BigTV English

Bigg Boss 8 Day 33 Promo 3: హగ్ అండ్ పంచ్.. కొత్త ఛాలెంజ్ తో గేమ్ షురూ..!

Bigg Boss 8 Day 33 Promo 3: హగ్ అండ్ పంచ్.. కొత్త ఛాలెంజ్ తో గేమ్ షురూ..!

Bigg Boss 8 Day 33 Promo 3.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ప్రముఖ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ (Bigg Boss) ఇప్పుడు ఎనిమిదవ సీజన్లో భాగంగా ఐదవ వారం చివరి దశకు చేరుకుంది. ఈరోజు శనివారం కావడంతో కంటెస్టెంట్స్ కు మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి బిగ్ బాస్ వచ్చేశారు. అందులో భాగంగానే హగ్ అండ్ పంచ్ అనే ఛాలెంజ్ తో అటు కంటెస్టెంట్స్ ను మాత్రమే కాదు ఇటు ఆడియన్స్ ను కూడా విపరీతంగా ఆకట్టుకున్నారు బిగ్ బాస్. మరి ఈ ప్రోమో గురించి ఇప్పుడు చూద్దాం.


ఈవారం ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం..

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 8 ఐదవ వారంలో భాగంగా ప్రముఖ హీరో ఆదిత్య ఓం (Adithya Om) ఎలిమినేట్ అయ్యారు. అందులో భాగంగానే తాజాగా ఆయన స్టేజ్ పైకి వచ్చేసారు. తన ఆట తీరుతో మాట తీరుతో అందరితో కలగోలుగా కనిపిస్తూ ప్రేక్షకులను విపరీతంగా అలరించిన ఆదిత్య ఓం గత వారాలతో పోల్చుకుంటే కాస్త వెనుకబడినా .. ఈ రెండు వారాలలో బాగానే తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించారు. కానీ ముందు వారాలను పరిగణలోకి తీసుకొని, ఆయన సరిగా ఆడలేదనే కారణంతో ఎలిమినేట్ చేయడం జరిగింది. దీంతో ఈవారం ఓటింగ్ లిస్టులో లీస్ట్ లో ఉండడంతో ఆదిత్య ఓం ను ఎలిమినేట్ చేశారు బిగ్ బాస్.


హగ్ అండ్ పంచ్ ఛాలెంజ్..

ఇక ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ ను వీడిన ఆదిత్య బిగ్ టీవీలోకి వచ్చేసారు. ఇక నాగార్జున పక్కన ఆదిత్య
ఓం ను చూడగానే.. సీత మాట్లాడుతూ.. అన్న టీవీలో చాలా బాగున్నారు అన్నా అంటూ కామెంట్లు చేసింది. దీంతో ఆదిత్య బయట బాగున్నాను అంటూ కామెంట్ చేశారు. ఇక హగ్ అండ్ పంచ్ ఛాలెంజ్ లో ఆదిత్య ఓం హౌస్ లో ఉన్న సభ్యులతో ఎవరికి పంచ్ ఇవ్వబోతున్నారో చెప్పమని నాగార్జున అడగగా.. దాంతో హగ్ దగ్గర నబీల్ ఫోటో పెట్టి మీరు బిగ్ బాస్ లో టైటిల్ గెలిస్తే ఆదిత్య ఓం గెలిచినట్టే అంటూ కామెంట్ చేశారు. పవర్ ఆఫ్ ది హౌస్ పృథ్వీరాజ్ శెట్టి అంటూ పృథ్వీ కి కూడా హగ్ ఇచ్చారు ఆదిత్య. ఆ తర్వాత విష్ణు ప్రియ, నిఖిల్ కి కూడా హగ్ ఇచ్చారు. ఇక తర్వాత యష్మీ, సీత ఇలా అందరితో కూడా చాలా బాగా ఆడాలి అని అందరిలో కాన్ఫిడెంట్ లెవెల్ పెంచేసి మరి వెళ్ళిపోయారు ఆదిత్య. ఇకపోతే ఆదిత్య ఎలిమినేట్ అయినట్టు హౌస్ లో ఎవరికీ తెలియదేమో, అందరికీ రహస్యం చెప్పబోతున్నాను అని తెలిపిన నాగార్జున.. ఆదిత్య బిగ్ బాస్ నుంచి వెళ్లిపోతున్నారని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. మొత్తానికైతే ఈవారం ఆదిత్య ఎలిమినేట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.ఈ ప్రోమో కూడా చాలా బాగా సాగింది.

 

Related News

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Big Stories

×