడీగా ఉంటుంది..
అతను నేను చెప్పను అంటే గన్ తీసి బెదిరిస్తాడు. అతను భయపడుతూ నిజం చెప్పేస్తాడు. ఎవరి గురించి తెలుసుకోవాలని అడుగుతాడు. దానికి సత్య క్రిష్ ఉంటే కుదరదు బయటకు పంపాలని అనుకుంటుంది. అతన్ని బయటకు పంపిస్తుంది. క్రిష్ని బయట ఉంచి సత్య లోపలికి వెళ్తుంది. అక్కడున్న ఫైల్స్ తిరగేస్తుంది. ఇక క్రిష్ బయట నుంచి దేవుడికి దండం పెట్టుకుంటాడు. సత్య అనుకున్నది జరగాలని సత్య ముఖంలో సంతోషం చూడాలి అనుకుంటాడు. ఇక సత్య క్రిష్ పుట్టిన రోజున మహదేవయ్య, చక్రవర్తి ఇద్దరి పేర్ల మీద డెలివరీ ఉండటం చూస్తుంది. ఆ రోజు మొత్తంలో రెండు డెలివరీలేనా మరి లేవా అని కంగారు పడి కాంపౌండర్ని ప్రశ్నిస్తుంది. ఇంకేమైనా అయ్యావా అని అడుగుతుంది.. కానీ అదే అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో సత్య కు మహాదేవయ్య ఫోన్ చేస్తాడు. ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..