BigTV English

BB Telugu 8 Promo: కంటెస్టెంట్స్ కోసం బరిలోకి దిగిన సెలబ్రిటీస్.. ఆ ఒక్కరి కోసం ఏకంగా స్టార్ డైరెక్టర్..!

BB Telugu 8 Promo: కంటెస్టెంట్స్ కోసం బరిలోకి దిగిన సెలబ్రిటీస్.. ఆ ఒక్కరి కోసం ఏకంగా స్టార్ డైరెక్టర్..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి బిగ్ బాస్ 8వ సీజన్ సెప్టెంబర్ ఒకటవ తేదీన చాలా గ్రాండ్గా ప్రారంభం అయింది. అయితే ఇప్పుడు ఈ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. 11వ వారంలో భాగంగా ఫ్యామిలీ వీక్ తో తెగ సందడి చేశారు కంటెస్టెంట్స్. వీకెండ్స్ అంటేనే మస్తీ మజా అన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ వీకెండ్స్ లో కంటెస్టెంట్స్ వారాంతంలో చేసే తప్పులను సరిదిద్దుతూ.. బాగా ఆడిన వారిని ఇంకా ఎంకరేజ్ చేస్తూ.. షోని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు హోస్ట్ నాగార్జున. అయితే ఈసారి కూడా ఎప్పటిలాగే హౌస్ లో ఫుల్ ఫన్ మొదలయింది. ఇక నిన్నటి ఎపిసోడ్లో కొంతమంది సెలబ్రిటీలు కంటెస్టెంట్స్ కోసం హౌస్ లోకి వచ్చి టైటిల్ గెలవాలి అని కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.


ఇక ఆదివారం ఎపిసోడ్ కి సంబంధించి మరికొంతమంది సెలబ్రిటీలు.. మిగతా కంటెస్టెంట్స్ కోసం హౌస్ లోకి అడుగుపెట్టారు. అంతే కాదు ఇక్కడ స్టార్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న కోనా వెంకట్ (Kona Venkat)కూడా హౌస్ లోకి అడుగుపెట్టడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ముక్కు అవినాష్ కోసం కోనా వెంకట్ బరిలోకి దిగడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. మరి తాజాగా వదిలిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన దేవర సినిమాలో.. “చుట్టమల్లే చుట్టేస్తావే” అనే పాటతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఇక ప్రోమో ప్రారంభం అవ్వగానే.. యష్మీ కోసం శ్రీ సత్య (Sri Satya)స్టేజ్ పైకి వచ్చింది. శ్రీ సత్య.. యష్మి గురించి మాట్లాడుతూ.. “ప్రతిరోజు సాయంత్రం 6 తర్వాత యష్మీ ఏం చేస్తుంది..? అనే విషయం గురించి మీకు తెలియదు సార్” అంటూ.. కామెంట్ చేసింది . ఇక తర్వాత “ఏ బ్రాండ్ వాడతారమ్మ” అంటూ అడిగారు నాగార్జున. ఇక అలాగే పాత యష్మీ కావాలి అని ,టైటిల్ కోసం గట్టిగా పోరాడు అని శ్రీ సత్య చెప్పింది.


డైరెక్టర్ కోన వెంకట్ స్టేజ్ పైకి రాగానే.. ఎగిరి గంతేశారు ముక్కు అవినాష్.. సార్ కోనా వెంకట్ గారు బిగ్ బాస్ షో కి పెద్ద ఫ్యాన్ అంటూ తెలిపారు. కోన వెంకట్ మాట్లాడుతూ..” ఈ షో ద్వారా నాకు ఎంతోమంది టాలెంటెడ్ వ్యక్తులు దొరికారు” అంటూ నాగార్జునతో తెలిపారు. ఇక అలాగే ఇక్కడ ఉండే ఒక్కొక్క కంటెస్టెంట్ కి మీ ఫిలిమ్స్ లో ఒక్కొక్క పేరు పెట్టండి అని అడిగారు నాగార్జున. వెంకట్ మాట్లాడుతూ.. నా దగ్గర 50ఫిల్మ్స్ ఉన్నాయి. వాటిలో పేర్లు పెడతాను అని అడగ్గా.. సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకుంటున్నారా? అంటూ తెలిపారు. నాగార్జున. తర్వాత టేస్టీ తేజ తండ్రి కూడా హౌస్ లోకి అడుగుపెట్టారు. సన్నీ తో పాటు గత సీజన్ రన్నర్ అమర్దీప్ కూడా హౌస్ లోకి వచ్చారు. ఇక అమర్దీప్ నిఖిల్ తో కప్పు కొట్టే బయటికి రా అంటూ కామెంట్లు చేశారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×