BigTV English
Advertisement

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా సెట్ లో ఫోటోలు వైరల్

Pawan Kalyan OG : పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా సెట్ లో ఫోటోలు వైరల్

Pawan Kalyan OG : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సుజిత్(Sujeeth) దర్శకత్వంలో ఓజీ(OG) అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. దీని కారణం చాలా సంవత్సరాలు తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న స్ట్రైట్ ఫిలిం ఇది. దానికి తోడు పవన్ కళ్యాణ్ వీరాభిమాని సుజిత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించడం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక అభిమాని ఎలా చూడాలి అని అనుకుంటాడు అని తెలిసిన దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది ఉన్నారు వారిలో హరీష్ శంకర్ ఒకడు అని చెప్పాలి. అందుకే పవన్ కళ్యాణ్ లో మిస్ అయిన ఎనర్జీని దాదాపు పదివేల తర్వాత ఒక రీమేక్ సినిమా అయినా గబ్బర్ సింగ్(Gabbar Singh) లో బయటకు తీసాడు. ఆ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా పబ్లిక్ టాక్ అప్పుడు సుజిత్ కూడా పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిచిన వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఆ సుజితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేస్తున్నాడు. కాబట్టి అంచనాలు పెరగకుండా ఎలా ఉంటాయి.


ఇకపోతే ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామని ఇది వరకే ప్రకటించారు. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయ పరిస్థితుల వలన ఈ సినిమా షూటింగ్ అప్పటికి పూర్తి కాలేదు. కచ్చితంగా ఈ సినిమాను 2025లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉంది చిత్ర యూనిట్. సినిమాకి సంబంధించి కేవలం 15 రోజులు మాత్రమే పవన్ కళ్యాణ్ కేటాయిస్తే షూటింగ్ అయిపోతుంది అని తెలుస్తుంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది పవన్ కళ్యాణ్ లేని సీన్స్ ను కొన్ని షూటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా సెట్ ని సందర్శించారు సంగీత దర్శకుడు తమన్. దర్శకుడు కెమెరామెన్ తో పాటు థమన్ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమాకి తమన్ సంగీత అందిస్తున్నాడు ఇదివరకే ఈ సినిమా నుంచి వచ్చిన హంగ్రీ చితా సాంగ్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుల్ మోహనన్ నటిస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు. ఇదివరకే రిలీజ్ అయిన లుక్ కూడా అదిరిపోయిందని చెప్పాలి. ఇక వీడియో గ్లిమ్స్ కి మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అలాగే సినిమా మీద కూడా మంచి అంచనాలను పెంచింది ఈ గ్లిమ్స్. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు సినిమాకు కూడా డేట్స్ ఇచ్చినట్లు సమాచారం వినిపిస్తుంది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఏదేమైనా కచ్చితంగా 2025లో పవన్ కళ్యాణ్ సినిమా అయితే ఒకటి మాత్రం రిలీజ్ అవుతుంది. ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా కొంత సమయాన్ని కేటాయిస్తున్నారు. వీటితోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఊస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు.


లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి BIGTV Whats APP Channelని ఫాలో అవ్వండి. ఈ కింద లింక్ క్లిక్ చేయండి 👇

https://whatsapp.com/channel/0029VaAe49e72WTw8YM6zr3q

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×