E-Paper
Advertisement

Bigg Boss 8 Day 47 Promo 1: కుషన్ ఛాలెంజ్.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం..!

Bigg Boss 8 Day 47 Promo 1: కుషన్ ఛాలెంజ్.. కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం..!
Advertisement

Bigg Boss 8 Day 47 Promo 1.. బిగ్ బాస్ సీజన్ 8 ఊహించని ట్విస్టులతో కంటెస్టెంట్ల మధ్య భారీ యుద్ధాన్ని క్రియేట్ చేస్తోందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఒరిజినల్ గ్యాంగ్ స్టార్, రాయల్ క్లాన్ సభ్యుల మధ్య గొడవ ఏ రేంజ్ లో ఉందంటే ఆఖరికి కొట్టుకునేలా మారిపోయారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా 47వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోను మేకర్స్ విడుదల చేయగా ఈ ప్రోమోలో కుషన్ ఛాలెంజ్ అంటూ ఒక టాస్క్ తీసుకొచ్చారు బిగ్ బాస్. ఆ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.

కుషన్ ఛాలెంజ్..

Advertisement

ప్రోమో విషయానికి వస్తే.. ఓవర్ స్మార్ట్ ఫోన్స్, ఓవర్ స్మార్ట్ ఛార్జెస్ అంటూ.. బిగ్ బాస్ ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఇస్తున్నారు. ఈ టాస్క్ గెలిచిన క్లాన్ సభ్యులకి ఒక పెద్ద ప్రయోజనం లభిస్తుంది అంటూ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ , రాయల్ క్లాన్ సభ్యులతో తెలిపారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో మీరు చేయవలసిందల్లా.. ప్లాస్మాలో కనిపిస్తున్న చిత్రం అక్కడ ఉన్న ఏ కుషన్ పై కనిపిస్తుందో.. దానిని తీసుకొని బాక్స్ లోకి వెళ్లడం అంటూ టాస్క్ గురించి వివరించారు బిగ్ బాస్. ఇక బజర్ మోగగానే ప్లాస్మా పై కారు , చార్జర్, యారో మార్క్, ట్రాఫిక్ కానిస్టేబుల్ బొమ్మలు కనిపించాయి. అలా ఒకరి తర్వాత ఒకరు పోటీపడ్డారు. అక్కడ ప్లాస్మాలో కనిపిస్తున్న బొమ్మలు కుషన్ పై ఉన్న బొమ్మలు సరి చేస్తూ బాక్స్ లోకి వెళ్లి నిలబడ్డారు.

కంటెస్టెంట్స్ మధ్య భీకర యుద్ధం..

Advertisement

టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ మధ్య ఒక భీకర యుద్ధం జరిగిందనే చెప్పాలి. నిఖిల్ అప్పటికే బాక్స్ లో ఉండగా టేస్టీ తేజ అక్కడున్న గుర్తు కలిగిన కుషన్ తీసుకెళ్లి బాక్స్ లో పెట్టి కింద పడిపోయాడు. దాంతో ఆ కుషన్ లాక్కునే ప్రయత్నం చేశారు నిఖిల్.అలా రెండు గ్రూపుల మధ్య గొడవలు గట్టిగానే జరిగాయి. ఆ తర్వాత పృథ్వీ ,ముక్కు అవినాష్ మధ్య వాగ్వాదం జరిగింది. ఇక తర్వాత నయనీ పావని, నిఖిల్ పోటీ పడగా.. నైయని పావనికి కుషన్ దొరికింది. కానీ నిఖిల్ ఆమె దగ్గర నుంచి కుషన్ లాక్కునే ప్రయత్నంలో ఆమె కింద పడిపోయింది. అయినా అతడు ఆమెను విడవలేదు. ఇక తర్వాత నయని పావని దగ్గరున్న కుషన్ ను లాకెళ్లి నిఖిల్ బాక్స్ లో నిల్చున్నాడు. ఎట్టకేలకు ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ సభ్యులు గెలిచారు. ఇక్కడ మోసం చేసి గెలిచారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆడవారిపై ప్రతాపం చూపించి నిఖిల్ గెలవడం పద్ధతిగా లేదని కొంతమంది అంటుంటే .. అది తన స్ట్రాటజీ అని ఇంకొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే టాస్క్ గెలిచిన రాయల్ క్లాన్ సభ్యులకు ప్రయోజనం లభించగా.. రాయల్ క్లాన్ సభ్యుల నుంచి మెగా చీఫ్ కంటెండర్ ను తొలగించే అవకాశం మీకు ఇస్తున్నామంటూ తెలిపారు. మొత్తానికైతే టాస్క్ లో గెలిచి సత్తా చాటిన ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ రాయల్ క్లాన్స్ సభ్యులపై రివేంజ్ ఎలా తీర్చుకుంటారో ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురు చూడాల్సిందే.

Related News

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

BiggBoss 10 : బిగ్ బాస్ లోకి క్రేజీ హీరోయిన్ ఎంట్రీ.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Ariana Glory : వామ్మో.. అరియనా నెలకు అన్ని లక్షలు సంపాదిస్తుందా..?

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

Big Stories

Advertisement
×