BB Telugu 8:సాధారణంగా బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ జంటలు ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి కూడా బిగ్ బాస్ సీజన్ 8లో ఒక ప్రేమ జంట అందరిని అలరిస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే ఇది వన్ సైడ్ లవ్ మాత్రమే. విష్ణు ప్రియ.. పృథ్వీ ను ఎంతగా ఇష్టపడుతోంది అందరికీ తెలుసు.. అయితే పృథ్వీ మాత్రం విష్ణుప్రియను కన్నెత్తి కూడా చూడడం లేదు. కానీ ఆమె మాత్రం హౌస్ మేట్స్ అందర్నీ కాదనుకొని , పృథ్వీ కోసం ఏవేవో చేసేస్తోంది. అయితే ఇప్పుడు చేసిన పని ఏకంగా హౌస్ మేట్స్ అందరిలో వ్యతిరేకతను కలిగించేలా చేసింది. మరి పృథ్వీ కోసం విష్ణు ప్రియ ఏం చేసిందో ఇప్పుడు చూద్దాం.
తాజాగా “కీ పట్టు కంటైనర్ షిప్ కొట్టు” అనే టాస్క్ ఇచ్చారు. బిగ్ బాస్ టాస్క్ లో పాల్గొనడానికి ముందుగా పృథ్వి విష్ణు ప్రియ ఇద్దరు వచ్చారు. టాస్క్ లో భాగంగా ముందు తాళం వేసి ఉన్న మూడు పెద్ద బాక్స్లను ఉంచుతారు.. ఆ బాక్స్ తాళం చెవిలను మాత్రమే వేరే దగ్గర దాస్తారు. అయితే ఒక్కోచోట ఒక్కో కీ పెడతారు. మొదటి కీ ఒక గోడలో , రెండవ కీ కుండలో, మూడవ కీ ఇసుకలో దాచిపెడతారు. అయితే టాస్క్ మొదట్లో విష్ణు బాగానే ఆడినప్పటికీ.. పృథ్వీ గెలుపొందుతాడు. టాస్క్ అయిపోయిన తర్వాత రోహిణి, తేజ ఇద్దరూ కూడా విష్ణుతో మాట్లాడుతూ.. నువ్వు పృథ్వీ కింద పడేసిన తాళం తీసుకొచ్చావా..? అందుకే మనం గేమ్ గెలవలేదు. నువ్వు పృథ్వీ గెలవాలని చేసావా..? లేక కావాలనే ఇలా చేసావా..? అని అంటారు. ఒకవేళ ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉన్నా కూడా అలాగే చేసే దానివా అంటూ రోహిణి విష్ణు తో అడుగుతుంది. విష్ణుప్రియ పృథ్వీ కోసం త్యాగం చేసింది అంటూ మిగతా హౌస్ మేట్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. ఏది ఏమైనా విష్ణు ప్రియ, పృథ్వి కోసం అంత చేస్తున్నా.. పృథ్వీ మాత్రం ఆమెను పట్టించుకోకపోవడం అభిమానులలో ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభం అవ్వగా.. మరోవైపు 8 మంది వైల్డ్ కార్డు ఎంట్రీస్ గా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే 9 వారాలకు గానూ దాదాపు పది మంది ఎలిమినేట్ అయ్యారు. మరొకవైపు ఎవరికి వారు టైటిల్ గెలవడం కోసం బాగానే కుస్తీ పడుతున్నారు. ఇక టైటిల్ ఫేవర్ గా పృథ్వీ , నిఖిల్, యష్మీ , నబీల్ , ప్రేరణ, హరితేజ పోటీ పడుతుండగా.. వీరిలో ఎవరు టైటిల్ గెలుస్తారు అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ప్రేమికుడిని గెలిపించడం కోసం టీం ని ఓడించడంతో విష్ణు ప్రియ ఇప్పుడు హౌస్ మేట్స్ నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటుంది అని చెప్పవచ్చు.