Bigg Boss 8 Telugu.. బిగ్ బాస్ 8వ సీజన్లో 10వ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ పూర్తయింది.. ఇప్పుడు ఎలిమినేషన్స్ కి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలోనే ఈవారం హౌస్ లో వీడబోయేది ఎవరో తేలిపోయింది. ప్రతి వారం లాగే ఈవారం కూడా శుక్రవారం తో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక రిజల్ట్ మాత్రమే మిగిలి ఉంది. పదవ వారం నామినేషన్స్ లో భాగంగా గౌతమ్, యష్మి, పృథ్విరాజ్, నిఖిల్, ప్రేరణ, విష్ణు ప్రియ, హరితేజ నామినేషన్స్ లోకి వచ్చారు. ఇప్పటి వరకు పోల్ అయిన ఓట్ల పర్సెంటేజ్ చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వెయ్యక మానదు.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ నుండి ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు హరితేజ. మిగిలిన కంటెస్టెంట్లతో పోల్చుకుంటే తక్కువ ఓట్లు నమోదు కావడం వల్ల ఈమె ఎలిమినేషన్ పక్కా అనే ప్రచారం కూడా జరుగుతోంది. కేవలం ఈమెకు 10% ఓట్లు మాత్రమే నమోదు అయ్యాయని , మొదటి వారంలో ఈమెకు 9 శాతం ఓట్లు పడగా.. శుక్రవారం వచ్చేసరికి కేవలం ఒక్క శాతం మాత్రమే పెరిగింది. అయితే మిగిలిన వారితో పోల్చుకుంటే ఈమె చాలా వెనుక బడిపోవడమే ఈమెకు మైనస్ గా మారింది.
ఇకపోతే 26% ఓట్లతో గౌతమ్ మొదటి స్థానంలో ఉన్నాడు. గతవారం చివరిలో ఉన్న గౌతమ్ పుంజుకొని.. ఇప్పుడు మొదటి స్థానానికి చేరుకున్నాడు. అన్ని ప్రకటించినట్టుగానే ఆయన ఆట తీరు, ఆడియన్స్ నుంచి వస్తున్న ఆదరణ బాగా పెరిగిపోయింది. యష్మి తో గొడవ కూడా గౌతమ్ కి బాగా కలిసి వచ్చింది. ఆమె కుట్రలు గౌతమ్ కి సింపథీ గా మారిపోయాయి. దాంతో అవి కూడా ఓట్లుగా పడుతున్నాయి. దీంతో స్ట్రాంగ్ కంటస్టెంట్ గా ఉన్న నిఖిల్, యష్మిని కూడా దాటి, ఈ వారం టాప్ లో కొనసాగుతున్నారు గౌతమ్. ఇక 20% ఓట్లతో నిఖిల్ రెండవ స్థానంలో ఉండగా.. ఆ తర్వాత స్థానాలలో ప్రేరణ , యష్మీ ఉన్నారు. అదే సమయంలో యష్మీ కొంత డౌన్ అయింది. నామినేషన్ మొదటి రోజు లీస్ట్ లో ఉన్న విష్ణు ప్రియ కూడా పుంజుకుంది. ఈమె ఓటింగ్ శాతం ఒక రకంగా తలకిందులైందని చెప్పవచ్చు ప్రస్తుతం లిస్టులో ఉన్న ఈమె ఐదో స్థానానికి చేరుకుంది. టాప్ ఫోర్ లో ఉన్న పృథ్వీ మాత్రం చివరి నుంచి రెండో స్థానానికి పడిపోయారు. ఇక హరితేజ, పృథ్వీ రాజ్ మధ్య ఒక్క శాతమే తేడా ఉండగా ఫైనల్ రిజల్ట్ లో మార్పు జరిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ పృథ్వి ఈవారం మళ్లీ పుంజుకుంటే హరితేజ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే మరోవైపు ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. హరితేజ పాటు పృథ్వీరాజ్ కూడా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఇందులో ఏది జరుగుతుందో చూడాలి.