Priyanka Jain: పవిత్రమైన తిరుమల అలిపిరి నడక మార్గంలో పిచ్చి పిచ్చి రీల్స్ చేస్తున్నారు కొందరు. భక్తుల మనోభావాలకు విలువ లేకుండా రీల్స్ చేశారు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక,ఆమె బాయ్ ఫ్రెండ్. భక్తితో వెళ్లాల్సిన చోట భక్తుల్లో భయాన్ని రేకెత్తించే ప్రాంక్ వీడియో చేసి అరాచకం చేశారు.
చిరుత సంచరించే మార్గం ఏడో మైలురాయి నుంచి లక్ష్మీనరసింహస్వామి ఆలయం మధ్యలో రీల్స్ చేశారు. చిరుత గాండ్రింపును రీల్స్‌లో యాడ్ చేసి చిరుత వచ్చిందంటూ పరుగులు తీశారు. తీరా చిరుత లేదు ఏం లేదు తూచ్ అంటూ ప్రాంక్ అన్నారు ప్రియాంక.
దీనిపై సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. ఇలాంటి వ్యవహారాలు తిరుమల నడకదారిలో పెట్టుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి పైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన భక్తులు గతంలో ఇదేవిధంగా క్యూలైన్లో ప్రాంక్ చేయడంతో వారి పైన కేసులు నమోదు చేసింది టీటీడీ. వీరిపై కూడా టీటీడీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలంటున్నారు భక్తులు.
Also Read: కాపాడండి అంటూ హైకోర్టుకెక్కిన వర్మ… నేడే విచారణ
ఘటనపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. పవిత్రమైన తిరుమల కొండపై పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే క్రిమినల్ చర్యలకు వెనకాడబోమని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.గతంలో దువ్వాడ, అంబటి కూడా రీల్స్ చేశారని బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి గుర్తు చేశారు.ప్రియాంకపై ఇవాళే కేసు పెడతామని చెప్పారు.
వ్యూస్ కోసం భక్తుల మనోభావాలతో ఆడుకుంటారా అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో చిరుత దాడిలో ఓ చిన్నారి చనిపోయిన విషయాన్ని మర్చిపోయి.. ఇప్పుడు చిరుత దాడి అంటూ ప్రాంక్ వీడియో చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంకపై మండిపడ్డ భాను ప్రకాష్ రెడ్డి.. మరొకరు ఇలా చేయాలన్న ఆలోచనే రాకుండా ఆమెపై చర్యలుంటాయని గట్టి వార్నింగ్ ఇచ్చారు.