BigTV English

Big TV Exclusive : బిగ్ బాస్ హౌస్ నుంచి ఆదిత్య ఓం ఎలిమినేట్.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే?

Big TV Exclusive : బిగ్ బాస్ హౌస్ నుంచి ఆదిత్య ఓం ఎలిమినేట్.. ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడంటే?

Big TV Exclusive : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నాలుగు వారాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఐదో వారం ఉత్కంటగా మారింది. మొన్నటివరకు ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ కాగా.. తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 ఐదో వారం మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. బిగ్ బాస్ 8 తెలుగు మిడ్ వీక్‌లో నైనిక ఔట్ అనే వార్తలు గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే.. కాగా ఇప్పుడు హీరో ఆదిత్య ఓం హౌస్ నుంచి బయటకు వచ్చినట్లు వార్త నెట్టింట జోరుగా వినిపిస్తుంది. దీనికి సంబందించిన షూటింగ్ ను నిన్న చేశారు. ఆదిత్య ఓం ఎలిమినేషన్ ఎపిసోడ్‌ను గురువారం అంటే ఇవాళ స్టార్ మా ఛానెల్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారం చేయనున్నారు. ఇక ఈయన ఐదు వారాలకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడనేది హాట్ టాపిక్ అవుతుంది.


బిగ్ బాస్ హౌస్ నుంచి ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన వారందరు బాగానే సంపాదించుకున్నారు. ఇక ఆదిత్య ఓం కూడా అలానే బాగానే రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో పార్టిస్‌పేట్ చేయడానికి ఆదిత్య ఓం వారానికి రూ. 3 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అంటే, రోజుకు సుమారుగా 42 వేల 857 రూపాయలు. అయితే, ఆదిత్యం ఓం బిగ్ బాస్ హౌజ్‌లో నాలుగు వారాలకు పైగా ఉన్నాడు. అంటే ఈ నెల మూడో తారీఖు వరకు ఆదిత్య ఓం హౌస్ లో కొనసాగాడు.. అన్ని రోజులకు గాను మొత్తం రూ. 14 లక్షల 14 వేల 281 పారితోషికాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది. హౌస్ లో అందరికన్నా ఎక్కువగా విష్ణు ప్రియానే తీసుకుంటుంది. ఆమె తర్వాత ఎక్కువగా ఆదిత్య ఓం తీసుకుంటున్నారు..

ఇక ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉందన్న విషయం తెలిసిందే.. ఇక ఈ వీకెండ్ లో నైనిక హౌస్ నుంచి బయటకు వెళ్లనుంది.. ఇక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా గంగవ్వ హౌస్ లోకి రాబోతుందని వార్తలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాంతారా టీమ్ ఎక్కువ టాస్క్‌లు గెలుచుకోవడంతో వారికి స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్‌బాస్. వీరి టీమ్‌లో నుంచి ఒకరు నేరుగా చీఫ్ కావొచ్చునని , అది మీలో మీరు చర్చించుకోవాలని సూచించాడు. దీంతో యష్మీ రెచ్చిపోయింది.. నాకు ఆల్రెడీ చీఫ్‌గా చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉందని తన క్వాలిఫికేషన్స్ బయటపెట్టింది.. ఇది ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది. ఇక ఈ సీజన్ విన్నర్ ఇతనే అంటూ నబీల్ పేరు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. మరి విన్నర్, రన్నర్ ఎవరో తెలియాలంటే గ్రాండ్ ఫైనల్ వరకు ప్రతి ఎపిసోడ్ ను మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాల్సిందే..


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×