BigTV English

Pushpa 2 Tickets : “పుష్ప 2” క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న యాప్… ఇందులో ఆర్డర్ చేస్తే టికెట్ ఫ్రీ

Pushpa 2 Tickets : “పుష్ప 2” క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్న యాప్… ఇందులో ఆర్డర్ చేస్తే టికెట్ ఫ్రీ

Pushpa 2 Tickets : “పుష్ప 2” (Pushpa 2) ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ మూవీ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ని తాజాగా ఓ యాప్ క్యాష్ చేసుకోవడానికి రెడీ అయింది. అందులో భాగంగానే తమ యాప్ లో ఆర్డర్ చేసుకుంటే చాలు “పుష్ప 2” టికెట్స్ ఫ్రీగా ఇస్తామని వెల్లడించింది.


ప్రముఖ ఈ కామర్స్ సంస్థ బ్లింక్ ఇట్ గురించి తెలియని వాళ్ళు ఉండరని చెప్పాలి. ఈ యాప్ లో కిరాణా సామాన్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటీ ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండి, ఫోన్ లో ఒక్క క్లిక్ కొడితే చాలు… మనం ఆర్డర్ చేసిన వస్తువులన్నింటిని వాళ్లే ఇంటికి తీసుకు వచ్చి ఇస్తారు. అయితే తాజాగా ఈ యాప్ తమ వినియోగదారులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న “పుష్ప 2” (Pushpa 2) టికెట్లను ఫ్రీగా ఇవ్వబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు.

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2” (Pushpa 2) డిసెంబర్ 5న థియేటర్లలోకి రాబోతున్న సంగతి తెలిసిందే. మరో 12 రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సందడి ఆల్రెడీ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే టికెట్ల కోసం జనాలు ఎగబడుతున్నారు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే స్టార్ట్ కాగా, ఇండియాలో బుకింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు “పుష్ప 2” (Pushpa 2) సినిమాకి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ని ఇలా వాడుకుంటుంది ఈ కామర్స్ సంస్థ బ్లింక్ ఇట్. తమ వినియోగదారులకు ఫ్రీ టికెట్స్ ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తమ యాప్ లో కిరాణా సామాన్లు కొన్న వాళ్లకు “పుష్ప 2” (Pushpa 2) టికెట్ ఓచర్ ఇవ్వబోతున్నారు. అయితే ఈ ఆఫర్ కు షరతులు వర్తిస్తాయి. రూ. 999 కంటే ఎక్కువ ఆర్డర్ చేస్తేనే ఈ ఆఫర్ వర్తించబోతోంది. బ్లింక్ ఇట్ లో ఈ ఆఫర్ నవంబర్ 23 నుంచి నవంబర్ 29 వరకు అవైలబుల్ గా ఉంటుంది.


ఇదిలా ఉండగా మరోవైపు “పుష్ప 2” (Pushpa 2) మూవీ పోస్ట్ పోన్ కాబోతోంది అనే ప్రచారం జరుగుతుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఒక పాటతో పాటు ఫైట్స్ ని కూడా చిత్రీకరించాల్సి ఉంది. అయితే సినిమా రిలీజ్ కు ఇంకా ఎక్కువ టైం లేకపోవడంతో ఖచ్చితంగా పోస్ట్ ఫోన్ అవుతుందని ప్రచారం జరుగుతుంది. కానీ మరోవైపు మేకర్స్ రిలీజ విషయంలో తగ్గేది లేదు అంటూ రోజుకో పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నారు. ఆ పోస్టర్ల ద్వారా పోస్ట్ పోన్ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి “పుష్ప 2” మూవీ అనుకున్న విధంగా డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందా లేదా పోస్ట్ ఫోన్ అవుతుందా అనేది చూడాలి. ఇప్పటికైతే “పుష్ప 2″ (Pushpa 2) నుంచి రిలీజ్ చేసిన ‘కిస్సిక్” సాంగ్ ప్రోమో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీలీల అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులు వేయనుంది.

Tags

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×