BigTV English

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. ఆ సినిమా ఒక్కటే స్పెషల్

OTT Releases This Week: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే.. ఆ సినిమా ఒక్కటే స్పెషల్

OTT Releases This Week: కరోనా వచ్చాక జనం ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. థియేటర్ల ఆదాయాన్ని ఓటీటీలు మింగేస్తున్నాయని బయ్యర్లు లబోదిబో అంటున్నారు. ఓటీటీ ల ద్వారా వేల కోట్ల ఆదాయానికి గండి పడుతోందని ఎగ్జిబిటర్లు గొడవపెడుతున్నారు. వచ్చే ఏడాదికి ఓటీటీల ద్వారా రూ.12 వేల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా. దీనితో ఇక థియేటర్లు అన్నీ మూతపడే ప్రమాదం ఉందని ఎప్పటినుంచో పంపిణీదారులు, సినిమా ప్రదర్శన దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్లలో మూడు గంటల పాటు చూసే ప్రేక్షకులు ఓటీటీలకు అంత సమయం కేటాయించడం కష్టంగా మారుతోంది.


దీనితో సినిమా థియేటర్లలో మూడు గంటల నిడివిని ఓటీటీల ప్రదర్శన కొచ్చేసరికి మరింత తగ్గించేస్తున్నారు నిర్మాతలు. ఇటీవల కల్కి సినిమా కూడా మూడు గంటలనుంచి ఐదారు నిమిషాలు కట్ చేశారు. ఓ పాటను కూడా తొలగించారు. ఇక కేవలం ఓటీటీల ప్రదర్శన కోసమే కొన్ని వెబ్ సిరీస్,మూవీస్ వస్తుంటాయి. వాటిలో సరైన కంటెంట్ ఉంటేనే ఓటీటీ వినోద సంస్థలు వాటిని కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. దీనితో ఓటీటీ సినిమాలు తీసేవారు సరైన కంటెంట్ తో వస్తేగానీ తమకు ఆదరణ ఉండదని అనుకుంటున్నారు. ఓటీటీలలో వారానికి ఒకసారి దాదాపు 20కి పైగా అన్ని భాషలలో కలిపి రిలీజవుతుంటాయి. అయితే ఈ వారం చిన్నా చితకా సినిమాలన్నీ కలిపి 12 దాకా విడుదల కాబోతున్నాయి. ఈ వారం విజయ్ దళపతి నటింిన ది గోట్ మూవీ ఒక్కటే థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేయబోతోందని తెలుస్తోంది. అలాగే మరో చిన్న సినిమా 35 చిన్న కథ కాదు మూవీని ఈ వారం కాకుండా ఈ నెల 13న విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

విజయ్ ద గోట్


కంటెంట్ ను నమ్ముకుని తీసిన సినిమాది గోట్.  తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా భారీ స్క్రీన్లతో విడుదల కాబోతోంది. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. విజయ్ సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినా మినిమం రూ.200 కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతుంటాయి. అలాంటిది హిట్ టాక్ వస్తే తప్పకుండా రూ.500 కోట్లకు పైమాటే. ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణ కాగా రూ.400 కోట్లు ఖర్చుపెట్టారు నిర్మాతలు. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీనితో తొలి రోజే ఈ మూవీ రూ.75 నుంచి 85 కోట్ల వసూళ్లు చేస్తుందని అంచనా.

అమెజాన్ ప్రైమ్ 

ఇక అమెజాన్ ప్రైమ్ లో ఈ వారం సెప్టెంబర్ 6న కాల్ మీ బే అనే హిందీ వెబ్ సిరీస్ విడుదల కాబోతోంది. అలాగే సెప్టెంబర్ 3న ది ఫాల్ గై అనే ఆంగ్ల మూవీ జియో సినిమాలో రిలీజ్ కాబోతోంది. ఇక డెస్సీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 4న బ్రిక్ టూన్స్ (ఇంగ్లీష్) రిలీజ్ కాబోతుండగా ఆ నెల 6న కిల్ అనే హిందీ మూవీ రిలీజ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 5న ది పర్ ఫెక్ట్ కపుల్ అనే వెబ్ సిరీస్ ను విడుదల చేస్తున్నారు. అలాగే అదే తేదీన అపోలో 13 అనే సర్వైవల్ డాక్యుమెంటరీ ని సైతం రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 6న బ్యాబ్ బాయ్స్..రైడ్ అండ్ డై అనే ఆంగ్ల మూవీని రెబల్ రిడ్జ్ అనే మరో ఆంగ్ల మూవీని నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కాబోతున్నాయి. ఇక సోనీ లివ్ లో చూసినట్లయితే సెస్టెంబర్ 6న ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్, ది ఎటర్నల్ డాటర్, వెలరియన్ అండ్ ది సిటీ ఆప్ తౌజెండ్ ప్లానెట్స్ అనే ఆంగ్ల మూవీలను ఒకే సారి విడుదల చేస్తున్నారు.

Related News

Sundarakanda OTT: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన నారా రోహిత్‌ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

OTT Movie : పెంచిన పెదనాన్న ఇంటిని తగలబెట్టే లేడీ కిలాడీ… అమ్మాయి కాదు మావా ఆడపులి… పిచ్చెక్కించే ట్విస్టులు

OTT Movie : మరో వ్యక్తితో భర్త దగ్గర అడ్డంగా దొరికిపోయే భార్య… అతనిచ్చే ట్విస్టుకు దిమాక్ కరాబ్ మావా

OTT Movie : కంటికి కన్పించిన అమ్మాయిని వదలకుండా అదే పాడు పని… ఈ సైకో ఇంత కరువులో ఉన్నాడేంటి భయ్యా ?

OTT Movie : పెళ్ళైన ట్యూషన్ టీచర్ పై ప్రేమ… సీక్రెట్ లెటర్ తో బండారం బట్టబయలు… IMDbలో 7.5 రేటింగ్

OTT Movie : తవ్వకాల్లో బయటపడే శవపేటిక… దుష్ట శక్తి విడుదలవ్వడంతో దబిడి దిబిడి… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్లు డోంట్ వాచ్

OTT Movie : బాబోయ్ చావడానికెళ్లి ఇలా బుక్కయ్యాడేంటి… 12 జన్మలు, 12 సార్లు చావు… కల్లో కూడా చావు గురించి ఆలోచించరు

OTT Movie : బీచ్ ఒడ్డున బట్టల్లేకుండా… రెండేళ్ల పాటు రెస్ట్ లేకుండా… ఒక్కో సీన్ అరాచకం భయ్యా

Big Stories

×