BigTV English

Elon Musk – Donald Trump : ట్రంప్ – ఎలాన్ మస్క్.. వీరి స్నేహం వెనుక ఓ స్టోరీ..

Elon Musk – Donald Trump : ట్రంప్ – ఎలాన్ మస్క్.. వీరి స్నేహం వెనుక ఓ స్టోరీ..

 Elon Musk – Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం తర్వాత డోనాల్డ్ ట్రంప్ ప్రస్తావించి అతికొద్ది మంది మద్ధతుదారుల్లో ప్రపంచ కుబేరుడు, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఒకరు. తనకు చాలా ఇష్టమైన వ్యక్తి, తన కోసం చాలా కష్టపడ్డారని ట్రంప్ ప్రశంసించడంతో.. అసలు వారిద్దరి మధ్య స్నేహం ఎప్పటి నుంచి మొదలైంది.? ఎప్పటి నుంచి వారు కలిసి పనిచేస్తున్నారు.? వంటి అనేక విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి.


డోనాల్డ్ ట్రంప్.. రియల్ ఎస్టేట్ మొగల్ గా అమెరికాలో మంచి గుర్తింపు పొందారు. సాంకేతిక, ఆటోమొబైల్ రంగాల్లో ఎలాన్ మస్క్ కు తిరుగులేని పేరుంది. వీరిద్దరూ.. వ్యాపార రంగాల్లో మంచి గుర్తింపు సాధించినవారే. ఇద్దరూ భిన్నమైన రంగాలకు చెందిన వ్యక్తులు.. అలాంటి వాళ్లు రాజకీయ వేదికపై ఒక్కటయ్యారు. తాను అధ్యక్షుడిని అయితేనే అమెరికాకు మంచిది అని ట్రంప్ అంటే… అవును ట్రంప్ నకు మించిన జాతీయ భావాలున్న నాయకుడు లేడు.. అంటూ ఎలాన్ మస్క్ వంత పాడారు. తీరికలేని బిజీ సమయంలోనూ.. ట్రంప్ నకు మద్ధతుగా ఎలాన్ మస్క్ వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తన ట్విట్టర్ (ఎక్స్) ద్వారా అనేక సార్లు దేశ ప్రజలు ట్రంప్ కు మద్ధతు ఇవ్వాలని సందేశాలు ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ట్రంప్ అవసరం ఏంటో చెబుతూ.. అనేక ట్వీట్లు చేశారు. ఇంతలా.. రాజకీయాల గురించి ఓ పారిశ్రామికవేత్త పట్టించుకోవడం, సపోర్టుగా నేరుగా మాట్లాడడం చాలా మందికి ఆశ్చర్యంగా మారింది.

2020లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఆయన మద్ధతుదారులు ఆమెరికాలో అల్లర్లకు పాల్పడ్డారు. వివిధ ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ సమయంలోనే ట్విట్టర్ వేదికగా.. ట్రంప్ అనేక పోస్టులు చేశారు. దాంతో.. ఆయన సంస్థ నిబంధనల్ని పాటించడం లేదంటూ.. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్ ను బ్యాన్ చేసింది. దాంతో.. అంతర్జాతీయంగా ఆ అంశం ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ఓ దేశాధ్యక్షుడి సామాజిక మాధ్యమ ఖాతాను.. ఉద్రిక్తతలు రెచ్చగొడుతున్నారని బ్యాన్ చేయడం సంచలనంగా మారింది. సరిగా.. అప్పుడే ట్విట్టర్ తీరును ట్రంప్ తో సహా.. కొంత మంది తప్పుబట్టగా.. అందులో ఎలాన్ మస్క్ ఒకరు.


డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య సన్నిహిత పెరగడానికి ట్విట్టర్ అంశమే ప్రధాన కారణమైంది. 2022లో.. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్.. దానిని ఎక్స్ (X)గా మార్చడంతో పాటు ట్రంప్ ఖాతాపై ఉన్న నిషేధాన్ని తొలగించారు. ట్రంప్ ఖాతాపై బ్యాన్ తీసేయాలా.? వద్దా.? అంటూ పోల్ నిర్వహించాడు. అందులో 51.8% మంది నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుకున్నారంటూ ప్రకటించి.. ట్రంప్ కు తోడుగా నిలిచారు.

