BigTV English
Advertisement

Bigg Boss 8 Day 42 Promo1: బిగ్ బాస్ లో మరో సమంత.. కొత్త లవ్ ట్రాక్ మొదలు..!

Bigg Boss 8 Day 42 Promo1: బిగ్ బాస్ లో మరో సమంత.. కొత్త లవ్ ట్రాక్ మొదలు..!

Bigg Boss 8 Day 42 Promo1.. బిగ్ బాస్.. బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన ఈ షో లో దాదాపు 16 మంది కంటెస్టెంట్స్ ఇప్పుడు పోటాపోటీగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా హౌస్ లో ఉన్నది 8 మంది కంటెస్టెంట్స్ అయితే వైల్డ్ కార్డు ద్వారా మరో ఎనిమిది మంది హౌస్ లోకి అడుగుపెట్టి రెండు గ్రూపులుగా విడిపోయి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తూ.. టైటిల్ ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యంగా ఆట తీరుతో, మాట తీరుతో అటెన్షన్ క్రియేట్ చేస్తూ ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇకపోతే ఎప్పటిలాగే బిగ్ బాస్ 8వ సీజన్ ఆరవ వారం చివరికి చేరుకోగా.. నాగార్జున శని, ఆదివారాలలో కంటెస్టెంట్స్ ను ఎంటర్టైన్ చేస్తారన్న విషయం తెలిసిందే. ఇక అందులోనూ ఈ రోజు దసరా పండుగ. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ లో కొత్త జోష్ ను నింపి, పండుగ వాతావరణాన్ని మళ్లీ తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈరోజు 42వ రోజుకు సంబంధించిన ఒక ప్రోమోను బిగ్ బాస్ థీమ్ విడుదల చేశారు . మరి ఆ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.


వారిని ఫ్లర్ట్ చేస్తున్న పృథ్వీ.

ప్రోమో విషయానికి వస్తే.. దసరా పండుగ సందర్భంగా బ్లాక్ షర్టులో మరింత హ్యాండ్సమ్ గా కనిపించారు నాగార్జున. ఇక స్టేజ్ పైకి రాగానే రాయల్స్ ఎలా ఉన్నారు.. ఒరిజినల్స్ గ్యాంగ్ స్టార్స్ ఎలా ఉన్నారు.. అంటూ కంటెస్టెంట్స్ ను ప్రేమగా పలకరించారు. దీంతో వెంటనే రాయల్ క్లాన్ సభ్యులు సూపర్ సార్ అనగా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ క్లాన్ మెంబర్ విష్ణు ప్రియ స్టాంప్ డ్యూటీలు చేసి అలసిపోయాం అంటూ కామెంట్ చేసింది. నేను ఇంకా మాల్దీవ్స్ గురించి ఆలోచించి ఆలోచించి అలసిపోయావేమో అనుకున్నాను అంటూ జోక్ చేశారు నాగార్జున. చివరికి నైనికతో పృథ్వి చేసిన ఫ్లర్టింగ్ కి మొత్తం మరిచిపోయాను సార్ అంటూ కామెంట్ చేసింది విష్ణు ప్రియ. ఆ తర్వాత రోహిణి నాతో కూడా ఫ్లర్టింగ్ చేశాడు సార్ అంటూ చెప్పింది.


బిగ్బాస్ లో మరో సమంత..

నాగార్జున మాట్లాడుతూ మహబూబ్ నీ నుంచి చిన్న పర్ఫామెన్స్ కోరుకుంటున్నాను అంటూ అడిగాడు. అరుంధతి నిన్ను వదలా ..ఈ డైలాగ్ ఏడుస్తూనే చెప్పాలి. అని అడగ్గా.. ఆ తర్వాత యష్మితో మెహబూబ్ అరుంధతి నిన్ను వదల అంటూ ఏడుస్తూ చెబుతాడు. ఆ తర్వాత ఇదే డైలాగ్ అవినాష్ రోహిణితో చెప్పగా.. రోహిణి నన్నేం చేయలేవురా అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో ముక్కు అవినాష్ నేనే కాదు నిన్ను ఎవడు ఏం చేయలేదు అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత గంగవ్వ ను ఉద్దేశించి తేజాకు ఎందుకో నువ్వు సమంతలా అనిపిస్తున్నావంటూ కామెంట్ చేశారు. దానితో గంగవ్వ మురిసిపోయింది. గంగవ్వ కంప్లైంట్ చేస్తూ తక్కువ తిను, తక్కువ తినంటే తినకుండా పొట్ట పెంచేస్తున్నాడు అంటూ కామెంట్ చేసింది. ఆ తర్వాత మహబూబ్ పర్యవేక్షణలో పుష్ అప్ చేయమని చెబితే ఒక పుష్ అప్ కే కింద పడిపోయాడు తేజ. మొత్తానికి అయితే దసరా పండుగ వేళా ఈ ప్రోమో అంత సందడిగా సాగింది.

Related News

Bigg Boss 9 Promo: రీఎంట్రీ ఫైర్.. చిరాకు దొబ్బుతున్నారు భయ్యా!

Bigg Boss 9: దివ్య మళ్లీ బంధాన్ని కొనసాగించాలి అని చూస్తుందా? గౌరవ్ గుప్తాతో ఆర్గ్యుమెంట్ అవసరమా?

Bigg Boss 9: ఈ వారం నామినేషన్ లో మొత్తం 8 మంది.. వాళ్లు ఎవరెవరంటే

Bigg Boss 9 : నాన్న మారిపోయాడు.. దివ్యని అవైయిడ్ చేసి తనూజతో.. అసలేం జరిగింది

Bigg Boss 9 day 51: శ్రీజ దెబ్బకు ఏడ్చిన మాధురి.. రీఎంట్రీ లో ట్విస్ట్.. తనూజపై ఇమ్మూ గాసిప్స్

Bigg Boss 9 : బిగ్ బాస్ యాజమాన్యం సంచలన నిర్ణయం, హోస్ట్ గా నాగార్జున ఇక లేనట్లేనా?

Bigg Boss 9 Promo : అన్నా చెల్లి.. ఓ తెలుగు రాని అబ్బాయ్, దివ్య స్మార్ట్ గేమ్ ఆడుతుందా?

Bigg Boss 9 Bharani: హౌస్‌లో భరణికి తీవ్రగాయాలు.. అర్ధరాత్రి హాస్పిటల్‌కు తరలింపు

Big Stories

×