Teja:టేస్టీ తేజ (Tasty Teja) .. సోషల్ మీడియాలో ఫుడ్డుకు సంబంధించిన వీడియోలు చేస్తూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలతో ఎక్కువగా ఫుడ్ వీడియోలు చేసి ప్రేక్షకులకు దగ్గరైన ఈయన, ఎక్కువగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లతో పాటు ప్రమోషన్స్ లో భాగంగా ఆ మూవీ సెలబ్రిటీలతో డిన్నర్, లంచ్ వంటివి చేస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఆ కారణంగానే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి మరింత క్రేజ్ దక్కించుకున్నారు.
పెళ్లి కోసం తాపత్రయం..
ఇకపోతే ఈయనకు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే, గతంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉండేది. అదేంటంటే చంద్రమోహన్ (Chandramohan ) ఏ హీరోయిన్ తో నటిస్తే ఆమె సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఫుల్ ఫేమస్ అయిపోతుంది అని,. అయితే ఇప్పుడు ఇలాంటి ఒక కాన్సెప్ట్ టేస్టీ తేజ విషయంలో జరుగుతోంది అందుకే ఆయన తెగ ఫీలైపోతున్నట్లు సమాచారం. పెళ్లి చేసుకుందామని అమ్మాయిలని చూస్తున్నా.. తనను మాత్రం ఎవరు చూడడం లేదట. ఇక బిగ్ బాస్ సీజన్ 7 లో శోభా శెట్టిని చూశాడు. కానీ ఆమె ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఈ సీజన్ లో ప్రేరణను చూసాడు కానీ ఆమెకు అప్పటికే పెళ్లయిపోయింది అంటూ పాపం టేస్టీ తేజ..ఎవరైనా అమ్మాయి తనకోసం ఉన్నారా అనే రేంజ్ లో బాధ పడిపోతున్నారు. అందుకే బిగ్ బాస్ ని కూడా రెండు చేతులు జోడించి, నెక్స్ట్ సీజన్ కి ఒకవేళ తనను పిలిచేటట్టు అయితే పెళ్లి కాని అమ్మాయిలను పంపించు బిగ్ బాస్.. ఎవరో ఒకరిని సెట్ చేసుకొని పెళ్లి చేసుకుంటా అంటూ వేడుకున్నాడు.
బిగ్ బాస్ కోసం రెండు సినిమాలు వదులుకున్న టేస్టీ తేజ..
ఇకపోతే బిగ్ బాస్ అడిగినప్పుడు హౌస్ లో క్రష్ ఎవరు అని అంటే ప్రేరణ అని చెప్పాడు. ఎందుకంటే ఆమె పర్ఫెక్ట్ హౌస్ వైఫ్ మెటీరియల్ కానీ బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తానని అసలు అనుకోలేదు. అయితే ఛాన్స్ వచ్చింది కానీ దీని కోసం రెండు సినిమాలు కూడా వదులుకున్నాను అని తెలిపాడు.. 22 రోజులు క్యారెక్టర్ ను వదులుకొని బిగ్ బాస్ కి వచ్చాను. అయితే సినిమా ఆఫర్స్ మళ్ళీ వస్తాయి. కానీ ఈ బిగ్ బాస్ వల్ల మళ్ళీ పిలుపు వస్తుందో రాదో తెలియదు అమ్మను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలనుకున్న ఒక్క ఆలోచన నన్ను మళ్ళీ హౌస్ లోకి వచ్చేలా చేసింది. అక్కడ నేను సక్సెస్ కొట్టాను. అంటూ సరిపెట్టుకున్నాడు టేస్టీ తేజ. అయితే ఈ విషయం నిన్న నెటిజన్స్ మాత్రం బిగ్ బాస్ కోసం భారీగా నష్టాన్ని మిగిల్చుకున్నామంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రెండు సినిమాలు వదులుకున్నానని చెప్పాడు.. ఆ రెండు సినిమాలు గనుక భారీ హిట్ అయి తన పాత్రకు క్రేజ్ వచ్చి ఉంటే తన రేంజ్ ఇంకా ఎక్కడికో వెళ్లి ఉండేది కదా.. అలాగే రెమ్యునరేషన్ కూడా పెరిగి ఉండేది కదా అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా టేస్టీ తేజ మాత్రం తల్లిని సంతృప్తి పరచడం కోసం సినిమాలను కూడా వదులుకోవడం నిజంగా గ్రేట్ అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు.