BigTV English

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లో మరో లవ్ ట్రాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ లో మరో లవ్ ట్రాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె?

Bigg Boss 8 Telugu: ప్రస్తుతం ఎక్కడ విన్నా బిగ్ బాస్ పేరే ఎక్కువగా వినిపిస్తుంది. టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ షో పై జనాలకు రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుంది. మూడు వారాల నామినేషన్స్ పూర్తి అయ్యింది. ఇక నాలుగోవారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. మొన్నటివరకు సీరియస్ టాస్క్లతో ఉన్న బిగ్ బాస్ లో హౌస్ మెట్స్ చిల్ అయ్యేలా కొత్త కొత్త టాస్క్ లను బిగ్ బాస్ తీసుకొస్తున్నారు. సీరియస్‌ టాస్క్‌లకు చెక్‌ పెడుతూ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లతో ఫన్‌ గేమ్‌ ఆడించాడు. ఒకరి పాత్రల్లో మరొకరు దూరి మిమిక్రీ చేయాలన్నాడు. ఇంకేముంది.. హౌస్‌మేట్స్‌ దొరికిన ఛాన్స్‌ను బీభత్సంగా వాడుకున్నారు. హౌస్ లో మరో లవ్ ట్రాక్ మొదలైంది..


పృథ్వి తో పీకల్లోతు ప్రేమలో విష్ణు..

పృథ్వి, విష్ణుప్రియకు ఒకరంటే ఒకరికి ఇష్టం. నిన్న టాస్కులో కూడా పృథ్వి.. విష్ణుకోసం ప్రేమపాట పాడటం.. అది విని ఆమె పరవశించిపోవడం చూశాం. వారి ఇష్టాన్ని గ్రహించిన సోనియా.. పృథ్విగాడిని చూస్తే భయం వేస్తుంది. వాడు విష్ణు ప్రేమలో పడిపోయాడు ఈమె అనిపిస్తుంది అని సోనియా అంటుంది. ఇందులో నాకు ఏది నిజం? ఏది అబద్ధమో తెలియదుగానీ అలా అనిపిస్తుంది అని నిఖిల్‌తో చెప్పుకొచ్చింది. అటు విష్ణుప్రియ కూడా.. తన లేడీ గ్యాంగ్‌కు పృథ్వీ అంటే ఇష్టమని చెప్పి అతడితోనే ఎంచక్కా ఉంటోంది. వీరిద్దరి లవ్ ట్రాక్ అయితే హౌస్ లో మొదలైనట్లు కనిపిస్తుంది.


ఇకపోతే బిగ్‌బాస్‌ రేషన్‌ టాస్క్‌ పెట్టాడు. అందులో భాగంగా తాను వినిపించే శబ్దాలను వరుస క్రమంలో రాయాలన్నాడు. ఈ గేమ్‌లో శక్తి టీమ్‌ గెలవగా తమకు కూరగాయలు, పండ్లు, కూల్‌డ్రింక్‌ తీసుకునేందుకు ఎక్కువ గడువు దొరికింది. కాంతార టీమ్‌కు వాటిని సంపాదించుకునేందుకు తక్కువ సమయం మాత్రమే ఇచ్చారు.. మరో టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చాడు. ఓ బంగారు గాజును పెట్టాడు. దాన్ని ఉపయోగించుకుని వేరే టీమ్‌లోకి మారొచ్చని చెప్పాడు. నబీల్‌ను లాక్కోవాలని శక్తి టీమ్‌.. పృథ్విని లాక్కోవాలని కాంతార టీమ్‌ ప్రయత్నించింది. కానీ ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తూ నాగమణికంఠ గోల్డెన్‌ బ్యాంగిల్‌ ధరించాడు. మళ్లీ మణి కాంతారా టీమ్ కు వచ్చేశాడు. ఇక ఆదిత్య ఆ టీమ్ కు వెళ్లాడు.

హౌస్ మొత్తానికి సోనియా తన కంట్రోల్ లో పెట్టుకుందని గత కొన్ని రోజులుగా ఆడియన్స్ కు అనిపిస్తుంది.. యష్మీ చెప్పినట్లే ఆమె గేమ్ కోసం అందరిని వాడుకుంటుంది. అయితే ఈ వారం నామినేషన్స్ లో సోనియా పేరు ఎక్కువగా వినిపించింది. దాంతో ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో గేమ్ లు ఆడేది ఏమి లేదు కానీ.. ఈమె చేసే కర్ణింగ్ ఆలోచనలు బిగ్ బాస్ ఆడియన్స్ కు కోపాన్ని తెప్పిస్తుందని తెలుస్తుంది. మొత్తానికి ఈ వారం హౌస్ నుంచి ఈమె బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×