E-Paper
Advertisement

Vishnu Priya: ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లను.. అడ్డంగా దొరికిపోయిన విష్ణుప్రియ.. వీడియో వైరల్

Vishnu Priya: ఎన్ని కోట్లు ఇచ్చినా వెళ్లను.. అడ్డంగా దొరికిపోయిన విష్ణుప్రియ.. వీడియో వైరల్
Advertisement

Vishnu Priya About Bigg Boss Show Video: అతి తక్కువ సమయంలోనే విపరీతమైన ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది ‘బిగ్ బాస్’ అనే చెప్పాలి. మొదటి సీజన్ నుంచి మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది. చాలా మంది ఈ షో కోసం పడిగాపులు కాస్తుంటారు. తిండి నిద్రహారాలు మానేసి చూస్తుంటారు. షో పూర్తయిన వరకు కళ్లార్పకుండా చూస్తారు. అయితే అలాంటి వారు ఎందరో ఉన్నారు. మరి అందరికీ నచ్చాలని లేదుగా.. అందువల్లనే మరికొందరికి ఈ షో అంటే అస్సలు నచ్చదు. అసలు ఈ షో అంటేనే చిరాకు పడేవారెందరో ఉన్నారు.

అంతెందుకు బిగ్ బాస్ హౌస్ట్ చేస్తున్న నాగార్జునకే ఈ షో అంటే నచ్చదని టాక్. ఎందుకంటే ఇంతకు ముందు ఈ షోను నాగార్జున చాలా చులకనగా చూసి మాట్లాడాడు. అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. మరి ఆయనకే నచ్చకపోతే ఎందుకు హూస్ట్‌గా చేస్తున్నారు అనే డౌట్ రావచ్చు. దేనికైనా డబ్బే మూలం అన్నట్లు. నచ్చినా నచ్చక పోయినా.. డబ్బు సంపాదించడం కోసం చేయాల్సిందే. అదీగాక బిగ్ బాస్ షో మొత్తం అన్నపూర్ణ స్టూడియోలోనే సెట్ వేశారు. దాంతో మరింత ఆదాయం వస్తుంది.

Advertisement

అయితే ఆయనొక్కడే కాదండోయ్ ఈ షో అంటే నచ్చని వారు చాలా మందే ఉన్నారు. అసలు ఈ షో చూడనని.. అందులో ఆఫర్ వచ్చినా వెళ్లనని అనుకునేవారు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఎన్నో కోట్లు ఇచ్చినా బిగ్ బాస్ హౌజ్‌ గేటు కూడా టచ్ చేయనని కూడా చెప్పేవారు లేకపోలేదు. అలాంటి వారు.. ఒక్కసారిగా బిగ్ బాస్ హౌజ్‌లో కనిపించి షాక్ ఇస్తున్నారు. అలాంటిదే ఇప్పుడూ జరిగింది. ప్రముఖ యాంకర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా బిగ్ హైజ్‌కి పోనని.. ఎంత డబ్బు ఇచ్చినా అస్సలు వెళ్లనని ఆమె ఆ వీడియోలో చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె మరెవరో కాదు యాంకర్ విష్ణుప్రియ .

Also Read: బిగ్ బాస్ హౌజ్‌లో అప్పుడే గొడవలు.. ఎవరెవరి మధ్య అంటే?

Advertisement

బిగ్ బాస్ 8 తెలుగు షో సెప్టెంబర్ 1న గ్రాండ్ లెవెల్లో ప్రారంభం అయింది. ఈ షోకు దాదాపు 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ అయ్యారు. అందులో యాంకర్ విష్ణుప్రియ ఒకరు. యాంకర్‌గా తనదైన శైలిలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన అల్లరి, చిల్లర చేష్టలతో ఎంతో మంది ప్రేక్షకుల్ని అలరించింది. ఈ సీజన్లో హాట్ హాట్‌గా ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇదంతా పక్కన పెడితే.. అసలు బిగ్ బాస్ పై యాంకర్ విష్ణుప్రియ అభిప్రాయం గతంలో ఎలా ఉండేదో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.

ఆమె గతంలో బిగ్ బాస్‌పై ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు అలా చెప్పి.. ఇప్పుడేంటి ఇలా మారిపోయిందని గుస గుసలాడుకుంటున్నారు. అయితే మరి గతంలో విష్ణుప్రియ ఏం మాట్లాడింది అనే విషయానికొస్తే.. ‘‘బిగ్ బాస్ వాల్లు ఎన్ని కోట్లు ఇచ్చినా నేను వెళ్లను. ఎందుకంటే ప్రపంచం చాలా అందంగా బయట ఉన్నప్పుడు ఒక్క హౌజ్‌లో ఎలా ఉంటారు. మీ ఇంట్లో వాళ్లు ఉన్నారు. వాళ్లని చూసుకోవాలి. నేను బిగ్ బాస్ పర్సన్‌ని కాదు. నేనేప్పుడు బిగ్ బాస్ చూడలేదు. పర్సనల్‌గా చెప్పాలంటే దానికి నేను యంకరేజ్ చేయను. నెవ్వర్ రాసిపెట్టుకోండి.. ఒకవేళ వెళ్తే రిటన్ నన్న తప్పుబట్టండి’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోపై ఎంతో మంది ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×