Nithiin: టాలీవుడ్ లో అదిరిపోయే స్టెప్పులు వేసే టాలెంట్ ఉన్న నటుల్లో నితిన్ (Nithiin) కూడా ఒకరు. అలా డాన్స్ తోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో తాజాగా మరో లేడీ డ్యాన్సింగ్ సూపర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi)తో కలిసి స్టెప్పులెయ్యాలంటూ ‘అమరన్’ (Amaran) మూవీ సక్సెస్ మీట్ వేదికపై తన మనసులోని మాటను బయట పెట్టారు.
కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా నటించిన తాజా మూవీ ‘అమరన్’ (Amaran). ఆర్మీ మేజర్ ముకుంద వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజ్ కి ముందే ఈ మూవీ కి మంచి బజ్ బజ్ క్రియేట్ కాగా, థియేటర్లలోకి వచ్చాక అంచనాలను అందుకొని, బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో బాగానే రాణిస్తోంది. మొదటి రోజే ఈ సినిమా వసుళ్లపరంగా శివ కార్తికేయన్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ నమోదు చేసింది. రిలీజ్ అయిన ఆరు రోజుల్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరడం మరో విశేషం. ఫస్ట్ డే 21 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన ‘అమరన్’ మూవీ 6 రోజుల్లో ఏకంగా రూ. 102 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.
ఈ నేపథ్యంలోనే ‘అమరన్’ (Amaran) మూవీ సక్సెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్లో నిర్వహించారు. అయితే ఈవెంట్ కు టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై నితిన్ మాట్లాడుతూ ‘అమరన్’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమాకు హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) బ్యాక్ బోన్ అంటూ కొనియాడిన నితిన్, సాయి పల్లవి డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, ఏదో ఒక రోజు ఆమెతో కలిసి డాన్స్ చేయాలని ఉందనే కోరికను ‘అమరన్’ సక్సెస్ మీట్ వేదికపై బయట పెట్టారు. త్వరలోనే ఆరోజు రావాలని కోరుకుంటున్నాను అంటూ నితిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఆ తర్వాత శివ కార్తికేయన్ గురించి ప్రస్తావిస్తూ… శివ కార్తికేయన్ (Siva Karthikeyan) తో తనకు ప్రత్యేక అనుబంధముందని నితిన్ వెల్లడించారు. గత నాలుగేళ్లుగా హైదరాబాదులో ఉన్నప్పటికీ ఇద్దరూ కలవడానికి కుదరలేదని, చాలా రోజుల తర్వాత ఇలా ‘అమరన్’ (Amaran) మూవీ సక్సెస్ మీట్ లో కలవడం సంతోషంగా ఉందంటూ చెప్పుకొచ్చారు. అలాగే ‘అమరన్’ మూవీకి శివ కార్తికేయన్ చాలా కష్టపడ్డారని వెల్లడించిన నితిన్ (Nithiin) ‘ఇక నుంచి ఆయన మా తెలుగు హీరో.. మా తెలుగు అబ్బాయి అయిపోయాడు’ అంటూ శివ కార్తికేయన్ ను ఆకాశానికి ఎత్తేసారు. అయితే నితిన్, సాయి పల్లవి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుంది? వీరిద్దరి కాంబోలో వచ్చే సినిమాలో అదిరిపోయే స్టెప్పులు చూసే అదృష్టం ప్రేక్షకులకు ఎప్పుడు కలుగుతుంది ? అనేది చూడాలి. ప్రస్తుతం నితిన్ ‘రాబిన్ హుడ్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.