Bigg Boss 18: బిగ్ బాస్ రియాలిటీ షో అనేది కేవలం సౌత్ భాషల్లోనే కాదు.. హిందీలో కూడా చాలా ఫేమ్ సంపాదించుకుంది. అసలైతే బిగ్ బాస్ రియాలిటీ షోను ఇండియన్ ప్రేక్షకులకు పరిచయం చేసిందే హిందీ మేకర్స్. అందుకే ఇప్పటివరకు ఈ షో సక్సెస్‌ఫుల్‌గా 17 సీజన్స్ పూర్తి చేసుకొని 18వ సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 18 కూడా దాదాపు సగం వరకు పూర్తయ్యింది. అయితే సౌత్ భాషల్లోని బిగ్ బాస్‌తో పోలిస్తే హిందీ బిగ్ బాస్‌లో రియాలిటీ మరీ ఎక్కువగా ఉంటుంది. అందుకే తరచుగా దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇద్దరు కంటెస్టెంట్స్ కాలర్ పట్టుకొని కొట్టుకొని ఆడియన్స్‌కు మరింత కంటెంట్ ఇచ్చారు.
కంటెంట్ కోసమే
మామూలుగా సౌత్ భాషల్లోని బిగ్ బాస్ అయితే ఒక కంటెస్టెంట్‌పై మరొక కంటెస్టెంట్‌కు కోపం వస్తే వారి పైపైకి వెళ్లి గొడవపడతారు. ఆ తర్వాత ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటారు. అంతే కాకుండా సౌత్ భాషల్లోని బిగ్ బాస్‌లో ఒక కంటెస్టెంట్‌పై మరొక కంటెస్టెంట్ చేయి చేసుకోవడం అనేది చాలా అరుదుగా జరిగింది. ఒకవేళ అలా జరిగిన ఇక్కడ యాక్షన్ చాలా సీరియస్‌గా ఉంటుంది. కానీ హిందీ బిగ్ బాస్‌లో ఎంత కొట్టుకున్నా, ఎంత తిట్టుకున్నా, కపుల్స్ మధ్య రొమాన్స్ జరిగినా కూడా వారిపై అంత సీరియస్ యాక్షన్ ఉండదు. తాజాగా మరోసారి అదే జరిగింది. ఇద్దరు అబ్బాయిలు కాలర్స్ పట్టుకొని కొట్టుకునేంత వరకు వెళ్లారు. ఇతర కంటెస్టెంట్స్ వారిని ఆపడానికి ప్రతయ్నించినా కుదరలేదు.
Also Read: బిగ్ బాస్ కోసం భారీ నష్టం.. తేజ మాటలు వింటే షాక్..!
వాగ్వాదంతో మొదలు
అవినాష్ మిశ్రా, దిగ్విజయ్ రాఠే అని ఇద్దరు కంటెస్టెంట్స్ మధ్య మొదట చిన్నగా వాగ్వాదం మొదలయ్యింది. ఆ తర్వాత అదే పెద్ద గొడవగా మారింది. ఈ గొడవ మధ్యలో ముందుగా దిగ్విజయ్ వెళ్లి అవినాష్ కాలర్ పట్టుకున్నాడు. దీంతో ఇద్దరు అలా కాలర్ పట్టుకొని గొడవ పడుతూ హౌస్ అంతా తిరిగారు. ఇతర కంటెస్టెంట్స్ వారిని ఆపడానికి ప్రయత్నించినా వారు ఆగలేదు. మొత్తానికి బిగ్ బాస్ 18లో ఇలాంటి గొడవలు జరగడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటీవల ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ మధ్య కూడా ఇంతకంటే దారుణమైన గొడవ జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వింత ప్రవర్తన
బిగ్ బాస్ 18లో ఫ్రెండ్స్ అంటూ క్లోజ్‌గా ఉండే ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆ గొడవ ఎఫెక్ట్ వల్ల వారిద్దరూ వింతగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. వారిని కంట్రోల్ చేయడానికి ఇతర కంటెస్టెంట్స్ ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. అలా బిగ్ బాస్ 18లో జరిగే చాలా విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 విషయానికొస్తే.. ప్రస్తుతం ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది.