Viral Video: మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ఎన్ని కఠిన చట్టాలు అమల్లోకి తెస్తున్నా, పోకిరీలు ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా లైంగికంగా, మానసికంగా వేధింపులకు దిగుతూనే ఉన్నారు. తాజాగా గురుగ్రామ్ లో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగు చూసింది. రద్దీగా ఉండే చౌరస్తాలో ఓ మోడల్ కారు కోసం వెయిట్ చేస్తుండగా, ఓ యువకుడు ఆమెను చూసి వ్యవహరించిన తీరుతో షాక్ కు గురయ్యింది. రోడ్డు మీదే ఆమెను చూసి ఆపుకోలేక, హ*ప్రయోగం చేసుకున్నాడు. అతడి చేష్టలను ఆమె కెమెరాలో షూట్ చేసింది. తాజాగా ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంతకీ సదరు మోడల్ ఏం చెప్పిందంటే..
“ ఆగష్టు 2న ఓ ముఖ్యమైన పని మీద జైపూర్ నుంచి గురుగ్రామ్‌కు వచ్చాను. ఎప్పుడూ బిజీగా ఉండే రాజీవ్ చౌక్ దగ్గర క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘనట జరిగింది. ఒక వ్యక్తి నన్ను చూశాడు. అటూ ఇటూ తిరుగుతూ నన్ను మరీ మరీ చూస్తూ తన ప్యాంటు జిప్ విప్పాడు. ఆపై హ* ప్రయోగం చేస్తూ కనిపించాడు. నాకు చాలా అసహ్యం అనిపించింది. షాక్ లో భయంతో వణికిపోయాను. ఆ సమయంలో గట్టిగా అరవాలని ఉన్నా ఆ పని చేయలేకపోయాను. దగ్గరికి వెళ్లి చాచిపెట్టి చెంప మీద కొట్టాలని ఉన్నా కొట్టలేకపోయాను. నేను సేఫ్ గా ఉంటే చాలు అనుకున్నాను” అని సదరు మోడల్ వెల్లడించింది.
➡️Model Alleges Sexual Harassment While Waiting For Cab In Gurugram; FIR Filed After Video Goes Viral.
➡️In a disturbing incident from Gurugram, a model alleged that she was sexually harassed in broad daylight at Rajiv Chowk while she was waiting for a cab that she had booked. pic.twitter.com/WE4GMJ7Uml
— Kiran Suresh (@Kiransuresh04) August 7, 2025
పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు!
ఈ ఘటన జరిగిన వెంటనే చాలా సార్లు పోలీసులను, మహిళా హెల్ప్ లైన్ ను సంప్రదించినప్పటికీ వెంటనే సాయం అందలేదని చెప్పింది. చివరకు పోలీసులతో మాట్లాడిన ఫిర్యాదును ఆన్ లైన్ లో నమోదు చేయడానికి నిరాకరించారని చెప్పింది. “నేను ఇంటికి చేరుకున్న తర్వాత, మొత్తం సంఘటనను ట్వీట్ చేసి, పోలీసులు, మహిళా హెల్ప్ లైన్, ప్రభుత్వానికి ట్యాగ్ చేసాను. కానీ, ఎటువంటి స్పందన రాలేదు. ఆటోమేటెడ్ మెసేజ్ కూడా రాలేదు. నేను పోలీసులను సంప్రదించినప్పుడు కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్‌కు రావాలని చెప్పారు” అని ఆమె వివరించింది.
Read Also: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?
పోలీసులు ఏం చెప్పారంటే?
ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. రాజీవ్ చౌక్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నేరస్తుడిని గుర్తించేందుకు ప్రత్నిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు.
Read Also: ఓరి ‘పాకి’స్టోడా.. వాడేసిన కండోమ్ బాక్సులతో ప్లేట్లా?