BigTV English

Thammareddy: చిరు  రెమ్యూనరేషన్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్… సంపాదన కంటే ఎక్కువంటూ!

Thammareddy: చిరు  రెమ్యూనరేషన్ పై తమ్మారెడ్డి షాకింగ్ కామెంట్స్… సంపాదన కంటే ఎక్కువంటూ!

Thammareddy: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినీ కార్మికుల సమ్మె(Cini Workers Strike) జరుగుతున్న నేపథ్యంలో ఎంతో మంది నిర్మాతలు ఈ విషయాలపై స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా కొనసాగుతున్న వారిలో తమ్మారెడ్డి భరద్వాజ్(Thammareddy Bhardwaj) ఒకరు. ఈయన కూడా తాజాగా సినీ కార్మికుల సమ్మెపై స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ప్రస్తుతం సినీ కార్మికులు డిమాండ్ చేస్తూ సినిమా షూటింగులకు రాకుండా ఉన్నారు. అయితే త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం జరుగుతుందని ఈయన తెలిపారు. నిజంగానే నిర్మాతలు కార్మికులకు ఇచ్చే జీతాలు ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు.


ప్రొడ్యూసర్లు దేవుళ్ళతో సమానం…

ఇక్కడ నెలరోజుల పాటు జీతం తీసుకుని కార్మికుల గురించి రోజు వేతనాలు తీసుకునే కార్మికులను కలిపి మాట్లాడవద్దని ఈయన సూచించారు. ఒకరోజు షూటింగ్ జరుగుతుంది అంటే ఆ రోజుకు ఎవరు అవసరమవుతారో వారిని మాత్రమే తీసుకోవాలని అలా తీసుకోవడం వల్ల బడ్జెట్ తక్కువ అవుతుంది అని తెలిపారు. ప్రొడ్యూసర్లు అంటే దేవుళ్లతో సమానమని, వారు లేకపోతే కార్మికులు కూడా బ్రతకరని తెలిపారు. బీడీ కార్మికులు వ్యవసాయ కూలీలు మాదిరిగానే సినిమా కార్మికులకు కూడా ప్రతి సంవత్సరం ఇండిక్స్ ప్రకారం కొత్తవేతనం పెంచాలని సూచించారు.


40 ఏళ్ల సంపాదన కంటే ఎక్కువ..

ఈ సమావేశంలో భాగంగా ఈయన మెగాస్టార్ చిరంజీవికి(Chiranjeevi) సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరూ కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతమంది హీరోలు వందల కోట్ల రెమ్యూనరేషన్లను అందుకుంటున్నారు. అయితే చిరంజీవి కూడా ఒక్కో సినిమాకు సుమారు 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ విషయం గురించి తమ్మారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం చిరంజీవి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ (Remuneration) ఆయన 40 ఏళ్ల సినీ జీవితంలో సంపాదించిన దానికంటే చాలా ఎక్కువ అంటూ మాట్లాడారు.

హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్..

తన సంపాదన కంటే చిరంజీవి ప్రస్తుతం ఒక్కో సినిమాకు భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటూ ఈ సందర్భంగా తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్న నేపథ్యంలోనే హీరోల రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగిపోయాయని తెలుస్తుంది. ఇలా అధిక రేమ్యూనరేషన్లను పెంచడం కూడా నిర్మాతలకు ఇబ్బందికరంగానే మారుతుందని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి కూడా కార్మికులు హీరోలకు వందల కోట్ల రెమ్యూనరేషన్లు ఇస్తున్నారు. మాకు చాలి చాలని జీతాలు ఇస్తున్నారని, తమకు 30 శాతం పెంచితేనే షూటింగ్స్ లో పాల్గొంటాము అంటూ సమ్మె చేస్తున్నారు. అయితే ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చిందని, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం కూడా దొరకబోతుంది అంటూ నిర్మాతలు తెలియజేస్తున్నారు.

Also Read: Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Related News

Lokesh Kanagaraj: డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటుడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు

Lokesh Kanagaraj: నేను కూలీ సినిమా కథను మొదట ఆ దర్శకుడు కి చెప్పాను

Kapil Sharma -Kap’s Cafe: కపిల్ శర్మ కేఫ్ పై మరోసారి ఉగ్రదాడి… ఈసారి ముంబైలో అంటూ హెచ్చరిక!

Paradise: నాని ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా, శ్రీకాంత్ అదిరిపోయే ప్లానింగ్

Actor Prithivi : సినిమాలు వదిలేద్దాం అనుకునే టైంలో సందీప్ రెడ్డి నిలబెట్టాడు

Rajinikanth: రజినీ కాంత్ 50 ఏళ్ల సినీ కెరియర్ పూర్తి.. 5,500 ఫోటోలతో అభిమాని వింత పని!

Big Stories

×