BigTV English

Bigg Boss 8 Promo : రెడ్ ఎగ్ తో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్… నిఖిల్ పదవికే ఎసరు పెట్టిన సోనియా

Bigg Boss 8 Promo : రెడ్ ఎగ్ తో ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్… నిఖిల్ పదవికే ఎసరు పెట్టిన సోనియా

Bigg Boss 8 Promo : బిగ్ బాస్ సీజన్ 8 రోజు రోజుకూ శృతి మించిన వైలెన్స్ తో జనాలకు చికాకు తెప్పిస్తోంది. రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటనలు సోషల్ మీడియా వేదికగా కంటెస్టెంట్స్ పై దారుణమైన ట్రోలింగ్ జరగడానికి కారణమయ్యాయి. ఇక లవ్ బర్డ్స్ గా పిలుచుకునే సోనియా, నిఖిల్ లకు బిగ్ బాస్ రెడ్ ఎగ్ తో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఏకంగా ఆ ఎగ్ తో నిఖిల్ పదవికి ఎసరు పెట్టేలా చేశాడు.


సోనియాపైన నిఖిల్ అలక

ప్రోమోలో సోనియా, నిఖిల్ ఇద్దరూ గొడవ పడుతూ కనిపించారు. గొడవ తర్వాత పడదాం ముందు తిందాం రా అంటూ అడిగిన నిఖిల్ కి అది ముందు అడిగి ఉండాల్సింది అంటూ సోనియా సమాధానం చెప్పి అక్కడి నుంచి సీరియస్ గా వెళ్ళిపోయింది. ఆ తర్వాత నిఖిల్ ఓ వైపు అభయ్ దగ్గర, మరోవైపు సీత, విష్ణు ప్రియ దగ్గర ఈ విషయం గురించి మాట్లాడుతూ కాసేపు బాధ పడ్డట్టుగా చూపించారు. ఆ తర్వాత అభయ్ సోనియా దగ్గరకు వచ్చి దీని గురించి మాట్లాడగా, సోనియా హౌస్ మొత్తం తిన్నాక ఆ సుద్దపూస తింటాడు. అలాంటిది వాడొచ్చి నన్ను తిన్నావా అని అడుగుతున్నాడు. వాడు చేసే ఎమోషనల్ రైడ్ నాకసలు నచ్చదు అంటూ  తన వెర్షన్ ను వినిపించింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ కలిసిపోయారా లేదా అన్న విషయాన్ని ప్రోమోలో చూపించలేదు బిగ్ బాస్. కానీ నిఖిల్ దగ్గర ఉన్న రెడ్ ఎగ్ తో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు.


Bigg Boss Telugu 8 | Day 19 - Promo 2 | Who will be the next contender? | Nagarjuna| Star Maa

నిఖిల్ కు కంటెండర్ గా సోనియా

బిగ్ బాస్ రెడ్ ఎగ్ ఎవరి దగ్గర ఉందని ప్రశ్నించడంతో నిఖిల్ తన దగ్గరే ఉందని సమాధానం చెప్పాడు. ఆ రెడ్ ఎగ్ ఉన్నవారు నెక్స్ట్ శక్తి టీంకు కంటెండర్ గా మారతారని వివరించిన బిగ్ బాస్ నిఖిల్ ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాడు అనే విషయాన్ని ప్రశ్నించాడు. అయితే నిఖిల్ ఏ మాత్రం ఆలోచించకుండా వెంటనే సోనియా పేరును చెప్పాడు. సోనియా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అంతకంటే ఎక్కువగానే పోరాడిన సీతను, విష్ణు ప్రియ ను, పృథ్వీని పక్కన పెట్టి నిఖిల్ సోనీయాను సెలెక్ట్ చేసుకోవడం పట్ల శక్తి క్లాన్ మెంబర్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కిరాక్ సీత అయితే అసలు నిఖిల్ తో మాట్లాడడమే మానేసింది. కానీ ఇదంతా జరిగాక ఇటు సోనియా, అటు నిఖిల్, పృథ్వి చాలా సంతోషపడ్డారు.

మరోవైపు ఎవరినీ నమ్మకూడదు అని గుణపాఠం మరోసారి బిగ్ బాస్ హౌజ్ లో తెలిసి వచ్చింది అంటూ మణికంఠ మళ్ళీ ఎమోషనల్ అయ్యాడు. కానీ ఇప్పుడు నిఖిల్ తీసుకున్న ఈ నిర్ణయం తర్వాత ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి. మొత్తానికి గొడవ పడ్డప్పటికి నిఖిల్, సోనియా మళ్లీ కలిసి పోయారు అన్న విషయాన్ని ప్రోమో చివర్లో చూపించారు. కానీ హౌస్ మేట్స్ కు ఇది ఊహించని షాక్.

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×