BigTV English

Viswam : గోపీచంద్ కు 6 కోట్లా… మార్కెట్‌కి మించి రిస్క్ చేస్తున్నారా?

Viswam : గోపీచంద్ కు 6 కోట్లా… మార్కెట్‌కి మించి రిస్క్ చేస్తున్నారా?

Viswam : మాచో హీరో గోపీచంద్ కు ఇటీవల అస్సలు టైమ్ బాగాలేదు. ఆయన సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్నప్పటికే ఆ అంచనాలను చేరుకోవడంలో మాత్రం ఎప్పటిలాగే ఫెయిల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే ఈ సారి హిట్ కొట్టాలనే కసితో ఉన్న గోపీచంద్ విశ్వం మూవీతో మరోసారి తన లక్ ను పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే గోపీచంద్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకోకుండా ఈ మూవీకి జరుగుతున్న బిజినెస్ ని చూస్తుంటే మాత్రం రిస్క్ చేస్తున్నారా? అనే అనుమానం కలగక మానదు.


మార్కెట్‌కి మించి రిస్క్ చేస్తున్నారా?

గత కొన్నేళ్లుగా గోపీచంద్ సినిమాలు అంచనాలను అందుకోవడంలో తడబడుతున్నాయి. ఆయన వరుసగా అవుట్ డెటెడ్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండడంతో ఏమాత్రం మొహమాటం లేకుండా తిరస్కరిస్తున్నారు. ఆయన గత చిత్రం రామ బాణం బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయ్యింది. కొన్ని నాన్-థియేట్రికల్ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదు. అలాగే ఆయన చివరి చిత్రమైన భీమా కూడా మంచి బజ్ తో రిలీజ్ అయ్యింది. కానీ బాక్స్ ఆఫీసు వద్ద బొక్క బోర్లా పడింది. అయితే ఇటీవల కాలంలో గోపీచంద్ సినిమాలను పరిగణలోకి తీసుకుంటే తొలిసారిగా ఈ గోపీచంద్ తాజా చిత్రం విశ్వంకు సంబంధించిన డీల్స్ అన్నీ క్లోజ్ అయ్యాయి. పైగా ఈ మూవీకి జరుగుతున్న బిజినెస్ సినిమా విశ్లేషకులకు షాక్ ఇస్తోంది. విశ్వం మూవీ ఆంధ్రా రైట్స్ ను శంకర్ పిక్చర్స్ వారు 6 కోట్లకు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గోపీచంద్ కు ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఇది చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. మరి ఈ రేంజ్ లో విశ్వం మూవీకి బిజినెస్ జరుగుతోంది అంటే కంటెంట్ పై ఉన్న నమ్మకమే కారణం అయినప్పటికీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే తెలిసి తెలిసి చేతులు కాల్చుకున్నట్టే అవుతుంది. మరి విశ్వం మూవీ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి.


Viswam: గోపీచంద్ లైట్ గడ్డంతో, డార్క్ కళ్లద్దాలు పెట్టుకుని స్టైలిష్‌గా..  ఫస్ట్ స్ట్రైక్! | Gopichand and Sreenu Vaitla Combo Film Viswam First  Strike Out KBK

డిజిటల్ రైట్స్ కూడా సోల్డ్ 

గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న కొత్త మూవీ విశ్వం, యాక్షన్‌తో కూడిన ఈ కామిక్ ఎంటర్‌టైనర్ టీజర్ ఇప్పటికే రిలీజై, మంచి రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ నేపథ్యంలోనే దాన్ని క్యాష్ చేసుకుంటూ మేకర్స్ సినిమాకు సంబంధించిన అన్ని డీల్స్ ను క్లోజ్ చేశారు.  విశ్వం డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేయగా, శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకుంది. హిందీ రైట్స్, మ్యూజిక్ రైట్స్ అయితే చాలా కాలం క్రితమే అమ్ముడయ్యాయి. నిర్మాతలు విడుదలకు ముందే పెట్టుబడి మొత్తాన్ని రికవరీ చేస్తున్నట్టుగా కన్పిస్తోంది. ఈ  సినిమా బడ్జెట్ రూ. 40 కోట్లు దాటింది. యూరప్, మనాలి, గోవా, హైదరాబాద్‌లో విశ్వం మూవీని షూట్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా, కావ్య థాపర్ కథానాయికగా నటించింది. దసరా హాలిడే సీజన్‌లో అక్టోబర్ 11న విశ్వంను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×