Gold Prices: గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ముఖ్యంగా దీపావళి పండుగల సమయంలో సామాన్యలు కొనుగోలు చేయలేని స్థాయికి ఎగబాకింది. ఆ టైమ్‌లో ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తున్న ప్రజలకు నవంబర్ నెలల్లో భారీగా తగ్గి కాస్త ఊరటినిచ్చింది. అప్పటి నుంచి ఒకరోజు పెరుగుతూ మరొక రోజు తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజా నివేదికల ప్రకారం 2025 చివరి నాటికి బంగార ధర ఏకంగా 19 శాతం పెరిగి తులానికి రూ.85,530 కి చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్దం కారణంగా గోల్డ్‌కు కిరాకీ పెరుగుతుందని నివేదిక తెలిపింది. దీంతో ద్రవ్యోల్బణం పెరగటం వల్ల బ్యాంకులు పసిడి నిల్వలు భారీగా పెంచుకుండటం వల్లే ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.70,900 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,350 ఉంది. పట్టణ నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్, తెలంగాణలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 70,900 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,350 కి చేరుకుంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 70,900 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,350 కి చేరుకుంది.
విశాఖపట్నం, గుంటూరులో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 70,900 వద్ద ట్రేడింగ్‌లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,350 ఉంది.
Also Read: అప్పుడే ఏమైంది.. ముందుంది అసలు ధర.. పెరిగిన చికెన్, గ్రుడ్ల ధరలు..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,050కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 77,500 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 70,900 కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,350 వద్ద ట్రేడింగ్‌లో
చెన్నైలో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 70,900 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,350 కి చేరుకుంది.
బెంగుళూరులో 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ. 70,900 వద్ద ట్రేడింగ్ లో ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,350 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు ఇలా..
వెండి ధరలు కూడా నిన్నటితో పోలిస్తే.. రూ.500 మేర తగ్గింది. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధర రూ.99,500కి చేరుకుంది.
ఢిల్లీ, బెంగుళూరు, పుణె, ఇతర రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 91,000 వద్ద కొనసాగుతోంది.