BigTV English

Suresh Raina on Team India: బాబూ.. బంగ్లా అక్కడ వణికిస్తోంది జాగ్రత్త!

Suresh Raina on Team India: బాబూ.. బంగ్లా అక్కడ వణికిస్తోంది జాగ్రత్త!
Suresh Raina on Team India: ఒకవైపు టీమ్ ఇండియా ప్లేయర్లలో చాలామంది దులీప్ ట్రోఫీ ఆడుతున్నారు. కానీ సీనియర్ ప్లేయర్లయిన విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, సిరాజ్, రవీంద్ర జడేజా లాంటి వారు ఆడటం లేదు. మరోవైపు మహ్మద్ షమీ ఇంకా ఫిట్ నెస్ సాధించలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. ఈ ఆడనివారు ఎవరైతే ఉన్నారో.. వారే రేపు బంగ్లాదేశ్ తో జరిగే రెండు టెస్టు మ్యాచ్ ల్లో ఆడనున్నారు.

దులీప్ ట్రోఫీ అంతా రెడ్ బాల్ అంటే టెస్ట్ మ్యాచ్ స్థాయిలో జరుగుతుంది. కానీ అక్కడ ఆడే కుర్ర బ్యాచ్ అంతా కూడా టీ 20 స్పెషలిస్టులన్నమాట. ఇక్కడంతా రివర్స్ లో జరుగుతోంది. టెస్టు సిరీస్ ఆడాల్సిన వాళ్లేమో ఇంటి దగ్గరున్నారు. టెస్టు జట్టులో చోలులేని వాళ్లందరూ రెడ్ బాల్ క్రికెట్ ఆడుతున్నారు.


నిజానికి వీరందరూ వైట్ బాల్ ఎక్స్ పర్ట్స్. అంటే టీ 20 మ్యాచ్ లన్నమాట. కానీ వీరికి ఆ ఆట నేర్పిస్తున్నారు. రెండవది టెస్టులు అయింతర్వాత మూడు టీ 20లు ఉన్నాయి. అప్పుడు రెడ్ బాల్ ప్రాక్టీస్ తో వచ్చిన కుర్రాళ్లు వైట్ బాల్ దగ్గర బోల్తా కొడితే ఎలా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి తల తిరుగుడు వ్యవహారాలు చేస్తున్నారనే ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ బీసీసీఐని ఎదిరించారని అంటున్నారు.

ఆడాల్సిన వారిని ఇంట్లో కూర్చోబెట్టి బద్దకిస్టులను చేస్తున్నారు. టెస్ట్ క్రికెట్ కి పనికిరాని వారితో రెడ్ బాల్ క్రికెట్ ఆడించి, వీరి ఒరిజినాలిటీని నాశనం చేస్తున్నారని భారత మాజీ క్రికెటర్ సురేశ్ రైనాలాంటి వాళ్లు మండిపడుతున్నారు.


ఇంతకీ విషయం ఏమిటంటే, ప్రస్తుతం బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. ఆల్రడీ తొలిటెస్టు మ్యాచ్ గెలిచిన బంగ్లాదేశ్, రెండో టెస్టులో కూడా పై చేయి సాధించేలాగే కనిపిస్తోంది. అలాగే బంగ్లాదేశ్ స్పిన్నర్లు పాకిస్తాన్ బ్యాటర్లకు వారి దేశంలోనే చుక్కలు చూపిస్తున్నారు.

Also Read:  నేను అలాంటోడ్ని కాను: జో రూట్

మరి మన టీమ్ ఇండియా ఆటగాళ్లు, అదే ఇంటి దగ్గర రెస్ట్ తీసుకుంటున్న సీనియర్లు తాజాగా శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ ఎలా ఆడి, ఓడిపోయి వచ్చారో అందరికీ తెలిసిందే. అక్కడ కూడా సాధారణ శ్రీలంక స్పిన్నర్లకే వికెట్లు అప్పగించారు. మరిప్పుడు బంగ్లాదేశ్ స్పిన్నర్లు పాకిస్తాన్ గడ్డపై వారినే అల్లాడిస్తున్నారు.

రేపు మన ఇండియాలో అలాగే వణికిస్తే, మనవాళ్ల పరిస్థితేమిటి? అని సురేశ్ రైనా ప్రశ్నిస్తున్నాడు. తను ఏమంటాడంటే, టెస్టు మ్యాచ్ లో నాలుగో రోజు జరిగే ఆటే కీలకం. మరి మనోళ్లు ఇంటి దగ్గర హాయిగా ఉంటే, ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు? ఎప్పుడు ఐదు రోజుల క్రికెట్ ఆడతారు? అని ప్రశ్నిస్తున్నాడు. ఇంతవరకు ఇచ్చిన రెస్ట్ చాలు అని అంటున్నాడు. ఆల్రడీ టీ 20ల నుంచి రిటైర్ అయిపోయారు కాబట్టి, వారికంత బిజీ షెడ్యూల్ కూడా లేదు కదా..అంత జాలి పడిపోవడానికని ప్రశ్నిస్తున్నాడు.

బంగ్లాదేశ్ ను మాత్రం తేలికగా తీసుకోవద్దని సురేశ్ రైనా తెలిపాడు. ఆస్ట్రేలియా వెళ్లే ముందు మంచి ప్రాక్టీసు అవుతుందని , అందుకనే త్వరగా వచ్చి ప్రాక్టీస్ చేయమని కోరాడు. అంతేకాదు గౌతం గంభీర్ ను కూడా టెస్ట్ సిరీస్ కోసం ప్రాక్టీస్ శిబిరాన్ని త్వరగా ప్రారంభించమని సలహా ఇచ్చాడు. మరేం చేస్తారో మనోళ్లు వేచి చూడాల్సిందే.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×