BigTV English

Bigg Boss Telugu 8 Day 2 Promo: బిగ్ బాస్ హౌజ్‌లో అప్పుడే గొడవలు.. ఎవరెవరి మధ్య అంటే?

Bigg Boss Telugu 8 Day 2 Promo: బిగ్ బాస్ హౌజ్‌లో అప్పుడే గొడవలు.. ఎవరెవరి మధ్య అంటే?

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ అంగరంగ వైభవంగా మొదలైపోయింది. ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 1వ తేదీన ఎనిమిదవ సీజన్ వచ్చేసింది. దాదాపు 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో ఏడుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు ఉన్నారు. ఈ షో ప్రారంభంలో సినీ స్టార్లు సందడి చేశారు. కంటెస్టెంట్లతో ముచ్చటించారు. ఇక నాగ్ మాస్ ఎంట్రీ క్లాసిక్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. మొదటి రోజు చాలా సందడి సందడిగా ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతో కొనసాగింది.


అయితే ఈ 14 మంది కంటెస్టెంట్‌లలో బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన వ్యక్తి ఎవరైన ఉన్నారా అంటే అది నాగ మణికంఠ మాత్రమే. ఎందుకంటే ఫస్ట్ డేనే అతడ్ని ఎలిమినేట్ చేసేందుకు మిగతా కంటెస్టెంట్లు సిద్ధమయ్యారు. హౌజ్‌లో నుంచి బయటకు పంపించడానికి ముందే టార్గెట్ చేశారు. దీంతో అతడు చాలా ఎమోషనల్ అయ్యాడు. అయితే అది ఫేక్ ఎలిమినేషన్ కావడంతో నాగ మణికంఠతో పాటు ఆడియన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఇక ఇలా ఫస్ట్ డే కొనసాగింది.

ఇక సెకండ్ డే ఎలా ఉండబోతుందో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండవ రోజు ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే ఆట మొదలైందని అర్థం అవుతుంది. బిగ్ బాస్ ఆట స్టార్ట్ చేసినట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది. దాదాపు 14 మంది కంటెస్టెంట్లు హౌజ్‌లో ఎంట్రీ ఇచ్చి గేమ్ స్టార్ట్ చేశారు. మునుపటి సీజన్లకంటే మరింత భిన్నంగా ఈ సారి గేమ్స్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఆదిత్య ఓంపై ఎటాగింగ్ ప్లే మొదలైనట్లు ప్రోమో చూస్తే అర్థం అవుతుంది.


Also Read:  ‘బిగ్ బాస్’ రూల్స్ మార్చేశారు గురూ, అవి లేకుండా ఎలా?

ఈ ప్రోమోలో ఆదిత్య ఓం గురించి నిఖిల్, పృథ్వీలతో చెప్తూ చాలా ఫైర్ అయ్యాడు మణికంఠ. ఈ మేరకు అతడి బిహేవియర్‌లో తేడా ఉంది.. మాట్లాడే విధానంలో కూడా తేడా ఉందని.. అందువల్లనే నేను అతన్ని లైక్ చేయనని కుండబద్దలు కొట్టాడు. ఆ తర్వాత ప్రోమోలో.. సరసరదా ఆటలు, పాటలు, డ్యాన్స్‌లు చూపించి అదరగొట్టేశారు. అయితే ఒక్కసారిగా ఆరెంజ్‌లతో గేమ్ స్టార్ట్ చేశారు. దీంతో ఈ గేమ్‌కి సోనియా అభ్యంతరం తెలిపింది. దీనిపై వెంటనే శేఖర్ భాషాకు కోపం వచ్చి ఆమె వ్యాఖ్యలను ఖండించాడు.

బిగ్ బాస్ రూల్స్‌లో ఎక్కడైనా ఆరెంజ్‌లతో ఆడకూడదని రాశాడా? అని ఆమెను ప్రశ్నించాడు. అలా కాసేపు వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చుట్టూ ఉండే కంటెస్టెంట్లు సైలెంట్‌గా వారి గొడవను చూస్తూ ఉన్నారు. ఆరేంజ్‌లతో ఆడుకుంటూ తినడం మంచిది కాదని.. దాన్ని ఇతర కంటెస్టెంట్‌లకు పెట్టొద్దని సోనియా చెప్తుంది. అయితే అలానే చేస్తానని.. అలా చేస్తే ఏమైతుందని.. నేను అలానే ఆడుతూ తింటానని భాషా మొండుకేశాడు. దీంతో వీరిద్దరి మద్య వాగ్వాదం చోటుచేసుకుంది.

దీంతో సోనియా.. నీకు నచ్చిన వాటితో ఆడుకో.. డ్రైనేజీలో వేసి మళ్లీ అదే తినుకో.. అంతేకాని అది మాత్రం వేరే వాల్లకు పెట్టకు అంటూ భాషాకు గట్టిగా కౌంటర్ ఇచ్చింది. దానికి ఇంకా ఎటకారం చేస్తూ శేఖర్ భాష ఆడుకున్న ఆరెంజ్‌లను తింటూ.. ఇప్పుడు నేను మనిషిని కానా? అంటూ ఆమెతో వితండవాదం చేశాడు. అయితే ఆమె మాత్రం కూల్ గానే చెప్పినా.. భాషా మాత్రం రెచ్చిపోయాడు. ఇలా జరిగిన అనంతరం మరో గేమ్ స్టార్ట్ చేశారు. మొదటి ఆరుగురు కంటెస్టెంట్లకు ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. అలా సెకండ్ డే ప్రోమో సాగింది. మీరు కూడా ఈ ప్రోమో చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×