BigTV English

Jai Hanuman: రానా రాముడిగా మారితే జరిగేది ఇదే… ప్రశాంత్ వర్మ ప్లాన్ బెడిసికొట్టనుందా?

Jai Hanuman: రానా రాముడిగా మారితే జరిగేది ఇదే… ప్రశాంత్ వర్మ ప్లాన్ బెడిసికొట్టనుందా?

Jai Hanuman : ‘హనుమాన్’ మూవీతో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai Hanuman) అనే సీక్వెల్ తో త్వరలోనే ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అయితే తాజాగా ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ మూవీ లో హనుమంతుడిగా నటిస్తున్న రిషబ్ శెట్టి, టాలీవుడ్ స్టార్ హీరో రానాతో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలాగే ప్రస్తుతం ఆ ఫోటో వెనకున్న స్టోరీ కూడా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కానీ అదే కనుక నిజమైతే ప్రశాంత్ వర్మ బలి కావడం ఖాయం అంటున్నారు నెటిజన్లు.


దీపావళి సందర్భంగా ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’ (Jai Hanuman) మూవీ నుంచి సర్ప్రైజ్ పోస్టర్ ను రిలీజ్ చేసి రిషబ్ శెట్టి (Rishabh Shetty) హనుమంతుడి పాత్రను పోషిస్తారని కన్ఫమ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు అయితే పెరిగాయి గానీ ఓ వర్గం ప్రేక్షకులు ప్రశాంత్ వర్మ నిర్ణయం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎందుకంటే అప్పటిదాకా హనుమంతుడు అనగానే ముఖ్యంగా తెలుగు మూవీ లవర్స్ చిరంజీవిని లేదా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఊహించుకున్నారు. ఇలా తెలుగులో ఉన్న పెద్ద పెద్ద స్టార్లు అందరినీ పక్కన పెట్టేసి ప్రశాంత్ వర్మ కన్నడ స్టార్ హీరోతో హనుమంతుడి పాత్రను చేయించడం పై సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు.

కానీ ప్రశాంత్ వర్మ మాత్రం కూల్ గా రిషబ్ శెట్టిని హనుమంతుడు పాత్ర కోసం తీసుకోవడంపై వస్తున్న పాజిటివ్ ను హైలెట్ చేస్తూ అందరికీ థాంక్స్ చెప్పారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma), రానా (Rana Daggubati), రిషబ్ (Rishabh Shetty)తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి మరోసారి సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే జై హనుమాన్ మూవీలో రానా కూడా నటించబోతున్నాడు అనే వార్త సినిమాపై మరింతగా అంచనాలను పెంచింది. ఆయన సినిమాలో భాగమవుతున్నారంటే కచ్చితంగా ఏదో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తారు అని టాక్ నడుస్తోంది. కొన్ని రోజుల క్రితం రానా హనుమంతుడుగా నటిస్తారని రూమర్లు విన్పించాయి.


నిజానికి ‘జై హనుమాన్’ (Jai Hanuman) మూవీ శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి దాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఏం చేశాడు అన్న స్టోరీతో నడుస్తోంది కాబట్టి ఇందులో రానా రాముడిగా నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఒకవేళ అదే జరిగితే మరోసారి ప్రశాంత్ వర్మ ట్రోలింగ్ కు బలి కావడం ఖాయం అంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా రాముడు అనగానే ఇండస్ట్రీలో మహేష్ బాబు లేదా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలను ఊహించుకుంటున్నారు మూవీ లవర్స్. కానీ వాళ్ళిద్దరినీ కాకుండా రానాను రాముడిని చేస్తే కచ్చితంగా మరోసారి ప్రశాంత్ వర్మ నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుందని టాక్ నడుస్తోంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×