Keerthi Suresh : పెళ్లి.. మూడు ముళ్ళు.. ఏడు అడుగులు.. రెండు హృదయాల కలయిక.. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది కీలక ఘట్టం. పెళ్లి తర్వాతే అప్పటి వరకు ఉన్న వ్యక్తుల జీవితాలు ఒక్కసారిగా మారిపోతాయి. అటు అబ్బాయిలైనా సరే.. ఇటు అమ్మాయిలు అయినా సరే.. కొత్త బాధ్యతలు, కొత్త ఆలోచనలు.. కొత్త పనులు.. అయితే ఇవన్నింటిని ఫేస్ చేయడానికి కొంతమంది సిద్ధమైతే,మరికొంతమంది వెనుకడుగు వేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్స్ వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి వారిలో మహానటి కీర్తి సురేష్ (Keerthi Suresh)కూడా ఒకరు. గత కొన్ని రోజులుగా పెళ్లి పీటలు ఎక్కబోతోందంటూ వార్తలు వినిపించినా.. దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఆమె తండ్రి స్పందించినట్లు సమాచారం.
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ఆరంభం..
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత ‘నేను శైలజ’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత ‘నేను లోకల్’, ‘మహానటి’, ‘అజ్ఞాతవాసి, ‘దసరా’,’మిస్ ఇండియా’ వంటి సినిమాలలో నటించింది.ఇలా అన్ని సినిమాలు కూడా ఈమెకు మంచి విజయాన్ని అందించాయి. ముఖ్యంగా ఇందులో ‘మహానటి ‘ సినిమా ఏకంగా జాతీయస్థాయి అవార్డు అందివ్వగా..’దసరా’ సినిమా ఫిలింఫేర్ అవార్డును అందించింది. ఇక మహేష్ బాబు (Mahesh Babu)తో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించి తొలిసారి గ్లామర్ డోస్ పెంచి అందరిని ఆకట్టుకుంది.
డెస్టినేషన్ మ్యారేజ్ కి సిద్ధమైన కీర్తి సురేష్..
ఇకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది కీర్తి సురేష్. ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా తాజాగా వచ్చే నెలలో తన బాయ్ ఫ్రెండ్ అయినా ఆంటోనీ తో గోవాలో ఏడడుగులు వేయబోతోంది అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కీర్తి సురేష్ కానీ ,ఆమె కుటుంబ సభ్యులు కానీ ఎవరూ స్పందించకపోవడంతో రూమర్స్ అని అందరూ అనుకున్నారు. కానీ తాజాగా ప్రముఖ నిర్మాత కీర్తి సురేష్ తండ్రి స్పందించారు.
పెళ్లిపై కీర్తి సురేష్ తండ్రి క్లారిటీ..
ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న జి. సురేష్ కుమార్ (G.Suresh Kumar)ఎవరో కాదు కీర్తి సురేష్ తండ్రి. ఇక ఈయన తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ.. గోవాలోని ఒక పెద్ద రిసార్ట్ లో ఆంటోనీ తటిల్ , కీర్తి సురేష్ వివాహం జరగబోతోంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఇక తండ్రి ఇచ్చిన క్లారిటీతో కీర్తి సురేష్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే ఈ బ్యూటీ పెళ్లి పీటలు ఎక్కబోతోందని తెలిసి అభిమానులు ఇప్పటినుంచే సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక వీరు డిసెంబర్ 11 లేదా 12వ తేదీన వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ విషయం తెలిసి నెటిజన్స్ కూడా కీర్తి – ఆంటోనీ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.