తనకు జాతీయ వాదమే ముఖ్యమని, అమెరికా ఫస్ట్ అగైన్.. అంటూ ప్రచారం చేసిన ట్రంప్.. అందుకు తగ్గట్టే అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చాడు. అక్కడి పెట్టుబడిదారులకు విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా స్పందించిన ట్రంప్.. ఎదుటి వారిపై ఒత్తిడి తెచ్చి మరీ అమెరికన్ వ్యాపారవేత్తలకు అనుకూలంగా ఆయా దేశాలు నిర్ణయాలు తీసుకునేలా చేశాడు. ఒకానొక దశలో మిత్ర దేశమైన భారత్ పైనా ట్రంప్ విరుచుకుపడ్డాడు. భారత్.. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ఇతర కొన్ని వస్తువులపై భారీగా పన్నులు వసూలు చేస్తుందని ఆగ్రహించారు. ప్రతీకారంగా.. భారత్ ఎగుమతి చేసే ఉత్పత్తుల పైనా దిగుమతి సుంకాల్ని విధించాడు. ఇలా.. అనేక రకాలుగా పారిశ్రామిక, వ్యాపారవేత్తల ప్రయోజనాల్ని ట్రంప్ సమర్థవంతంగా కాపాడాడు అనే అభిప్రాయం అక్కడి వర్గాల్లో ఉంది. ఈ కారణంగానే ఎలాన్ మస్క్ ఈ స్థాయిలో ట్రంప్ నకు మద్ధతు ఇచ్చాడన్నది చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

అలాగే.. ట్రంప్ గెలుపునకు ఎలాన్ మస్క్ ఏకంగా 75 మిలియన్ డాలర్లను పొలిటికల్ యాక్షన్ కమిటీకి విరాళంగా అందించాడు. ట్రంప్ తో కలిసి ఇంటర్వ్యూలు కూడా చేసిన ఎలాన్ మస్క్.. కొన్ని ప్రచార ర్యాలీల్లోనూ పాల్గొని అమెరికన్లు ట్రంప్ నకు సపోర్టు చేయాల్సిందిగా కోరాడు. ఇలా.. బయటి నుంచి మద్ధతుగా నిలవడం దగ్గర మొదలైన వీరి స్నేహం.. క్రమంగా తాను గెలిస్తే, ఎలాన్ మస్క్ కి తన క్యాబినెట్ లో స్థానం లేదా, అడ్వైజరీ పోస్ట్‌ను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాననే స్థాయికి వెళ్లింది. ట్రంప్ ప్రతిపాదనకు ఎలాన్ మస్క్ సైతం అంగీకారం తెలపడంతో వీరి స్నేహం మరింత బలపడింది.

Also Read : ట్రంప్ గెలుపు రహస్యం ఆమే.. తను లేకపోతే గెలవడం కష్టమయ్యేంది..

ట్రంప్ నతో కలిసి ప్రచారం చేసిన ఎలాన్.. స్వింగ్ స్టేట్స్‌లో గెలుపొందేందుకు భారీగా నిధులు చేకూర్చాడు. అలాగే.. తన అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ ను ట్రంప్ నకు అనుకూలంగా వాడారనే ఆరోపణలు ఎలాన్ మస్క్ మీద ఉన్నాయి. రిపబ్లిక్ పార్టీ గురించి నెగిటివిటీ ని పెంచే పోస్టులకు, ట్రంప్ నకు అనుకూలంగా ఉన్న పోస్టులకు మిలియన్ల కొద్దీ వ్యూస్ ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. ఏదిఏమైనా.. తాను మద్ధతుగా నిలవాలి అనుకున్న వ్యక్తికి అన్ని రకాలుగా సాయంగా నిలిచిన మస్క్.. స్నేహితుడిని గెలుపు తీరాలకు చేర్చడంలో సక్సెస్ సాధించారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×