BigTV English

Bigg Boss 8 Day 37 Promo 1: నామినేషన్స్ రచ్చ… రాయల్ క్లాన్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss 8 Day 37 Promo 1: నామినేషన్స్ రచ్చ… రాయల్ క్లాన్ కి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Bigg Boss 8 Day 37 Promo 1.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తూ.. మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తూ.. మంచి టిఆర్పి రేటింగ్స్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న రియాల్టీ షో బిగ్ బాస్ 8వ సీజన్ (Bigg Boss 8)ప్రారంభమైంది. అందులో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి చేసుకోగా.. 5 వారాలలో ఆరు మంది సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఇప్పుడు ఆరవ వారం మొదలైంది. 6 వారం ప్రారంభంలో వైల్డ్ కార్డు ఎంట్రీస్ ద్వారా ఏకంగా ఎనిమిది మంది బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. ఇక వీరందరూ ఒక క్లాన్ గా.. ఆల్రెడీ ఇప్పటికే హౌస్ లో ఉన్న మరో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ను ఒక క్లాన్ గా విభజించి ఇద్దరి మధ్య పోటీ పెట్టారు బిగ్ బాస్.


నామినేషన్ రచ్చ షురూ..

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆరవ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం రోజు మొదలైంది. ఇప్పటికీ కూడా ఈ నామినేషన్ రచ్చ వాడి వేడిగా సాగుతూ హౌస్ మేట్స్ కి ముచ్చెమటలు పట్టిస్తోంది అని చెప్పవచ్చు. ఇప్పటివరకు హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకున్న యష్మీ నామినేషన్ లోకి రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా నామినేషన్ ప్రక్రియలో భాగంగా 37వ రోజుకు సంబంధించి తాజా ప్రోమో ని బిగ్ బాస్ నిర్వహకులు విడుదల చేయగా.. ఇందులో రాయల్ క్లాన్ కి బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చినట్లు సమాచారం.


బిగ్ బాస్ ప్రోమో..

ప్రోమో విషయానికి వస్తే.. రాయల్ క్లాన్ సభ్యులు.. హౌస్ లో.. ఐదు వారాలు తమ ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పించిన హౌస్ మేట్స్ తప్పొప్పులను ఐడెంటిఫై చేస్తూ ఒక్కొక్కరు ఇద్దరిద్దరిని నామినేట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హరితేజ పృథ్వి, యష్మీ లను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక రోహిణి కూడా యష్మీ , విష్ణుప్రియ లను నామినేట్ చేసింది. వారు చేసిన తప్పులను ఐడెంటిఫై చేసి వారికి వివరించి మరి చెప్పింది. అంతే కాదు యష్మీ చేస్తున్న తప్పులను తనకు తెలిసి వచ్చేలా చేస్తూ.. సరిదిద్దుకునే ఛాన్స్ కూడా ఇచ్చినట్లు మనకు అర్థమవుతుంది.మరి రోహిణి మాటలను యష్మి ఏ విధంగా తీసుకుంటుందో చూడాలి.

రాయల్ క్లాన్ సభ్యులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్..

ఇదిలా ఉండగా నామినేషన్స్ పూర్తయిన వెంటనే రాయల్ క్లాన్ సభ్యులకు బిగ్ బాస్ భారీ ట్విస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఉన్న హౌస్ మేట్స్ అందరూ కలిసి రాయల్ క్లాన్ సభ్యులలో ఒక ఇద్దరిని నామినేట్ చేయాలని తెలిపారు. దీంతో రాయల్ క్లాన్ సభ్యులు కాస్త డైలమాలో పడిపోయారు. మరి ఆ ఇద్దరు ఎవరో తెలియాలి అంటే ఇంకొంచెం సేపు ఎదురు చూడాల్సిందే.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×