E-Paper
Advertisement

అల్లా మీద ఒట్టు… 5-0 తేడాతో కివీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

అల్లా మీద ఒట్టు… 5-0 తేడాతో కివీస్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది
Advertisement

Tanveer Ahmed On IND VS NZ ODI: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య బుధవారం నుంచి 5 మ్యాచ్ ల వన్డే సిరీస్ షురూ కానుంది. ఆక్లాండ్ వేదికా తొలి వన్డే జరుగనుంది. ఇలాంటి తరుణంలో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ పై మాజీ పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా, వన్డే సిరీస్ గెలవడం కష్టమేనన్నాడు. అదృష్టం కొద్ది 3-2 తేడాతో టీ20 సిరీస్ గెలిచిందని, వన్డేల్లో మాత్రం అంత సీన్ లేదని హేళన చేశాడు. ఫ్లాట్ పిచ్ లపై ఆడిన టీమిండియా క్రికెటర్లు…కివీస్ లాంటి బౌన్సీ మైదానాల్లో ఆడటం ఈజీ కాదని పరువు తీశాడు. ఈ సిరీస్ లో 5-0 తేడాతో టీమిండియా చిత్తుగా ఓడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలా కాకుండా టీమిండియానే సిరీస్ గెలిస్తే… పాకిస్తాన్ వీధుల్లో బట్టలు లేకుండా తిరుగుతానని స్టేట్ మెంట్ ఇచ్చాడు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

న్యూజిలాండ్ గడ్డపై వన్డే సిరీస్ గెలిస్తే బట్టలు లేకుండా తిరుగుతా

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగనున్న వన్డే సిరీస్ పై తన్వీర్ అహ్మద్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 సిరీస్ లో బీసీసీఐ మాయ చేయడంతో టీమిండియా బయట పడిందని..కానీ వన్డేల్లో గెలవడం అంత ఈజీ కాదంటూ బాంబ్ పేల్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు ఉన్నప్పటికీ న్యూజిలాండ్ ముందు తేలిపోతారని అంచనా వేశాడు. కివీస్ గడ్డపై బౌన్సర్లను తట్టుకునే జట్టు నిలబడుతుందన్నాడు. కానీ టీమిండియా సీనియర్లు, జూనియర్లు కేవలం ఐపీఎల్ జరిగే ఫ్లాట్ పిచ్ లకే అలవాటు పడిపోయారంటూ సెటైర్లు పేల్చాడు. ఇలాంటి తరుణంలోనే కివీస్ పిచ్ లపై ఆడటం కష్టమేనన్నాడు. గత ఏడాది కాలంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ గడ్డలపై టీమిండియా వన్డే సిరీస్ లు ఆడిందని తెలిపాడు. ఈ రెండు సిరీస్ లలోనూ టీమిండియా ఓడిపోయిందని గుర్తు చేశాడు. అదే సీన్ న్యూజిలాండ్ తో జరిగే వన్డే సిరీస్ లోనూ జరగడం ఖాయమని హెచ్చరించాడు. అలా జరుగకుండా, టీమిండియానే వన్డే సిరీస్ గెలిస్తే మాత్రం బట్టలు లేకుండా తిరుగుతానని ఛాలెంజ్ చేశాడు.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

ఉదయం 7.30 గంటలకే మ్యాచ్ లు

టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగే 5 వన్డేలు ఎర్లీ మార్నింగే ప్రారంభం అవుతాయి. ఉదయం 7 గంటల సమయంలో టాస్ వేయనుండగా, 7.30 గంటలకు మ్యాచ్ షురూ కానుంది. అంటే మధ్యాహ్నం వరకు రిజల్ట్ వచ్చేస్తుంది. ఈ క్రమంలో క్రికెట్ ఫ్యాన్స్ ఎర్లీ మార్నింగే లేచేలా ప్లాన్ చేసుకోవాలని, లేకపోతే మ్యాచ్ లు మిస్సై పోతారంటూ పోస్టులు వైరల్ అవుతున్నాయి.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

Related News

84 లక్షల మంది టికెట్ల కోసం తన్నుకుంటుంటే..పాక్‌తో మ్యాచ్‌లే వద్దంటూ టీమిండియా పారిపోతోంది!

కావ్య మాస్టర్ మైండ్..CSKలోకి లివింగ్‌స్టోన్‌, SRHలోకి డేంజర్ బౌలర్ ?

ధోనిపై బ్రియాన్ లారా రౌడీయిజం…ఔట్ కాక‌పోయినా పెవిలియ‌న్ వెళ్లిపోయాడుగా

ఓట‌మి భ‌యంతోనే సీనియ‌ర్లను దించుతున్నారు..టీమిండియాపై అక్త‌ర్ ఫైర్

న‌లుగురు న్యూజిలాండ్ క్రికెట‌ర్ల‌కు గాయాలు…టీమిండియాను గెలిపిందుకే ఈ డ్రామాలంటూ క‌మ్రాన్ ఆరోప‌ణ‌లు!

న్యూజిలాండ్ ఎదురుదాడికి గుర్నూర్, అకీబ్ న‌బీ త‌ట్టుకోలేరు..ప్యాంట్లు త‌డిపేసుకుంటారు

బాబ‌ర్ ఆజం పెద్ద వెధ‌వ‌..సింప‌తీ కోసమే డ్రామాలు చేస్తున్నాడు

అభిషేక్, మ‌హ్మ‌ద్ అమీర్ SRHలోనే ఉంటే బాలీవుడ్ సినిమా రేంజ్ లో త‌న్నుకుంటారు

Big Stories

Advertisement
×