BigTV English
Advertisement

Bigg Boss 8 Day 33 Promo 2: కన్ఫెషన్ రూమ్.. ట్విస్ట్ తో చెమటలు పట్టించిన యష్మీ..!

Bigg Boss 8 Day 33 Promo 2: కన్ఫెషన్ రూమ్.. ట్విస్ట్ తో చెమటలు పట్టించిన యష్మీ..!

Bigg Boss 8 Day 33 Promo 2.. బిగ్ బాస్ తాజాగా 33వ రోజుకు సంబంధించి రెండో ప్రోమో ని వదిలారు. ఈ ప్రోమో ఎమోషనల్ గా సాగింది అని చెప్పవచ్చు. ఇక హౌస్లో ఎటువంటి టాస్క్ లేకపోవడంతో ఎవరికి వారు బెడ్ పై పడుకొని అలా ఏదో ఆలోచిస్తున్నట్టు కనిపించారు. వెంటనే బిగ్ బాస్ అందర్నీ అలర్ట్ చేసి, మీ అందరికీ బాగా నిద్ర వస్తున్నట్లుంది కదా అంటూ చెప్పగానే వెంటనే హౌస్ సభ్యులు అంతా అలర్ట్ అయిపోయారు. ఆ తర్వాత అందరిని కన్ఫెషన్ రూమ్ కి పిలిచారు బిగ్ బాస్.


విష్ణుప్రియను హర్ట్ చేసిన పృథ్వీ..

ఇక తర్వాత ఒక్కొక్కరు కన్ఫెషన్ రూమ్ కి వెళ్లారు. కన్ఫెషన్ రూమ్ కి వెళ్లిన యష్మీ తో హౌస్ లో మీకు నచ్చిన హౌస్ మేట్ ఎవరో చెప్పమని అడగ్గా బయట నుంచి ప్రేరణ.. ప్రేరణ అని చెప్పు అని అడగ్గా.. లోపల యష్మి ఇద్దరు ఉన్నారు అంటూ నిఖిల్ , పృథ్వి పేర్లు చెబుతుంది. ఆ తర్వాత మణికంఠ నబీల్ పేరు తెలిపారు. నబీల్ మిడ్ వీక్ నామినేషన్ లో ఉంటాడు చూడు అంటూ నైనిక సరదాగా నవ్వించింది. ఇక తర్వాత పృథ్వీ ను పిలవగా పృథ్వీ ఇంకొకరి పేరు చెబుతారు. కానీ బిగ్ బాస్ ఇంకొక పేరు మర్చిపోయావు చూడు అంటూ విష్ణుప్రియను చూపిస్తారు. కానీ విష్ణు ప్రియ బయట అప్పటికే హార్ట్ అయిపోవడం మనం చూడవచ్చు.


ఇంటి నుండి అమ్మ పంపిన వంటతో నిఖిల్ ను సర్ప్రైజ్ చేసిన యష్మీ..

ఆ తర్వాత ప్రతి ఒక్కరితో మీ ముందున్న క్లాత్ ను తీయండి అని చెప్పగా.. యష్మి తన ముందు ఉన్న క్లాత్ పక్కకు తీయగానే.. నిఖిల్ కు వాళ్ళ అమ్మ చేసిన ఇంటి వంటతో పాటు మణికంఠకి తన భార్య ప్రియ దగ్గర్నుంచి కూడా ఇంటి వంట వచ్చింది అని చెబుతాడు బిగ్ బాస్. దీంతో నిఖిల్ ఎమోషనల్ అవ్వగా మణికంఠ సర్ప్రైజ్ అయిపోతాడు. ప్రియా ఇండియా వచ్చేసిందా అంటూ ఆశ్చర్యపోతాడు. ఎవరికి ఇంటి వంట చెందాలో నిర్ణయించి ఇద్దరిలో ఒకరికి తీసుకుని వెళ్లి ఇవ్వండి అని చెప్పగానే.. యష్మి నేను నిఖిల్ కే ఇస్తాను అని తెలిపింది. ఇంటి వంటలతో పాటు వారిద్దరికీ ప్రియమైన వారి నుంచి మెసేజ్ కూడా వచ్చింది అని చెప్తాడు బిగ్ బాస్. దీంతో మణికంఠ ప్లీజ్ యష్మి అని వేడుకుంటాడు. కానీ యష్మి నిఖిల్ కి వాళ్ళ అమ్మ తెచ్చిన వంటే ఇస్తానని చెబుతుంది.

మణికంఠను మళ్లీ బాధపెట్టిన యష్మీ..

దీంతో కోపం తెచ్చుకున్న మణికంఠ యష్మీ నాకు ఆ మెసేజ్ లో ఏముందో తెలియాలి అంటూ బిగ్గరగా అరుస్తాడు. అంతేకాదు బిగ్ బాస్ కూడా మణికంఠ గురించి ఏం ఆలోచించాలి అనిపించలేదా అని అడిగినప్పటికీ కూడా యష్మి నిఖిల్ కోసం వాళ్ళ అమ్మ పంపిన వంట తీసుకొని బయటకొచ్చేస్తుంది. ఆ తర్వాత మణికంఠ ఎమోషనల్ అవుతూ.. ప్రియా ఎందుకు ఇండియాకు వచ్చిందో తెలియదు ? శోవన్ ఏమన్నా అయిందా ఏంటి అంటూ కంటతడి పెట్టుకున్నారు. మరొకవైపు తన తల్లి తీసుకొచ్చిన ఫుడ్ ను చూసి ఎమోషనల్ అవుతాడు నిఖిల్. ఇక ఎమోషన్ తట్టుకోలేక మణికంఠ బయటకు వచ్చేసి ప్రియా ఐ లవ్ యు అంటూ తన భార్యపై ప్రేమను చూపించేస్తారు. మొత్తానికైతే నాగమణికంఠ ఎమోషనల్ అవ్వడం.. నెటిజన్స్ కి కూడా బాధ కలిగించిందని చెప్పవచ్చు.

Related News

Bigg Boss 9: చివరిలో చేజారిన తనూజ కెప్టెన్సీ.. అతడే కొత్త కెప్టెన్!

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ లో ఉండటం ఆ కంటెస్టెంట్ కు ఇష్టం లేదా..? ఈ వారం ఇతనే ఎలిమినేట్..?

Bigg Boss 9 Promo: రీతూ Vs దివ్య.. చిచ్చుపెట్టిన సాయి!

Bigg Boss 9 Telugu : గౌరవ్ కు గట్టిదెబ్బ… ఇదేందయ్యా ఇదీ… కట్టప్ప కన్నా తనూజా – ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటే దారుణం

Bigg Boss 9 Telugu Day 60 : ఇమ్మూను బోల్తా కొట్టించిన రీతూ… తనూజా వల్ల గౌరవ్ కు తీరని అన్యాయం… దివ్య దిక్కుమాలిన ప్లాన్ సక్సెస్

Bigg Boss 9 Madhuri: వాళ్లు రెమ్యునరేషన్‌ ఇచ్చేదేంటి.. నాకే నెలకు కోటి వస్తుంది.. దివ్వెల మాధురి

Bigg Boss 9 Promo: కెప్టెన్సీ వార్‌.. హీటెక్కిన ఆరేంజ్‌ టీం డిస్కషన్‌, తగ్గేదే లే అంటున్న గౌరవ్!

Bigg Boss 9 Promo: సీక్రెట్ టాస్క్.. అడ్డంగా బుక్కైన ఇమ్మూ !

Big Stories

×