BigTV English

Bigg Boss 8 Day 22 Promo: మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్.. రెచ్చగొడుతూ రచ్చ చేసిన సోనియా..!

Bigg Boss 8 Day 22 Promo: మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్.. రెచ్చగొడుతూ రచ్చ చేసిన సోనియా..!

Bigg Boss 8 Day 22 Promo2.. బిగ్ బాస్ (Bigg Boss) .. 22వ రోజుకి సంబంధించి తాజాగా రెండవ ప్రోమో ని విడుదల చేశారు. ఇప్పటికే నాల్గవ వారానికి సంబంధించి నామినేషన్స్ తో కంటెస్టెంట్స్ హీట్ పుట్టిస్తున్న విషయం ఉదయం విడుదల చేసిన మొదటి ప్రోమోలో మనం చూసాం. అయితే రెండవ ప్రోమో అంతకుమించి అన్నట్టుగా తెలుస్తోంది. మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అంటూ సోనియా.. నబీల్ ను రెచ్చగొడుతూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


నాలుగో వారం ఎలిమినేట్ అయ్యేది అతడే..

రెండవ ప్రోమో విషయానికి వస్తే.. నామినేషన్స్ లో భాగంగా.. సోనియా ఆదిత్య ఓం ను ఉద్దేశించి మీ గురించి చెప్పడానికి ఎక్కువ పాయింట్స్ లేవు.. ఎందుకంటే మీరు హౌస్ లో ఎటువంటి పర్ఫామెన్స్ ఇవ్వట్లేదు అంటూ కామెంట్ చేసింది. అంతేకాదు ఈ వీక్ లో వెళ్తానని మీరే డిసైడ్ అయ్యారు కదా.. సో వెళ్లిపోండి అంటూ ఆదిత్య ఓం ముఖంపై ఫోమ్ స్ప్రే చేసింది.


ప్రేరణ వెర్సెస్ నైనిక..

ఇక తర్వాత ఆ ప్రేరణ వెర్సెస్ నైనిక మధ్య గొడవ తారస్థాయికి చేరిపోయింది. నీ గేమ్ నాకు కనిపించట్లేదు అంటూ నైనిక ను ఉద్దేశించి ప్రేరణ చేసిన కామెంట్ కు.. నైనిక మీ చీఫ్ కే పోటీ ఇచ్చాను. అది నీకు కనిపించలేదా అంటూ ఫైర్ అయ్యింది. నువ్వు నాకు కనిపించలేదు నైనిక అని ప్రేరణ అనడంతో.. అంటే గొడవలు పడాలి కదా అంటూ నైనిక సమాధానం ఇచ్చింది. అలాగే మూడవ వారంలో పృథ్వి – మణికంఠ మధ్య జరిగిన గొడవ అందరికీ గుర్తుంది కదా.. ఈ గొడవను దృష్టిలో పెట్టుకొని నామినేట్ చేశాడు మణికంఠ. మునుమందు మీతో గొడవ పడాల్సి వస్తుందేమో అనే భయం వేస్తుంది అంటూ కామెంట్ చేయగా.. పృథ్వీ సోనియా ఇచ్చిన లుక్ కి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్..

Bigg Boss 8 Day 22 Promo 2: Mr. Failed Sanchalak.. Sonia made a fuss by provoking..!
Bigg Boss 8 Day 22 Promo 2: Mr. Failed Sanchalak.. Sonia made a fuss by provoking..!

ఆ తర్వాత విష్ణు ప్రియ, ప్రేరణ మధ్య కూడా చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పాలి. సరైన రీజన్ చెప్పకుండా తను నామినేట్ చేస్తోందని ప్రేరణ వాదించగా.. నువ్వు స్టాండ్ తీసుకోలేకపోయావు అంటూ విష్ణు ప్రియ డామినేట్ చేస్తూ నామినేట్ చేసింది. ఇక తర్వాత రంగంలోకి దిగింది సోనియా.. నబీల్ ను ఉద్దేశించి మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నబీల్ అంటూ కామెంట్ చేసింది. దీంతో నబీల్ మాట్లాడుతూ.. నబీల్ అని పిలవండి మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ అని పిలవకండి అంటూ కామెంట్ చేయగా.. నేను ఇలాగే పిలుస్తాను నువ్వు ఫెయిల్డ్ సంచాలక్ అంటూ మళ్ళీ రెచ్చగొట్టింది సోనియా. ఎంత ఇస్తానో అంత తీసుకునే అంత దమ్ము కూడా ఉంది అంటూ ధీమా వ్యక్తం చేసింది. నామినేషన్స్ లో నిల్చోవాలి అని నబిల్ ను అడగ్గా .. పరవాలేదు అంటూ ఆయన కూర్చునే ఉన్నాడు. ఐ థింక్ నా ఉద్దేశంలో నువ్వు ఫెయిల్ పర్సన్ కూడా అంటూ చెప్పడంతో నబీల్ కోపంతో రెచ్చిపోయి, రకరకాల కామెంట్లు చేస్తూ ప్రోమోకి హైలెట్ గా నిలిచారు. ప్రస్తుతం ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

Bigg Boss Telugu 8 | Day 22 Promo 2 | Nominations Heat Up | Nagarjuna | DisneyPlusHotstarTelugu

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×