BB Telugu 8:బిగ్ బాస్ గత సీజన్ 7 ఉల్టా ఫుల్టా అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ను అందుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ తెలుగు చరిత్రలో మునిపెన్నడు చూడని సరికొత్త టాస్క్ లతో ప్రేక్షకులను అలరించారు. ఇక అదే జోష్ తో బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయింది.. ప్రస్తుతం11వ వారానికి చేరుకుంది. 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ షో వారినే కొనసాగించి ఉంటే. పెద్దగా టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకునేది కాదు. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డు ద్వారా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకొచ్చారో.. అప్పటి నుంచి టిఆర్పి రేటింగ్ అమాంతం పెరిగిపోయింది.
దీనికి తోడు కన్నడ బ్యాచ్ చేసే ఆగడాలను గౌతమ్ బట్టబయలు చేశారు. సీజన్ 7 లో 13 వారాలు పాటు కొనసాగి.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకున్న గౌతమ్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా సీజన్ 8 లోకి అడుగుపెట్టి, కన్నడ బ్యాచ్ పృథ్వి , ప్రేరణ, యష్మి ,నిఖిల్ నిజస్వరూపాలను బయటపెడుతూ ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతున్నారు. ఇకపోతే టేస్టీ తేజ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి .గత సీజన్లో మంచి ఎంటర్టైనర్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన.. ఈసారి కూడా హౌస్ లోకి అడుగుపెట్టారు. అయితే ఈయన కామెడీని మిగతా కంటెస్టెంట్స్ తీసుకోలేకపోతున్నారు. అందులోనూ కన్నడ బ్యాచ్ టేస్టీ తేజను టార్గెట్ చేస్తూ ఆయన కలకు అడ్డం పడుతున్నారు
తన తల్లిని హౌస్ లోకి తీసుకురావడానికి బిగ్బాస్ లోకి వచ్చానని సీజన్ సెవెన్ లో చెప్పారు. అయితే ఈయన దురదృష్టం ఏమో కానీ సరిగ్గా ఫ్యామిలీ వీక్ వారానికి ముందు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆ కోరిక తీర్చుకోవడానికి మళ్ళీ హౌస్ లోకి వచ్చినా.. పనిష్మెంట్ కారణంగా టేస్టీ తేజ తన తల్లిని కలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా రోహిణి, గౌతమ్ బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశారు. ఎలాగైనా సరే తమ ఫ్యామిలీ వీక్ ను టేస్టీ తేజ కోసం త్యాగం చేస్తామని, టేస్టీ తేజ వాళ్ళమ్మను హౌస్ లోకి తీసుకురావాలి అంటూ ముందుకు వచ్చారు. ఎట్టకేలకు ఒప్పుకున్న బిగ్బాస్ ఫ్యామిలీ వీక్ లో టేస్టీ తేజ తల్లిని చివర్లో పంపించి సంతోష పరుస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అందరి తల్లిదండ్రులను చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చిన తర్వాతనే టేస్టీ తేజకు అవకాశాన్ని కల్పిస్తారట.
అయితే ఈ విషయాలు ఇప్పుడు టేస్టీ తేజకు బాగా వర్క్ అవుట్ అయ్యాయి. 11వ వారం నామినేషన్ లో భాగంగా గౌతమ్ , అవినాష్, టేస్టీ తేజ, పృథ్వీ, యష్మీ , విష్ణు ప్రియ నామినేషన్స్ లోకి వచ్చారు. ఇక నిన్న పోలింగ్ అయినా ఓట్లను బట్టి చూస్తే డేంజర్ జోన్ లో టేస్టీ తేజ, అవినాష్, విష్ణుప్రియ నిలిచారు. కానీ టేస్టీ తేజకు తల్లి సెంటిమెంట్ బాగా వర్క్ అవుట్ అయింది. ఆడియన్స్ ఆయనపై సింపథీ చూపిస్తూ ఓట్లు వేశారు. నిన్న నాలుగో స్థానంలో ఉన్న టేస్టీ తేజ అనూహ్యంగా రెండవ స్థానానికి చేరుకున్నారు. ఇక మొదటి స్థానంలో గౌతం కొనసాగుతూ ఉండగా…యష్మి మూడవ స్థానానికి పడిపోయింది. అవినాష్ నాల్గవ స్థానానికి చేరుకోగా.. చివరి స్థానంలో పృథ్వి , విష్ణు ప్రియ నిలిచారు. ఇక ఇప్పుడు వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.