BigTV English

BB Telugu 8 – Gangavva : గంగవ్వ స్టేజ్ పైకి ఎందుకు వెళ్లలేదు… గంగవ్వ ఏం చెప్పిందంటే..

BB Telugu 8 – Gangavva : గంగవ్వ స్టేజ్ పైకి ఎందుకు వెళ్లలేదు… గంగవ్వ ఏం చెప్పిందంటే..

BB Telugu 8 – Gangavva: బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss) తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇటీవలే 8వ సీజన్ ప్రారంభం అవ్వగా ఫ్యామిలీ వీక్ కూడా పూర్తి అయింది. మరో నెల రోజుల్లో ఎనిమిదవ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో షో ప్రారంభం అవ్వగా.. ఆ తర్వాత 6వ వారం అనూహ్యంగా 8 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి వచ్చారు. అందులోనూ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ మాజీ కంటెస్టెంట్స్ అందరూ కూడా గత సీజన్లలో బాగా పెర్ఫార్మ్ చేసి టాప్ వరకు వెళ్లి ఎలిమినేట్ అయిన వారే కావడం గమనార్హం.


సీజన్ 8లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ..

ఇక అలాంటి వారిలో గంగవ్వ(Gangavva )కూడా ఒకరు. సీజన్ -4 లో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె, దాదాపు 5 వారాలు హౌస్ లోనే ఉన్నారు. కానీ ఆరోగ్యం సహకరించక పోవడం తో హోస్ట్ నాగార్జున (Nagarjuna) ను రిక్వెస్ట్ చేసుకుని మరీ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు గంగవ్వ. అయితే మళ్లీ సీజన్ 8 కి పిలుపు రావడంతో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ద్వారా చివర్లో అడుగుపెట్టింది. హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి వారమే అవినాష్(Avinash ) తో పోటీపడి మరీ గెలుపొందింది.


తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్న గంగవ్వ..

ఆ తర్వాత ఫ్రాంక్ చేసి కంటెస్టెంట్స్ అందరినీ ఒక్కసారిగా భయపెట్టింది గంగవ్వ. అయితే అనూహ్యంగా పదవ వారం బయటకు వచ్చేసింది. దీంతో మళ్లీ గంగవ్వకు ఆరోగ్యం సహకరించడం లేదని, అందుకే హౌస్ నుంచి బయటకు వచ్చిందని వార్తలు వినిపించాయి. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చింది సరే మరి స్టేజ్ పైకి ఎందుకు రాలేదు అంటూ నెటిజన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో గంగవ్వ అసలు విషయాన్ని బయటపెట్టింది.

బిగ్ బాస్ నుంచి బయటకు పంపించారా..

పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో గంగవ్వ మాట్లాడుతూ.. ” బిగ్ బాస్ నుండీ మళ్ళీ అవకాశం రావడంతో హౌస్ లోకి వెళ్ళాను.అందరూ నన్ను బాగా చూసుకున్నారు. అయితే గత సీజన్ -4 లో ఫుడ్ బాగుండేది. కానీ సీజన్ 8 లో ఫుడ్ బాగాలేదు. వారానికి సరిపడా ఫుడ్డు ఒకేసారి చేసుకోవాలి. మూడు వారాలు బాగానే గడిచింది. దసరా పండుగ, బతుకమ్మ వేడుకలు చాలా బాగా చేసుకున్నాము. మంగ్లీ వచ్చి ఆడి పాడి వెళ్ళిపోయింది. ఇక దీపావళి పండుగకు ముందు అటుకులతో చేసిన పోహ పెట్టారు. వయసు మీద పడడం వల్ల పోహ తినడంతో నాకు జీర్ణం కాలేదు. దాంతో మోషన్స్ మొదలయ్యాయి. అవినాష్ కి చెప్తే సెట్ అవుతుందిలే అవ్వ అన్నాడు. ఇక్కడ నాలుగైదు రోజుల పోతే అంతా సెట్ అవుతుందని అనుకున్నాను. కానీ సడన్ గా హౌస్ నుంచి బయటకు రమ్మన్నారు.

నిజాలు బయటపెట్టిన గంగవ్వ..

వాస్తవానికి నాకు హౌస్ నుంచి బయటకు రావాలని లేదు. ఆ రోజు ఫుడ్ బాగోలేదు. ఒకవేళ అడిగి ఉంటే ఆ చిన్న సమస్య కాస్త సెట్ అయ్యేది. మరో నాలుగు రోజులు ఉండి ఉంటే.. అంత నార్మల్ స్థితికి వచ్చేది. దీంతో మరో మూడు ,నాలుగు వారాలు ఉండాలి అనుకున్నాను. కానీ నాగార్జున కన్ఫెషన్ రూమ్ కి పిలిపించి, బయటకి రమ్మని చెప్పారు. దీంతో నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ఇక నాతోపాటు హౌస్మెట్స్ అందరూ కూడా షాక్ అయి ఏడవడం మొదలుపెట్టారు. నిజానికి నాకు బయటకు రావడం ఇష్టం లేదు. కానీ వారే నన్ను బయటకు పంపించారు. అందుకే నన్ను స్టేజ్ పైకి తీసుకురాలేదు” అంటూ అసలు నిజాన్ని బయటపెట్టింది గంగవ్వ.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×