BigTV English

Baba Siddique’s murder case: బాబా సిద్ధిఖీ హత్య కేసు, సంచలన విషయాలు.. నిందితుడు మైనర్ కాదు

Baba Siddique’s murder case: బాబా సిద్ధిఖీ హత్య కేసు, సంచలన విషయాలు.. నిందితుడు మైనర్ కాదు

Baba Siddique’s murder case: ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసులో ఏం జరుగుతోంది? నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? నిందితుడు మైనర్ అని ఎందుకన్నారు? ఆధార్ కార్డు నిందితుడ్ని పట్టించిందా? బోన్ అసిఫికేషన్ టెస్ట్ ఏం చెబుతోంది? లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. దావూద్ గ్యాంగ్‌ని తలపిస్తోందా? మహారాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతోంది?


ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్య కేసును షిండ్ సర్కార్ సీరియస్‌గా తీసుకుందా? లేక ఆ విధంగా కనిపిస్తుందా? ఈ కేసు హడావుడి ఎందుకు తగ్గుతోంది? కావాలనే ప్రభుత్వం జాప్యం చేస్తుందా? బాబా సిద్ధిఖీ హత్య కేసు నిందితుల్లో ధర్మరాజ్ కశ్యప్ మైనర్ కాదని న్యాయస్థానం తేల్చేసింది.

ఈ మేరకు అతడికి బోన్ అసిఫికేషన్ టెస్ట్ నిర్వహించారు. ఆ రిపోర్టు ఆధారంగా నిందితుడు మైనర్ కాదని, వయస్సు 21 ఏళ్లని గుర్తించారు. ఆధార్ కార్డు సైతం ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించింది. ఆధార్ ఆధారంగా బోన్ పరీక్ష నిర్వహించి నట్టు తెలుస్తోంది. చివరకు న్యాయస్థానం నిందితులకు ఈనెల 21 వరకు పోలీసు కస్టడీ విధించింది.


నిందితుడ్ని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా, కేవలం 17 ఏళ్లని అతడి తరపు అడ్వకేట్ వాదించారు. ఆధార్ ప్రకారం 2003 పుట్టాడని, దీన్ని బట్టి నిందితుడు మైనర్ కాదని ప్రాసిక్యూషన్ తెలిపింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు వయస్సు నిర్థారించే టెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ALSO READ: బాబా సిద్దిక్ హత్య కేసులో మూడో నిందితుడు అరెస్ట్.. ‘షూటర్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది ఇతనే’

ఈ కేసు వ్యవహారంపై అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కావాలనే సిద్ధిఖీ కేసును ప్రభుత్వం నీరు గార్చుతోందని ఆరోపిస్తున్నాయి విపక్షాలు. హతుడికి బాలీవుడ్ ఇండస్ట్రీతో మంచి సంబంధాలున్నాయని అంటున్నారు. నిజాలు నిగ్గు తేల్చాలంటే వీలైనంత వేగంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలావుండగా వచ్చేవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే సిద్ధిఖీ కేసు నీరు గారే అవకాశముందని అంటున్నారు.

చాలామంది బిష్టోయ్ గ్యాంగ్‌ని అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో పోల్చుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో బిష్టోయ్ గ్యాంగ్ చేయని ఆగడాలు లేవని అంటున్నారు. ముఖ్యంగా ఈ గ్యాంగ్ కీలక నేతల జైలు ఉండగా ఇన్ని ఘటనలు జరుగుతున్నాయని, బయటకు వస్తే పరిస్థితి ఊహించలేమని అంటున్నారు.

ఖలిస్తాన్ వేర్పాటు వాదులతో ఈ గ్యాంగ్‌కు సంబంధాలున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. హత్యపై బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు భద్రత పెంచారు. ఇంటి వద్ద సెక్యూరిటీని మొహరించారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×