E-Paper
Advertisement

Bio Asia 2026 Summit: బయో ఏషియా 2026 సదస్సును నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం

Bio Asia 2026 Summit: బయో ఏషియా 2026 సదస్సును నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం
Advertisement

Bio Asia 2026 Summit: గ్లోబల్ టెక్-బయో రంగంలో తెలంగాణను పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దేందుకు బయో ఏషియా 2026 సదస్సును నిర్వహించేందుకు ప్రభుత్వం రెడీ అయింది. హైదరాబాదులో ఫిబ్రవరి 17, 18 తేదీల్లో హెచ్ ఐసీసీ లో రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్ రంగాలపై ఫోకస్ చేస్తుండగా, సుమారు 50 దేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ సదస్సుగా బయో ఏషియా సదస్సుకి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఈ స‌ద‌స్సును తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి సంయుక్తంగా కలిసి ప్రారంభించనున్నారు. “టెక్‌బయో అన్‌లీష్డ్: ఏఐ, ఆటోమేషన్ – బయాలజీ రివల్యూషన్” అనే థీమ్ మీద స‌ద‌స్సు జ‌ర‌గనున్న‌ది.గ్లోబల్ లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, ఆలోచనలకు రాష్ట్రాన్ని వేదిక చేసేందుకు హైదరాబాద్ లో ప్రజా ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా సదస్సు నిర్వహిస్తోంది.

ఏఐతో వచ్చిన మార్పులు

ప్రపంచవ్యాప్తంగా బయోటెక్నాలజీ, ఔషధాలు, హెల్త్ రంగాలకు చెందిన నిపుణులు ఈ బయో ఏషియా సదస్సులో పాల్గొననున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థల అధిపతులు, సీఈఓలు, ప్రతినిధులు సంబంధిత రంగాల్లో నిపుణులు, ఆవిష్కర్తలు ఈ వేదికపై జరిగే చర్చలు, సమావేశాల్లో పాలుపంచుకుంటారు. లైఫ్ సైన్సెస్ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు, శాస్త్ర పురోగతి, ఏఐ ప్రభావం ఈ సదస్సులో చర్చిస్తారు. హెల్త్ కేర్ రంగంలో ఏఐతో వచ్చిన మార్పులు, లైఫ్ సైన్సెస్ భవిష్యత్తును నిర్దేశించే కొత్త ఆవిష్కరణలు, గ్లోబల్ బయో ఎకానమీని బలోపేతం చేయడం, ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్ మోడల్స్ తదితర అంశాలను ఎజెండా అంశాలుగా ప్రతినిధులు చర్చించనున్నారు. బయో రంగంలో కొత్త ఆవిష్కరణలు, దేశ విదేశాల సహకారాలు, హెల్త్ కేర్ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సదస్సు ప్రధానంగా తెలంగాణకు ఉపయోగపడనుంది.

Advertisement

Also Read: Sunlight Rent Bengaluru: బెంగళూరు అద్దె వింతలు.. గదిలోకి ఎండ వస్తుందని నెలకు ₹80 వేలు అడిగిన యజమాని!

తెలంగాణ కీలక పాత్ర

బయో ఫార్మాస్యూటికల్స్, డిజిటల్ హెల్త్, వైద్య పరికరాలు, అధునాతన చికిత్స 8విధానాలు, అత్యాధునిక వైద్యం, ఆరోగ్య సంరక్షణ విధానాలపై ఈ సదస్సులో పాల్గొనే ప్రతినిధులు చర్చించనున్నారు. ఆయా రంగాల్లో పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు ఔత్సాహిక సంస్థలు, నిపుణులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచస్థాయిలో హెల్త్ కేర్ హబ్, ఇన్నోవేషన్ హబ్ గా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు ఉన్న విషయం విదితమే. వైద్య పరిశోధనలు, బయో టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ ఎక్సలెన్స్‌లో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో బయో ఏషియా 2026 సదస్సు లైఫ్ సైన్సెస్, హెల్త్‌ కేర్ రంగంలో మరో మైలురాయిగా నిలువనుంది. పరిశ్రమల వృద్ధి, సహకారం, అత్యాధునిక పరిశోధనలను ప్రోత్సహించేందుకు బయో ఏషియా సదస్సు సరికొత్త మార్గదర్శనం అందించనుంది.

స‌దస్సులో కీలక ప్రసంగం

Advertisement

గ్లోబల్ లైఫ్ సైన్సెస్ పెట్టుబడులకు కీలక గమ్యస్థానంగా తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించనుంది. ఆధునిక సాంకేతికత వ్య‌వ‌స్థ హెల్త్ ఇండ‌స్ట్రీలో ఎటువంటి మార్పులు తీసుకువ‌స్తుంద‌నే అంశంపై కీల‌క చ‌ర్చ‌లు ఈ స‌ద‌స్సులో జ‌ర‌గ‌నున్నాయి. అమ్జెన్, సానోఫీ, ఎలీ లిల్లీ, మిల్టెనీ బయోటెక్ వంటి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల ప్ర‌తినిధులు ఈ స‌దస్సులో కీలక ప్రసంగం చేయ‌నున్నారు. బయోటెక్నాలజీ, ఔషధాలు, ఆరోగ్య సేవలు, మెడికల్ టెక్నాలజీ, అర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ) వంటి రంగాల మీద కీల‌కోప‌న్యాసం చేయ‌నున్నారు. ఈ సదస్సులో అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన క్యాన్సర్ జీన్ థెరపీ నిపుణులు ప్రొఫెసర్ బ్రూస్ ఎల్. లెవిన్, అమ్జెన్ సంస్థ సీఎస్‌వో డా. హోవర్డ్ వై. చాంగ్, జర్మనీకి చెందిన మిల్టెనీ బయోటెక్ వ్యవస్థాపకులు డా. స్టెఫాన్ మిల్టెనీ, సానోఫీ సంస్థ ఈవీపీ మాడలీన్ రోచ్ వంటి ప్ర‌ముఖులు కీలకంగా మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ కూడా హాజరుకానున్నారు.

Alsom Read: Seetha Payanam: ‘సీతా పయనం’ రిలీజ్ తర్వాత అర్జున్ సర్జా చెప్పింది ఇదే.. ఏం అన్నారంటే?

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×