BigTV English

BB Telugu 8: డేంజర్ జోన్ లో లేడీ కంటెస్టెంట్స్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

BB Telugu 8: డేంజర్ జోన్ లో లేడీ కంటెస్టెంట్స్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరు..?

BB Telugu 8.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ సీ లో మిగిలి ఉన్నది కేవలం రెండు వారాలు మాత్రమే. 13వ వారంలో భాగంగా డబుల్ ఎలిమినేషన్స్ ప్రక్రియలో శనివారం ఎపిసోడ్ లో టేస్టీ తేజ, ఆదివారం ఎపిసోడ్ లో పృథ్వీ రాజ్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఇక 14వ వారానికి సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం అవ్వాల్సి ఉండగా, ఒక్కసారిగా బిగ్ బాస్ నిర్ణయాన్ని ఆడియన్స్ కి వదిలేసి కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చారు. సాధారణంగా ప్రతి వారం జరిగే నామినేషన్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ సరైన కారణం చెప్పి, ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి మాత్రం బిగ్ బాస్ అందరినీ నామినేట్ చేశారు.


గత వారం జరిగిన టికెట్ టు ఫినాలే టాస్క్ లో ముక్కు అవినాష్ టాస్క్ గెలిచి, మొదటి ఫైనలిస్ట్ గా సీజన్ 8 లో నిలిచాడు. దీంతో ఎలిమినేషన్స్ నుంచి తప్పించుకున్నారు. ఇక తాజాగా ఈరోజు 92వ రోజుకు సంబంధించిన ప్రోమో ని విడుదల చేయగా.. అందులో బిగ్ బాస్ మాట్లాడుతూ.. మొదటి ఫైనలిస్ట్ గా నిలిచిన అవినాష్ మినహా మిగిలిన 6 మంది అనగా నిఖిల్, ప్రేరణ, నబీల్, గౌతమ్, రోహిణి, విష్ణు ప్రియ 6 మంది నామినేషన్స్లోకి డైరెక్ట్ గా వెళుతున్నారు అంటూ షాక్ ఇచ్చారు. ఇక ఈసారి ఆరుగురు నామినేషన్స్ లో ఉండగా.. వీరిలో లేడీ ఇద్దరు లేడీ కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో పడినట్లు సమాచారం.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.. బిగ్ బాస్ సీజన్ 8 ఫైనలిస్ట్ అయ్యేందుకు కేవలం ఒక్క వారం మాత్రమే మిగిలి ఉంది. సీజన్ 8 లో ప్రస్తుతం హౌస్ లో ఏడు మంది ఉండగా.. సీజన్ 8 లో కూడా సీజన్ సెవెన్ లో లాగే టాప్ ఫైవ్ కాకుండా టాప్ సిక్స్ ఉంచుతున్నారు. అయితే అవినాష్ తప్ప అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు. కాబట్టి అవినాష్ తో పాటు టైటిల్ రేస్ లో ఉన్న నిఖిల్ , గౌతమ్ కూడా దాదాపు సేఫ్ అయినట్టే. ఆ తర్వాత స్థానాలలో నబీల్, ప్రేరణ నిలిచారు. ఇక మిగిలింది రోహిణి, విష్ణు ప్రియ. ఇద్దరిలో ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కాక తప్పదు. నిజానికి రోహిణి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది. కానీ అవకాశం వచ్చిన ప్రతి చోట అదరగొడుతూ తనను తాను ప్రూవ్ చేసుకుంది. అయితే ఈ సీజన్లో ఒక్కసారి కూడా ఆమె నామినేషన్స్ లోకి రాకపోవడం ఆమెకు మైనస్ గా మారింది.


ఇక మరోవైపు విష్ణు ప్రియ.. నిన్నటిదాకా పృథ్వి మీద ఫోకస్ పెట్టి టాస్క్ ల్లో పెద్దగా ఆడలేదు. కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఎక్కువ కాబట్టి ఆమెను ఎలాగైనా సరే టాప్ ఫైవ్ లో చూడాలని అనుకుంటున్నారు. సో దీన్ని బట్టి చూస్తే డేంజర్ జోన్ లో రోహిణి, విష్ణు ప్రియ ఉంటారని చెప్పవచ్చు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related News

Bigg Boss 9 Promo: కట్టగట్టుకొని మరీ ఆమెను పంపించేశారుగా.. ఇది మిడ్ వీక్ ఎలిమినేషనా?

Bigg Boss9 Promo: ఉత్కంఠ రేకెత్తిస్తున్న కెప్టెన్సీ టాస్క్.. వర్షంలో హీట్ పుట్టిస్తూ!

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Big Stories

×