Nindu Noorella Saavasam Serial Today Episode: పార్థును చూడకుండానే అమర్, మిస్సమ్మ, రామ్మూర్తి ముగ్గురు కలిసి హాస్పిటల్‌కు వెళ్తారు. వాళ్లు వెళ్లిపోయాక పార్థు బయటకు వచ్చి గోడకు ఉన్న మిస్సమ్మ, అమర్‌ల ఫోటో చూసి తల పట్టుకుంటాడు. పెయిన్ రావడంతో కింద పడిపోతాడు. మంగళ చూసి కంగారు పడుతుంది. వెంటనే కిచెన్‌లోకి వెళ్లి వాటర్ తీసుకొచ్చి పార్థు ముఖంపై చల్లుతుంది. పార్థు లేస్తాడు. ఫోటో చూసి తల పట్టుకుని బాధపడుతుంటే.. మంగళ ఆ ఫోటోలో ఉన్న వాళ్లు మా కూతురు అల్లుడు.. వాళ్లు నీకు తెలుసా.. అని అడుగుతుంది. పార్థు ఏం మాట్లాడడు.. ఓ రాత్రి నుంచి ఏం తినలేదు కదా అందుకే ఏం మాట్లాడలేకపోతున్నావు కదా ఉండు నీకు టిఫిన్ తీసుకొస్తాను అంటూ కిచెన్‌లోకి వెళ్తుంటే.. పార్థు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మంగళ పిలుస్తుంది అయినా వినకుండా వెళ్లిపోతాడు పార్థు.
హాస్పిటల్‌కు వెళ్లిన అమర్ ఐసీయూ బయట నిలబడి డాక్టర్ కోసం వెయిట్ చేస్తుంటాడు. లోపల డాక్టర్, మనోహరితో చాలా కామెడీగా మాట్లాడుతుంటాడు. నువ్వు చాలా లక్కీ బతికిపోయావు.. ఈసారి పిల్స్ మింగినప్పుడు కొన్ని ఎక్కువ తీసుకో.. హ్యాపీగా పైకి వెళ్లిపోతావు అంటాడు. మనోహరి కోపంగా చూస్తుంది. డాక్టర్ బయటకు వెళ్లిపోతాడు. ఎలా డాక్టర్ అంటూ అమర్ అడిగితే.. కడుపులో మొత్తం క్లీన్ చేశాము.. ఓ అరగంట తర్వాత తీసుకెళ్లొచ్చు అని చెప్పగానే.. అమర్ వాళ్లు అందరూ లోపలికి మనోహరి దగ్గరకు వెళ్తారు.
మనోహరిని చూసిన అమర్ ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు మనోహరి.. అంటూ సమయానికి డాక్టర్ రిస్క్ తీసుకోకపోతే ఏమైయ్యేది అంటే.. మనోహరిని సమయానికి హాస్పిటల్‌కు తీసుకొచ్చింది నేనే సార్ అంటుంది యాదమ్మ. మనోహరి కోపంగా చూస్తూ.. ఇప్పుడు ఈ టైంలో ఆ డైలాగులు అవసరమా అని మనసులో అనుకుంటూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న పార్థు చనిపోవడంతో డిప్రెషన్ తట్టుకోలేక ఇలా చేశాను. పైగా వైజయంతి, పార్థు చావుకు నేనే కారణం అయినట్టు నన్ను అనుమానిస్తుంది అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తుంది మనోహరి. అందుకు అమర్, మనోహరిని ఓదారుస్తాడు. పార్థు లేనప్పుడు తాను బతికి ఏం లాభం అంటూ మనోహరి ఇంకాస్త ఏడుపు డోస్ పెంచుతుంది.
అమర్ తాను ఆరు చనిపోయినప్పుడు పిల్లల కోసం నిలబడ్డానని చెబితే.. నీకు భాగీ దొరికింది మరి నాకు ఎవరు దొరుకుతారు..? నన్ను ఎవరు చూసుకుంటారు అమర్ అని మనోహరి తన యాక్టింగ్ పెంచేస్తుంది. ఆ మాటలకు అమర్ సార్ నిన్ను చూసుకోవాలనే కదా నీ యాక్టింగ్ అని మనసులో అనుకుంటుంది. సార్ మనోహరి మేడంను ఇలాగే వదిలేస్తే తను మళ్లీ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మనోహరిని మనతో పాటు ఇంటికి తీసుకెళ్దాం అని చెప్తుంది. అందుకు అమర్.. మనోహరిని తానేం ఇంట్లోంచి వెళ్లిపోమ్మని చెప్పలేదని.. తనే వెళ్లిపోయిందని ఇప్పుడు ఇంటికి రావాలనుకుంటే రావొచ్చని చెప్తాడు. మనోహరి మాత్రం మిస్సమ్మ ఏమనుకుంటుందో అంటే.. తనేం అనుకోదు.. ఆరు ఫ్రెండ్‌గా తనకంటే ముందే నువ్వు ఇంట్లో ఉన్నావు కదా..? ఇంటికే వెళ్దాం పదండి అంటాడు అమర్.
మరోవైపు రాథోడ్ వెళ్లి వైజయంతికి మనోహరి స్లీపింగ్ పిల్స్ మింగిన విషయం చెప్తాడు. వైజయంతి షాక్ అవుతుంది. ఏంటి రాథోడ్ నువ్వు చెప్పేది అంటే అవును మేడం మనోహరి గారు నిద్రమాత్రలు మింగారట సీరియస్‌గా ఉందని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు అని చెప్పగానే.. వైజయంతి కంగారుగా ఏ హాస్పిటల్ మనం వెళ్దాం పద అంటుంది. అక్కర లేదు మేడం ఇప్పుడు పర్వాలేదట.. ఇంటికి తీసుకొస్తున్నారు అని రాథోడ్ చెప్పగానే.. వైజయంతి కోపంగా మనోహరి ఎందుకు ఇలా చేసింది అంటే.. రాథోడ్ కూడా కోపంగా ఏముంది మేడం మళ్లీ ఈ ఇంటికి తిరిగి రావడానికి అంటూ చెప్పగానే.. వైజయంతి అనుమానంగా చూస్తుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.