BigTV English

BB Telugu 8 Promo: ‘ఆటోలో ప్రయాణం’.. టాస్క్ కాదు పర్సనల్ ఎటాక్..!

BB Telugu 8 Promo: ‘ఆటోలో ప్రయాణం’.. టాస్క్ కాదు పర్సనల్ ఎటాక్..!

BB Telugu 8 Promo:ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ (Bigg Boss)ఎనిమిదవ సీజన్ చివరి దశకు చేరుకోనుంది. మరో రెండు మూడు వారాలు గడిస్తే పూర్తి కాబోతుంది. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ మధ్య ఆఖరి మెగా చీఫ్ అవ్వడానికి పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఆఖరికి క్యారెక్టర్స్ ని కూడా బ్యాడ్ చేసుకుంటూ కంటెస్టెంట్స్ చేసుకున్న కామెంట్స్ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది షో మాత్రమే ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత వీరి పరిస్థితి ఏంటి..? అంటూ నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే 11వ వారం ఫ్యామిలీ వీక్ అంటూ గడిచిపోయింది. ఇక 12వ వారం కూడా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఆఖరి మెగా చీఫ్ కంటెండర్ అవ్వడానికి కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. అందులో భాగంగానే తాజాగా ‘ఆటోలో ప్రయాణం’ అంటూ ఒక టాస్క్ నిర్వహించారు బిగ్ బాస్.


తాజాగా 82వ రోజుకు సంబంధించి ప్రోమోని విడుదల చేయగా.. ఇక ఆ ప్రోమోలో.. మెగా చీఫ్ అవ్వడానికి బిగ్ బాస్ ఇస్తున్న తదుపరి టాస్క్ ‘ఆటోలో ప్రయాణం’.ఈ టాస్క్ లో ఆఖరి వరకూ ఎవరైతే ప్రయాణం చేస్తారో.. వారే మెగా చీఫ్ అవ్వడానికి అర్హులు అంటూ బిగ్ బాస్ గార్డెన్ ఏరియా లోకి ఒక ఆటోను తీసుకొచ్చి పెట్టి, టాస్క్ నిర్వహించారు. టాస్క్ ప్రారంభం అవగానే విష్ణు ప్రియ, రోహిణి, యష్మీ, టేస్టీ తేజ, పృథ్వీ ఈ టాస్క్ లో పాల్గొన్నారు. ఇక టాస్క్ ప్రారంభం అవ్వగానే.. కంటెస్టెంట్స్ అందరూ పోటీపడి మరీ ఆటోలోకి ఎక్కారు. విష్ణు ప్రియా.. రోహిణినీ తోసెయ్ అంటూ గట్టిగా అరుస్తూ.. రోహిణి ను తోసే ప్రయత్నం చేశారు. కానీ ఆ తోపులాటలో చివరికి టేస్టీ తేజ ఆటో నుండి బయటకు వచ్చారు.

ఆ తర్వాత రోహిణిని బయటకు తోసే ప్రయత్నం చేయగా.. ఆమె బయటకు వచ్చేసింది. పృథ్వీ, యష్మీ, విష్ణు ప్రియ మిగలగా.. “మీ ముగ్గురిలో ఎవరు ఎవరిని తోసుకుంటారో నేను చూస్తాను” అంటూ ఫైర్ అయ్యింది రోహిణి. ఆ తర్వాత యష్మీ ని తోసేశారు. ఇక దాంతో యష్మి ఏడుస్తూ.. “నేను నిన్ను తోయకుండా.. నీకు సపోర్ట్ చేశాను.”అంటూ యష్మీ చెప్పగా.. పృథ్వీ.. “ఎమోషనల్ అవ్వకు.. ఇది గేమ్” అంటూ కామెంట్ చేశారు. “ఆడండి గేమ్.. నన్నెలా పుష్ చేసావ్ బయటకి.. అలాగే పుష్ చేసి పాయింట్ తీసుకో.. మొత్తం చూడాలి మీ గేమ్” అంటూ తనకు అన్యాయం జరిగిందని ఏడ్చేసింది యష్మీ.


మధ్యలో రోహిణి కలుగజేసుకొని.. వాళ్ళిద్దరూ ఎందుకు ఆడతారు అంటూ కామెంట్ చేయగా.. విష్ణు ప్రియ ఫైర్ అయ్యింది. “ఎందుకు మా గురించి మాట్లాడుతున్నావ్ .. ఫస్ట్ నీది నువ్వు చూసుకో” అంటూ అరిచేసింది విష్ణు ప్రియ. “ఏం చేశాను నేను” అంటూ రోహిణి అడగగా.. నీ “క్యారెక్టర్ ఏంటో నువ్వు చూసుకో” అంటూ విష్ణు ప్రియ నోరు జారింది. దీంతో రెచ్చిపోయిన రోహిణి కూడా విష్ణు ప్రియ బండారం బయటపెట్టింది.” మొదట నిఖిల్ కి ట్రై చేశానని చెప్పావు.. ఆ తర్వాత పడలేదని పృథ్వీ ను ట్రై చేసావ్” అంటూ అసలు నిజాన్ని బయటపెట్టింది రోహిణి. అలా మొత్తానికైతే ఇద్దరు కూడా క్యారెక్టర్ లను బ్యాడ్ చేసుకోవడం నెటిజన్స్ కి ఆగ్రహాన్ని తెప్పిస్తోందని చెప్పవచ్చు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×