BigTV English
Advertisement

Bigg Boss 8 Day 22 Promo: నామినేషన్ రచ్చ షురూ.. మళ్ళీ అదే పెంట..!

Bigg Boss 8 Day 22 Promo: నామినేషన్ రచ్చ షురూ.. మళ్ళీ అదే పెంట..!

Bigg Boss 8 Day 22 Promo.. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) మూడు వారాలు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి వారంలో భాగంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బెజవాడ బేబక్క (Bejawada Bebakka)ఎలిమినేట్ అవ్వగా రెండవ వారంలో ఆర్.జే.శేఖర్ బాషా(RJ Sekhar basha) ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారంలో భాగంగా బిగ్ బాస్ ను ఘోరంగా అవమానించాడు అన్న నేపథ్యంలో ప్రముఖ నటుడు అభయ్ (Abhay) ను ఎలిమినేట్ చేశారు. ఇక మూడు వారాలు పూర్తయిన నేపథ్యంలో అప్పుడే నాలుగవరానికి సంబంధించిన నామినేషన్స్ రచ్చ మొదలయ్యింది. తాజాగా ఈ ప్రోమోనో విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వహకులు. మూడు వారాలలో ఏం జరిగింది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నామినేట్ చేయబోయే కంటెస్టెంట్ ముఖంపై ఫోమ్ స్ప్రే చేసి అసలు రీసన్ చెప్పాలి అని బిగ్ బాస్ సూచిస్తారు.


నామినేషన్స్ రచ్చ షురూ..

ఇక బిగ్ బాస్ ప్రోమో విషయానికి వస్తే.. కంటెస్టెంట్స్ అందరూ ఒకరి మీద ఒకరు బురద జల్లుకొనే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వారి మాట తీరు అందర్నీ ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు. బిగ్ బాస్ మాట్లాడుతూ.. ఈ ఇంటిలో మూడు వారాలు గడిపారు. ఇక నాలుగవ వారంలో ఇంట్లో ఉండడానికి ఎవరు అర్హులో ఎవరు అనర్హులో తేల్చే సమయం వచ్చింది ప్రతి కంటెస్టెంట్ ఇద్దరు కంటెస్టెంట్స్ మొఖం మీద హోమ్ స్ప్రే చేసి సరైన రీజియన్ చెప్పి నామినేట్ చేయాలని తెలిపారు బిగ్ బాస్. ఇక అందులో భాగంగానే ఆదిత్య ఓం ముందుగా పృథ్వీ పై ఫోమ్ స్ప్రే చేసి.. మీరు ఇన్సల్ట్ చాలా గట్టిగా చేస్తారు. అంత గట్టిగా అరిచినప్పుడు.. సారీ చెప్పినప్పుడు కూడా అంతే గట్టిగా చెప్పాలి కానీ నాకు అలా వినిపించలేదు అని చెప్పాడు ఆదిత్య. దీనికి పృథ్వీ నేను మిమ్మల్ని ఎప్పుడూ ఇన్సల్ట్ చేయలేదు. మీరు నాకు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను వార్నింగ్ తీసుకోవాలా..? అంటూ గొడవపడ్డారు.


Bigg Boss 8 Day 22 Promo: Nomination Racha Shuru.. Same issue Again..!
Bigg Boss 8 Day 22 Promo: Nomination Racha Shuru.. Same issue Again..!

అవే రీజన్స్.. అదే పెంట..

ఆ తర్వాత నబీల్ – సోనియా టైమ్ వచ్చేసింది. నబీల్ సోనియాను నామినేట్ చేస్తూ నరాలు కనిపించేలా మీరు అరుస్తూ ఉంటారు అంటూ తెలిపాడు నబీల్. ఇక తర్వాత సోనియా చెప్పే ప్రయత్నం చేయగా నబీల్ రెచ్చిపోతూ నా పాయింట్ అయిపోని అంటూ వెకిలి చేష్టలు చేశాడు. ప్రతిసారి నా గొంతు గురించి కంప్లైంట్ చేస్తున్నావు. నా టోన్ గురించి కంప్లైంట్ చేయడానికి నువ్వెవరు అంటూ సోనీయాపై విరుచుకుపడ్డాడు. ఇక తర్వాత నైనిక మణికంఠను నామినేట్ చేస్తూ రీసన్ చెప్పింది. ఇక తర్వాత ఒకరికొకరు నామినేట్ చేసుకుంటూ షో ను కాస్త హీటెక్కించేలా చేశారు. మొత్తానికైతే నామినేషన్స్ రచ్చ మళ్లీ చెత్త రీజన్స్ తో షురూ చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే ఈ ప్రోమో ఇప్పుడు చాలా వైరల్ గా మారుతోంది.

Related News

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Bigg Boss 9 Telugu : దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?

Bigg Boss Telugu 9 : ఇమ్మూ బట్టతలపై బిగ్ బాస్ పంచులు… ఈ గుడ్డులో గోల ఏందయ్యా మాకు ?

Big Stories

×