House Cleaning Tips: ఇళ్లు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇళ్లు శుభ్రంగా ఉంటేనే అలెర్జీలు, దగ్గు, జలుబు వంటివి రాకుండా ఉంటాయి. సమయం లేకపోవడం వల్ల చాలా మంది తరుచుగా ఇళ్లును శుభ్రం చేసుకోలేకపోతుంటారు. అందుకే అలాంటి వారి కోసం కొన్ని రకాల టిప్స్ ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ టిప్స్ వాడి తక్కువ సమయంలోనే ఇంటిని మెరిసేలా చేసుకోవచ్చు.
ఇంటిని శుభ్రపరిచే పద్ధతులు:
ఫ్యాన్లు, కిటికీలు, తలుపులతో మొదలైనవి:
ఏడాది పొడవునా ఉన్న మురికిని ఒక్క సారి శుభ్రపరచడం ప్రారంభించాలనుకుంటే, సీలింగ్ ఫ్యాన్ శుభ్రం చేయడం, కిటికీలు , తలుపులు శుభ్రం చేయడం ప్రారంభించండి. దీంతో పాటు ఇంటి గోడలపై ఉన్న సాలెపురుగులు, మురికిని కూడా శుభ్రం చేయండి. ఈ మురికి, దుమ్ము ఒక్కసారిగా నేలపైకి పడుతుంటాయి. వీటిని క్లీనింగ్ సమయంలో ఎప్పటికప్పుడు క్లీన్ చేయండి.
కిచెన్ క్లీనింగ్:
ప్రతి ఇంట్లో వంటగది చాలా ముఖ్యమైన ప్రదేశం. దీనిని సరిగ్గా శుభ్రం చేయడం ముఖ్యం. వంటగది శుభ్రం చేయడానికి బ్లీచింగ్ పౌడర్ , డిటర్జెంట్ లను ఉపయోగించవచ్చు. దీంతో కిచెన్ టైల్స్ , ప్లాట్ ఫారం తేలికగా మెరుస్తాయి. అంతే కాకుండా వంటగదిలోని వాడకుండా ఉన్న పాత్రలను ఒక ఒక చోట స్టోర్ చేసుకోండి. సమయం కుదిరినప్పుడల్లా వంట పాత్రలను క్లీన్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల మురికి పట్టకుండా ఉంటాయి. అంతే కాకుండా తెల్లగా మెరిపోతూ ఉంటాయి.
గాజు పాత్రలు:
గాజు వస్తువులను చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. దీని కోసం, వేడి నీటిని మరిగించి, అందులో డిటర్జెంట్ , కొద్దిగా ఉప్పు వేయండి. అందులో గాజు పాత్రలను ఒక్కొక్కటిగా ముంచి తరువాత శుభ్రం చేసుకోవాలి. టీవీ స్టాండ్ కూడా శుభ్రం చేయండి. కొంత సాల్ట్ వాటర్‌లో వెనిగర్ వేసి అందులో ఒక క్లాత్ ముంచి శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల మురికిగా ఉన్న టీవీ పెట్టే స్టాండ్ లేదా ప్రాంతం మెరిసిపోతుంది.
డైనింగ్ టేబుల్‌ను శుభ్రపరచడం:
మీరు క్లీనింగ్ స్ప్రేని ఉపయోగించి డైనింగ్ టేబుల్‌ను తుడుచుకోవచ్చు. దీంతో టేబుల్‌పై ఉండే ఆహార పదార్థాల మరకలను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. అంతే కాకుండా నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి టేబుల్‌ను కూడా శుభ్రం చేసుకోవచ్చు.
Also Read: ఇలా చేస్తే.. కాళ్ల పగుళ్లు త్వరగా తగ్గిపోతాయ్
పుస్తకాల ర్యాక్‌ను శుభ్రం చేయండి:
చాలా ఇళ్లలో పుస్తకాలు ఉంచడానికి ప్రత్యేక ర్యాక్ ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒకసారి పుస్తకాలను శుభ్రం చేయడం అవసరం. ప్రతి పుస్తకాన్ని తీసి, దుమ్మును తుడిచి, దాని స్థానంలో తిరిగి ఉంచండి. పుస్తకాల మధ్య కొన్ని వేప ఆకులు లేదా పురుగుల నివారణ మాత్రలు ఉంచడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.