BigTV English

Mahesh Babu: సీఎం రేవంత్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు భేటీ.. వరద బాధితులకు భారీ విరాళం

Mahesh Babu: సీఎం రేవంత్‌తో సూపర్ స్టార్ మహేశ్ బాబు భేటీ.. వరద బాధితులకు భారీ విరాళం

Mahesh Babu donated ₹50 lakh to CM Relief Fund: సీఎం సహాయనిధికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, తన సతీమణి నమ్రత భారీ విరాళం అందించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న సీఎం నివాసానికి వెళ్లారు. ఈ మేరకు సీఎం నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళం అందించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. అంతేకాకుండా ఏఎంబీ తరఫున మరో రూ.10లక్షలను విరాళంగా ఇచ్చారు.


ఇదిలా ఉండగా, ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఏపీతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వరదల ధాటికి జనజీవనం స్తంభించిపోయింది. కొంతమంది మృతిచెందగా.. మరికొంతమంది సర్వస్వం కోల్పోయారు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ జిల్లాలో కాలనీలు నీటమునిగాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఈ నేపథ్యంలో వరద బాధితుల కోసం పలువురు సినీ ప్రముఖులు తెలుగు రాష్ట్రాలకు విరాళాలు ప్రకటించారు. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సీఎం సహాయనిధికి సైతం భారీ విరాళాలు అందజేశారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్, విశ్వక్ సేన్, సాయిధరమ్ తేజ్ వంటి నటులు తమ వంతుగా సహాయం చేశారు. తాజాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి రూ.50లక్షల చెక్కుతోపాటు మరో రూ.10లక్షలను విరాళంగా అందించారు.


Also Read: తిరుమల లడ్డూపై ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు.. నీకెందుకు? అని వీహెచ్ పీ హెచ్చరిక

Related News

BC Reservations: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. BC రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం

Karimnagar BJP: కరీంనగర్ జిల్లా బీజేపీలో.. బయటపడ్డ విభేదాలు..

Theft at Brilliant college: బ్రిలియంట్ కాలేజీ చోరీ కేసులో వెలుగులోకి సంచలనాలు..

Padi Kaushik Reddy: అమ్మతోడు వెయ్యి మందితో దాడి చేస్తా.. సొంత పార్టీ నేతలకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Breakfast: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సర్కార్ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌

BJP Candidate: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవీన్ యాదవ్‌కు అనుకూల అంశాలేంటి..? గెలుపు శాతమెంత..?

CM Revanth: ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్

Big Stories

×