BigTV English
Advertisement

BB Telugu 8 Promo: ‘లక్డి క పూల్’.. రాజకీయం మొదలెట్టిన నబీల్..!

BB Telugu 8 Promo: ‘లక్డి క పూల్’.. రాజకీయం మొదలెట్టిన నబీల్..!

BB 8 Telugu Promo: బిగ్ బాస్.. తెలుగు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తున్న ఈ రియాల్టీ షో ఎనిమిదవ సీజన్ తెలుగులో జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా 65వ రోజుకు సంబంధించి ప్రోమోని విడుదల చేశారు నిర్వాహకులు. అయితే ఇక్కడ ‘లక్డికపూల్’ అనే ఛాలెంజ్ తో కొత్త టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్.. మరి ఈ టాస్క్ లో ఎవరు గెలిచారు..? ఎవరు మెగా చీఫ్ కంటెండర్ షిప్ కి ఎన్నికయ్యారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.


ప్రోమో మొదలవ్వగానే.. మూడు రెడ్ కలర్ బ్రీఫ్ కేస్ లను అక్కడ ఉంచి, ఎవరు తీసుకుంటారు అంటూ ఒక క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అందరూ బ్రీఫ్ కేస్ తీసుకోవాలా? లేదా? అని ఆలోచించగా.. పృథ్వి, రోహిణి , నబీల్ మాత్రం వీటిని తీసుకున్నారు. అయితే గంగవ్వ నబిల్ తో అంత ఆశతో ఉండకూడదు అంటూ కామెంట్ చేయగా దానికి నబీల్ ఏదైతే అది అవ్వని, నేను సిద్ధం అనే తీసుకున్నాను అంటూ కామెంట్ చేశారు.

ఇక తర్వాత బిగ్ బాస్ మాట్లాడుతూ.. బ్రీఫ్ కేస్ తీసుకున్న ముగ్గురిని లేచి నిల్చోమని చెప్పి, ఈరోజు మీరు తీసుకున్న ఈ నిర్ణయం మీకు ఎలాంటి ధైర్యాన్ని ఇచ్చింది అనుకుంటున్నారు అంటూ బిగ్ బాస్ అడగగా రోహిణి మాట్లాడుతూ.. నేను మంచే చేస్తున్నాను. కాబట్టి మంచే జరుగుతుందని తీసుకున్నాను అంటూ కామెంట్ చేసింది. మీరు ముగ్గురు బ్రీఫ్ కేస్ పట్టుకున్న కారణంగా ఈ వారం మెగా చీఫ్ కంటెండర్ షిప్ ని పొందారు అంటూ వారికి శుభవార్త తెలిపారు. కంటెండర్ షిప్ ని పొందినప్పటికీ మీరు కొన్ని చాలెంజ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ తెలిపారు బిగ్ బాస్.


మీ కంటెండర్ షిప్ ని పదిల పరుచుకోవడానికి మీకు ఇస్తున్న మొదటి టాస్క్ లక్డికపూల్ అంటూ తెలిపారు బిగ్ బాస్. చెక్కలతో ఫ్లాట్ ఫార్మ్ ను నిర్మించుకొని దాని పైనుంచి బాల్స్ ని రోల్ చేస్తూ చివర్లో ఉన్న బాస్కెట్ లో వేయడం అంటూ టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్ . ఇక తర్వాత రోహిణి , హరితేజ ఈ టాస్క్ లో పాల్గొనగా మొత్తానికి ఇద్దరు పోటాపోటీగా గేమ్ ఆడి చివరికి హరితేజ గెలిచినట్టు చూపించారు.

ఇక తర్వాత చివర్లో నబీల్, పృథ్వి మాట్లాడుతూ రాజకీయాలు మొదలెట్టినట్టు కనిపించారు. నబీల్ మాట్లాడుతూ.. మనమే ఆడి మనమే గెలిచేటట్టు ఆడాలి అంటూ పృథ్వీ తో తెలిపాడు. అంతేకాదు ఆయన మాట్లాడుతూ. డిజర్వింగ్ , అన్ డిజర్వింగ్ వస్తే కూడా నన్ను సెలెక్ట్ చెయ్.. నేను బయట ఉంటే నిన్ను సెలెక్ట్ చేస్తానంటూ రాజకీయం మొదలుపెట్టాడు. మొత్తానికైతే ఎంటర్టైన్మెంట్ షోని కాస్త రాజకీయంగా మార్చేశారు అంటూ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఇక తాజాగా ఈరోజుకు సంబంధించిన ప్రోమో చాలా వైరల్ గా మారింది. మరి మెగా చీఫ్ కంటెండర్ కోసం పోటీ పడుతున్న వీరి మధ్య ఎటువంటి గొడవలు జరుగుతాయో అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు.

Related News

Bigg Boss 9: ఏడుపుగొట్టు చెత్తను బయటకు తోసేయండి, లైవ్ చూడలేకపోతున్నాం

Bigg Boss 9: ఇన్ సెక్యూరిటీ లోకి పోయి గేమ్ పాడు చేసుకుంటున్నా ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu Day 61 : రీతూ బంగారంరా… తనూజాపై అంత కక్షగట్టేశావ్ ఏంటి దివ్య? నక్కతోక తొక్కిన ఇమ్మూ

Bigg Boss 9 Telugu : ఇమ్మూనా మజాకా? బిగ్ బాస్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రికార్డ్… కానీ ఆ బుర్ర తక్కువ పనే మైనస్ మావా

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Big Stories

×